EPFO Payroll Data: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కొత్తగా 17.20 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్‌లను యాడ్‌ చేసింది. అంతకుముందు నెల మార్చిలో కేవలం 13.40 లక్షల మంది చందాదార్లు మాత్రమే EPFOలోకి అడుగు పెట్టారు. ఏప్రిల్‌లో సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న 17.20 లక్షల మందిలో 8.47 లక్షల మంది ఫ్రెషర్స్‌. అంటే, వీళ్లంతా తొలిసారి ఈపీఎఫ్‌వో మెంబర్స్‌ అయ్యారు. కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ EPFO ప్రొవిజనల్‌ పేరోల్ డేటాను విడుదల చేసింది.


వర్క్‌ఫోర్స్‌లో యువశక్తి       
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలోకి ‍(EPFO) కొత్తగా వచ్చిన వారిలో 54.15 శాతం మంది 18-25 ఏళ్ల మధ్య వయస్సున్న వాళ్లే. వీళ్లలోనూ ఆర్గనైజ్డ్‌ సెక్టార్‌లో పని చేస్తున్నవాళ్లే ఎక్కువగా ఉన్నారు. అంటే, సంఘటిత రంగంలోకి వస్తున్న యూత్‌ వర్క్‌ఫోర్స్‌ పెరిగింది. డేటా ప్రకారం, 12.50 లక్షల మంది EPFO నుంచి బయటకు వచ్చి, మళ్లీ జాయిన్‌ (Rejoiners) అయ్యారు. వీళ్లంతా ఒక ఉద్యోగం మానేసిన తర్వాత, మరో ఉద్యోగంలో చేరి మళ్లీ ఫ్రెష్‌గా EPFOలో మెంబర్స్‌ అయ్యారు.  ఉద్యోగం మారి వేరే కంపెనీల్లో చేరిన వ్యక్తులు, అప్పటి వరకు తమ ఖాతాలో ఉన్న పీఎఫ్‌ డబ్బును విత్‌డ్రా చేసుకోకుండా, సోషల్‌ సెక్యూరిటీ స్కీమ్‌లోనే కొనసాగేందుకు ఇష్టపడుతున్నారు. కొత్త జాబ్‌లో చేరిన తర్వాత తమ అకౌంట్‌ను కంటిన్యూ చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో రీజాయినీస్‌ సంఖ్య 10.09 లక్షలుగా ఉంది.


ఏప్రిల్ నెలలో EPFO నుంచి వెళ్లిపోయినవాళ్లు 3.77 లక్షల మంది. 2023 మార్చితో పోలిస్తే ఈ సంఖ్య 11.67 శాతం తగ్గింది.              


ఇది కూడా చదవండి: మీ కుమార్తె చదువుకుంటే సర్కారే డబ్బులిస్తుంది, సెంట్రల్‌ స్కీమ్‌ ఇది   


మహిళల గణాంకాలు       
ఏప్రిల్‌లో, EPFOలో మెంబర్స్‌గా మారిన మహిళల సంఖ్య నికరంగా 3.48 లక్షలు. మార్చిలో ఈ సంఖ్య 2.57 లక్షలు. ఏప్రిల్‌లో సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న మొత్తం 8.47 లక్షల మంది కొత్త వాళ్లలో 2.25 లక్షల మంది అతివలే. కొత్త ఎన్‌రోల్‌మెంట్‌లో మహిళా సభ్యుల సంఖ్య 26.61 శాతం పెరిగింది. గత ఆరు నెలల్లోనే ఇది అత్యధికం. వర్క్‌ఫోర్స్‌లో పెరుగుతున్న మహిళా భాగస్వామ్యానికి ఇది నిదర్శనం.        


ఏప్రిల్‌లో, EPFOలో జాయిన్‌ అయిన నెట్‌ మెంబర్స్‌లో కేవలం 5 రాష్ట్రాల నుంచే దాదాపు 60 శాతం మంది ఉన్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌, దిల్లీ నుంచి 59.20 శాతం సభ్యులు సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్నారు.


ఏ ఇండస్ట్రీలో ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి?           
ఇండస్ట్రీల వారీగా వర్క్‌ఫోర్స్‌ డేటాను పరిశీలిస్తే... మాన్యుఫాక్చరింగ్‌, ఐటీ ఉద్యోగాల్లో గరిష్ట వృద్ధి కనిపించింది. వీటి తర్వాత మార్కెటింగ్‌, కంప్యూటర్ల వినియోగం-సర్వీసెస్‌ రంగంలో ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి. ఆ తర్వాత.. ఎలక్ట్రికల్, మెకానికల్‌, జనరల్ ఇంజినీరింగ్ ప్రొడక్ట్స్‌, ట్రేడింగ్ - కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ నిలిచాయి.


మరో ఆసక్తికర కథనం: గ్రీన్‌చెఫ్‌ IPO ప్రైస్‌ బ్యాండ్‌ ఫిక్స్‌, బిడ్‌ వేద్దామనుకుంటున్నారా? 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial