Gautam Adani is back on the top-20 billionaires list: అదానీ గ్రూప్ ఓనర్ గౌతమ్ అదానీ హవా మళ్లీ కొనసాగుతోంది. దేశంలో రెండో అత్యంత ధనవంతుడైన అదానీ సంపద విలువ ఒక్కసారిగా పెరిగింది. దీంతో, ప్రపంచంలోని టాప్ 20 సంపన్నుల జాబితాలో మళ్లీ గౌతమ్ అదానీ పేరు చేరింది.
నిన్న (మంగళవారం, 28 నవంబర్ 2023) అదానీ గ్రూప్ షేర్లు విపరీతంగా ర్యాలీ చేశాయి. దీనివల్ల, అదానీ గ్రూప్ మార్కెట్ విలువ ఏకంగా 1 లక్ష కోట్లు పెరిగింది. గ్రూప్‌లో మేజర్ షేర్ హోల్డర్ అయిన అదానీ సంపద విలువ (Gautam Adani wealth) కూడా అమాంతం ఎగబాకింది. ఆస్తుల విలువ పెరగడంతో, బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ల జాబితాలో (Bloomberg top 20 billionaires in the world) రెండు స్థానాలు మెరుగుపరుచుకుని, టాప్-20లోకి అదానీ తిరిగి వచ్చారు. అంతకుముందు, ఈ జాబితాలో 22వ స్థానంలో ఉన్నారు. అదానీ నికర విలువ (Gautam Adani networth) 6.5 బిలియన్ డాలర్లు పెరిగి 66.7 బిలియన్లను దాటింది.
షేర్లలో భారీ పెరుగుదల
మంగళవారం, అదానీ గ్రూప్ స్టాక్స్‌లోని లిస్టెడ్ కంపెనీల షేర్లు దాదాపు 20 శాతం వరకు లాభపడ్డాయి. అదానీ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ (Adani group market capitalisation 2023) సోమవారం బిజినెస్ అవర్స్ ముగిసే నాటికి రూ.10.27 లక్షల కోట్లుగా ఉండగా, మంగళవారం ట్రేడింగ్ ముగింపు సమయానికి రూ.11.31 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే, కేవలం 24 గంటల వ్యవధిలో రూ. 1.04 లక్షల కోట్లు పెరిగాయి. ఈ ఏడాది జనవరి 24న హిండెన్‌బర్గ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత, అదానీ గ్రూప్ షేర్లు ఒక్కరోజులో ఇంతగా పెరగడం ఇదే తొలిసారి.
అదానీ స్టాక్స్ ర్యాలీకి కారణాలు
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research report) కేసులో సుప్రీంకోర్టులో విచారణ పూర్తయింది. ఆ కేసులో తీర్పును అత్యున్నత న్యాయస్థానం రిజర్వ్ చేసింది. అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడినట్లు తమకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని సెబీ ఇప్పటికే సుప్రీంకోర్టుకు చెప్పింది. ఈ నేపథ్యంలో, అత్యున్నత న్యాయస్థానం తీర్పు అదానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా ఉండదు అన్న ఊహాగానాలతో అదానీ కంపెనీల షేర్లు పెరుగుతున్నాయి.
దీనికితోడు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై (Election Results of Five States) అంచనాలు, వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలు (General Elections 2024) కూడా అదానీ గ్రూప్ షేర్లను వేగంగా నడిపిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ బలం పెరుగుతుందని, మరోమారు కమలం పార్టీనే అధికారంలోకి వస్తుందని ఇటీవల కొన్ని రిపోర్ట్స్ మార్కెట్‌లో చక్కర్లు కొట్టాయి. ప్రభుత్వం మారకపోతే అదానీ గ్రూప్ లాభపడుతుందని మార్కెట్ భావిస్తోంది.
13వ ప్లేస్‌లో ముకేష్ అంబానీ
బ్లూమ్‌బెర్గ్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో, మన దేశంలో అత్యంత సంపన్న వ్యక్తి ముకేష్ అంబానీ 13వ స్థానంలో నిలిచారు. అతని మొత్తం నికర విలువ (Mukesh Ambani networth) దాదాపు 89.5 బిలియన్ డాలర్లు. ఈ ఏడాది ముకేష్ అంబానీ సంపద 2.34 బిలియన్ డాలర్లు పెరిగింది.
టెస్లా, ఎక్స్ వంటి గ్లోబల్ కంపెనీల ఓనర్ ఎలాన్ మస్క్ (Elon Musk) ప్రపంచ సంపన్నుల లిస్ట్‌లో ఫస్ట్ ర్యాంక్‌లో ఉన్నారు. అతని మొత్తం సంపద విలువ 228 బిలియన్ డాలర్లు. రెండో స్థానంలో, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) పేరు ఉంది, అతని నికర విలువ 171 బిలియన్ డాలర్లు. బెర్నార్డ్ ఆర్నాల్ట్ (Bernard Arnault) 167 బిలియన్ డాలర్ల సంపదతో మూడో స్థానంలో ఉన్నారు.
మరో ఆసక్తికర కథనం: డిసెంబర్‌లో బ్యాంక్‌లకు 18 రోజులు సెలవులు, 6 రోజులు సమ్మె - ఇక మీ బ్యాంక్ పని అయినట్టే!
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply