Surprising Gift Ideas For Fathers on Father's Day 2024: ఈ నెల 16వ తేదీన (ఆదివారం) పితృ దినోత్సవం. తాను మెట్లుగా మారి, పిల్లలను ఉన్నత స్థాయికి చేర్చిన వ్యక్తిని గుర్తు చేసుకోవాల్సి రోజది. వాస్తవానికి తండ్రి చేసిన త్యాగాలను మననం చేసుకోవడానికి, మూల్యం చెల్లించడానికి ఒక్కరోజు కాదుగదా, మన జీవితకాలమూ సరిపోదు. కానీ, తల్లిదండ్రుల పట్ల తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు ఫాదర్స్ డే ఒక అవకాశంగా మాత్రం ఉపయోగపడుతుంది.
మీ నాన్నకు లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఇష్టం ఉంటే, జీవితంలోని అన్ని విషయాలను చక్కగా ఆస్వాదించే వ్యక్తి అయితే... ఈ ఫాదర్స్ డేని మర్చిపోలేని విధంగా మార్చే ఏడు బహుమతులు ఇవిగో...
ప్రత్యేక వాలెట్
మీ నాన్నగారి పేరులోని మొదటి అక్షరం లేదా ప్రత్యేక సందేశంతో ఉన్న వాలెట్, మీరు ఇచ్చే మంచి బహుమతి అవుతుంది. ఆ వాలెట్‌ను ఆయన ముట్టుకున్నప్పుడల్లా మీరే గుర్తుకొస్తారు, మీ ప్రేమ ఆయన్ను సంతోషపెడుతుంది. మీరు ఇలాంటి గిఫ్ట్ ఎంచుకోవాలనుకుంటే, నాణ్యతలో మాత్రం రాజీ పడొద్దు.
స్మార్ట్ హోమ్ గాడ్జెట్
మీ తండ్రికి టెక్నాలజీ అంటే ఇష్టం, అవగాహన ఉంటే... ధ్వని ఆధారంగా పని చేసే (వాయిస్-యాక్టివేటెడ్ అసిస్టెంట్) హోమ్ గాడ్జెట్‌లను గిఫ్ట్‌గా ఇవ్వండి. దీనివల్ల ఆయన సౌలభ్యం పెరుగుతుంది, లేటెస్ట్ టెక్నాలజీ తన దగ్గర ఉందని సంబరపడతారు.
ఫిట్‌నెస్ ట్రాకర్
ఫిట్‌నెస్ ట్రాకర్‌ను బహుమతిగా ఇచ్చి మీ తండ్రి చురుగ్గా, ఆరోగ్యంగా ఉండేందుకు సాయం చేయండి. బీపీ, హార్ట్‌బీట్ లెవెల్స్‌ను అలెర్ట్ రూపంలో ఎప్పటికప్పుడు సూచించే ఫీచర్లు వాటిలో ఉండేలా చూసుకోండి. ఈ పరికరాల వల్ల మీ తండ్రి ఆరోగ్యం గురించి మీకు కూడా అవగాహన పెరుగుతుంది.
లగ్జరీ షేవింగ్ కిట్
ఖరీదైన షేవింగ్ కిట్ ఇచ్చి మీ నాన్నగారిని ఆశ్చర్యపరచొచ్చు. ఎక్కువ నాణ్యమైన రేజర్, షేవింగ్ క్రీమ్, ఆఫ్టర్ షేవ్ బామ్ వంటి సెట్‌ను మీ తండ్రి కోసం తీసుకెళ్లండి. దీనివల్ల ఆయన దినచర్య మరింత విలాసవంతంగా మారుతుంది.
పెర్‌ఫ్యూమ్
ఒక్క ఫాదర్స్ డే నాడు మాత్రమే కాదు, ఎలాంటి సంతోషకర సందర్భంలోనైనా పెర్ఫ్యూమ్ ఒక గొప్ప బహుమతిగా నిలుస్తుంది. పెర్‌ఫ్యూమ్ నుంచి వచ్చే సుగంధంతో మీ నాన్న తన తోటివారిని, చుట్టుపక్కల పరిసరాలను కూడా ఆహ్లాదకరంగా మారుస్తారు. ఈ విభాగంలో గిఫ్ట్ బాక్స్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ప్రత్యేకమైన ఫోటో బుక్
మీ నాన్నగారి జీవితంలోని ప్రతి ఘట్టం, మధుర క్షణాలను బంధించిన ఫొటోలతో ఒక ఫోటో బుక్ సృష్టించండి. ఫ్యామిలీ వెకేషన్స్, ప్రత్యేక సందర్భాలు, పండుగలు మాత్రమే కాదు... రోజువారీ జీవనంలో తీసిన ఫోటోలను కూడా సేకరించి, వాటిని అందంగా ఆల్బమ్‌లో పేర్చి ఇవ్వండి. మీ తండ్రి కళ్లలో ఆశ్యర్యం, ఆనందం తప్పక కనిపిస్తాయి.
వాచ్
ఇదొక సులభమైన ఆప్షన్. ఆ వాచ్‌లో తిరిగే ముల్లు, మీ తండ్రిపై మీకున్న ప్రేమను ప్రతి సెకనూ గుర్తు చేస్తుంది. వాచ్ అనేది ఒక క్లాసిక్ గిఫ్ట్. ఆయన ఇష్టపడే స్మార్ట్ వాచ్ లేదా అనలాగ్ వాచ్, మెటల్ బెల్ట్ లేదా లెదర్ స్ట్రాప్, ఆయనకు నచ్చే డయల్, రంగు ఉన్న వాచ్‌ను తీసుకెళ్లండి. మీ నాన్నగారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిచేలా ఆ వాచ్ ఉండాలి.
మీ నాన్నగారిని డిన్నర్‌కు తీసుకెళ్లడం లేదా ఇంట్లోనే చిన్న సర్‌ప్రైజ్‌ను కూడా ప్లాన్ చేయొచ్చు.
మరో ఆసక్తికర కథనం: మీ తండ్రి టెక్ ఫ్రెండ్లీ అయితే ఫాదర్స్ డే నాడు గిఫ్ట్‌గా ఇవ్వదగిన గాడ్జెట్‌లు ఇవే