Elon Musk Political Views: ట్రంప్ అంటే మస్క్‌ మామకి ఎందుకింత లవ్?

ABP Desam   |  Murali Krishna   |  19 May 2022 05:31 PM (IST)

Elon Musk Political Views: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు ఎందుకంత ప్రేమ?

ట్రంప్ అంటే మస్క్‌ మామకి ఎందుకింత లవ్?

Elon Musk Political Views: బిలియనీర్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తాజాగా ఓ ట్వీట్ చేశారు. కొద్ది రోజులుగా అమెరికా రాజకీయాల గురించి తరుచూ స్పందిస్తున్న మస్క్ తాజాగా ఇందుకు సంబంధించి ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. తాను గతంలో డెమొక్రటిక్ పార్టీకి ఓటేశానని ఇప్పుడు ఎంత మాత్రం వారికి మద్దతు ఇవ్వబోనని, ఇక తాను రిపబ్లికన్ పార్టీకే ఓటు వేస్తానని బహిరంగంగా ప్రకటించారు.

గతంలో నేను డెమొక్రటిక్ పార్టీకి ఓటేశాను. ఎందుకంటే ఆ పార్టీ చాలామట్టుకు దయగలిగినది అనిపించింది. కానీ క్రమంగా ద్వేషపూరిత రాజకీయాలు చేస్తూ ఆ పార్టీ మారిపోయింది. ఇంకెంత మాత్రం ఆ పార్టీకి మద్దతు ఇవ్వబోను. రిపబ్లికన్ పార్టీకి ఓటేస్తాను.                                                     - ఎలాన్ మస్క్, టెస్లా సీఈఓ

అలానే తనపై రాజకీయంగా ఎదురయ్యే సవాళ్లను సైతం మస్క్ ప్రస్తావించారు. అదే ట్వీట్‌లో "ఇక చూడండి.. నాకు వ్యతిరేకంగా వాళ్లు చేసే చెత్త ప్రచారం" అని రాసుకొచ్చారు. దీనికి కొనసాగింపుగా "రాబోయే రోజుల్లో రాజకీయ దాడులు నాపై నాటకీయంగా పెరుగుతాయి" అని మరో ట్వీట్ కూడా చేశారు.

ట్రంప్‌పై

తాను ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తున్న తరుణంలో రిపబ్లికన్ పార్టీ నేత అయిన డొనాల్డ్ ట్రంప్ గురించి ఇటీవల మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని మస్క్ ప్రతిపాదించారు. దీనిపై ట్రంప్ కూడా స్పందించారు.

మస్క్ మంచి వ్యక్తని, అయినప్పటికీ తాను మళ్లీ ట్విట్టర్‌ వినియోగించబోనని తేల్చిచెప్పారు. తాను స్థాపించిన సామాజిక మాధ్యమ వేదిక  సోషల్‌ను వినియోగిస్తానన్నారు.

Also Read: Sunil Jakhar Joins BJP: కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు- భాజపాలోకి మరో సీనియర్ నేత

Also Read: Navjot Singh Sidhu: సిద్ధూకు ఏడాది జైలు శిక్ష- 34 ఏళ్ల క్రితం కేసులో సుప్రీం తీర్పు

 

Published at: 19 May 2022 05:29 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.