ABP  WhatsApp

Sunil Jakhar Joins BJP: కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు- భాజపాలోకి మరో సీనియర్ నేత

ABP Desam Updated at: 19 May 2022 05:15 PM (IST)
Edited By: Murali Krishna

Sunil Jakhar Joins BJP: కాంగ్రెస్ నుంచి మరో సీనియర్ నేత సునీల్ జాఖడ్ భాజపాలో చేరారు.

కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు- భాజపాలోకి మరో సీనియర్ నేత

NEXT PREV

Sunil Jakhar Joins BJP: 2024 లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. గుజరాత్ యువనేత హార్థిక్ పటేల్ రాజీనామా మరువకముందే మరో సీనియర్ నేత పార్టీకి దూరమయ్యారు. పంజాబ్‌ కాంగ్రెస్ సీనియర్ నేత సునీల్ జాఖడ్ భాజపాలో చేరారు. భాజపా జాతీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో జాఖడ్ ఆ పార్టీలో చేరారు. 





పంజాబ్‌లో కొంతమంది కాంగ్రెస్‌ నేతలు నాపై అధిష్టానానికి తప్పుడు సంకేతాలు పంపించారు. అందుకు నాపై కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చర్యలు తీసుకున్నందుకు చాలా బాధపడ్డాను. కానీ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మంచి వ్యక్తి. భజనపరుల్ని దూరం పెట్టి శత్రువులెవరో, మిత్రులెవరో ఆయన తెలుసుకోవాలి.                                                                               -  సునీల్ జాఖడ్, పంజాబ్ సీనియర్ నేత


అంతకుముందు


ఇటీవల జాఖడ్.. కాంగ్రెస్ పార్టీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫేస్‌బుక్‌ లైవ్‌లో కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు.



నా గుండె బద్దలైంది. అందుకే పార్టీలో 50 ఏళ్ల అనుబంధాన్ని వదులుకుంటున్నాను. కాంగ్రెస్‌కు నేను చెప్పే ఆఖరి మాటలివే. గుడ్‌ లక్‌. అండ్‌ గుడ్‌బై కాంగ్రెస్‌.                                                                 - సునీల్ జాఖడ్, పంజాబ్ సీనియర్ నేత


విదేశాలకు రాహుల్


ఓవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేతలు బయటకు వెళ్లిపోతుంటే మరోవైపు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశాలకు బయల్దేరారు. రాహుల్ గాంధీ లండన్‌లో శుక్రవారం జరిగే 'ఐడియాస్ ఫర్ ఇండియా' సదస్సులో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా భారత సంతతి ప్రజలతో దేశ ప్రస్తుత, భవిష్యత్తు పరిణామాలపై ఆయన మాట్లాడతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 


Also Read: Navjot Singh Sidhu: సిద్ధూకు ఏడాది జైలు శిక్ష- 34 ఏళ్ల క్రితం కేసులో సుప్రీం తీర్పు


Also Read: Krishna Janmabhoomi Row: శ్రీకృష్ణ జన్మభూమిలో ఈద్గా తొలగింపుపై పిటిషన్​- విచారణకు కోర్టు ఓకే

Published at: 19 May 2022 05:13 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.