HDFC Bank Shares: దేశంలో అతి పెద్ద బ్యాంక్‌ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (HDFC Bank), 2022 డిసెంబర్‌ త్రైమాసికంలో, మార్కెట్‌ అంచనాలను మించి రాణించింది. మూడో త్రైమాసికంలో (Q3 Results) స్వతంత్ర ప్రాతిపదికన రూ. 12,259.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడేది ఇదే త్రైమాసికంలో ఈ కంపెనీ లాభం రూ. 10,342.2 కోట్లుగా నమోదైంది. గత ఏడాదితో పోల్చి చూస్తే, నికర లాభం ఇప్పుడు 18.5 శాతం పెరిగింది,


స్వతంత్ర ప్రాతిపదికన ఆదాయం సైతం మూడో త్రైమాసికంలో రూ. 40,651.60 కోట్ల నుంచి రూ. 51,207.61 కోట్లకు పెరిగింది. డిసెంబర్‌ 31 నాటికి స్థూల నిరర్థక ఆస్తులు (NPA) 1.23 శాతంగా ఉన్నాయి. నికర నిరర్థక ఆస్తులు గత త్రైమాసికంతో పోలిస్తే 0.37 శాతం నుంచి 0.33 శాతానికి తగ్గాయి. 24.6 శాతం వృద్ధితో, రూ. 22,987.8 కోట్ల వడ్డీ ఆదాయాన్ని బ్యాంక్‌ ఆర్జించింది. 


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ Q3 ఫలితాలు ఉత్సాహభరితంగా ఉన్నాయి. దీంతో, ఎనలిస్ట్‌లు ఈ కంపెనీ స్టాక్‌ మీద సానుకూలంగా (bullish view) ఉన్నారు.


ఈ స్టాక్‌ను ట్రాక్ చేస్తున్న 31 మంది ఎనలిస్టుల్లో 30 మంది 'బయ్‌' లేదా 'ఔట్‌పెర్ఫార్మ్‌' రేటింగ్‌ ఇచ్చారు. ఒకరు 'హోల్డ్' రేటింగ్‌ ఇచ్చారు. షేర్‌ ధర రూ. 1,905 మార్క్‌ను తాకుతుందని ఎక్కువ మంది ఎక్స్‌పర్ట్‌లు భావిస్తున్నారు. ప్రస్తుత స్థాయి నుంచి మరో 20% ర్యాలీ చేసే సత్తా ఈ స్టాక్‌ ఉందని దీని అర్ధం.


ఈ స్టాక్‌కు వివిధ బ్రోకరేజ్‌లు ఇచ్చిన రేటింగ్స్‌, టార్గెట్‌ ధరలు ఇవి:


బ్రోకరేజ్‌: Investec
స్టాక్‌ రేటింగ్‌: Hold
పాత టార్గెట్‌: 1,640
Q3 ఫలితాల తర్వాత ఇచ్చిన టార్గెట్‌: 1,690


బ్రోకరేజ్‌: Kotak Inst Equities
స్టాక్‌ రేటింగ్‌: Buy
పాత టార్గెట్‌: 1,750
Q3 ఫలితాల తర్వాత ఇచ్చిన టార్గెట్‌: 1,800


బ్రోకరేజ్‌: Nomura
స్టాక్‌ రేటింగ్‌: Buy
పాత టార్గెట్‌: 1,885
Q3 ఫలితాల తర్వాత ఇచ్చిన టార్గెట్‌: 1,690



బ్రోకరేజ్‌: HSBC
స్టాక్‌ రేటింగ్‌: Buy
పాత టార్గెట్‌: 1,910
Q3 ఫలితాల తర్వాత ఇచ్చిన టార్గెట్‌: 1,900


బ్రోకరేజ్‌: Motilal Oswal
స్టాక్‌ రేటింగ్‌: Buy
పాత టార్గెట్‌: 1,900
Q3 ఫలితాల తర్వాత ఇచ్చిన టార్గెట్‌: 1,930


బ్రోకరేజ్‌: IIFL (Institutional)
స్టాక్‌ రేటింగ్‌: Buy
పాత టార్గెట్‌: 2,000
Q3 ఫలితాల తర్వాత ఇచ్చిన టార్గెట్‌: 1,960


బ్రోకరేజ్‌: Macquarie
స్టాక్‌ రేటింగ్‌: Outperform
పాత టార్గెట్‌: 2,005
Q3 ఫలితాల తర్వాత ఇచ్చిన టార్గెట్‌: 2,005


బ్రోకరేజ్‌: CLSA
స్టాక్‌ రేటింగ్‌: Buy
పాత టార్గెట్‌: 2,025
Q3 ఫలితాల తర్వాత ఇచ్చిన టార్గెట్‌: 2,025


బ్రోకరేజ్‌: BNP Paribas Asia
స్టాక్‌ రేటింగ్‌: Buy
పాత టార్గెట్‌: 2,030
Q3 ఫలితాల తర్వాత ఇచ్చిన టార్గెట్‌: 2,030


బ్రోకరేజ్‌: Bernstein
స్టాక్‌ రేటింగ్‌: Outperform
పాత టార్గెట్‌: 2,200
Q3 ఫలితాల తర్వాత ఇచ్చిన టార్గెట్‌: 2,200


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.