Elon MusK Tesla:  భారత్ లో ప్లాంట్ పెట్టడానికి సిద్ధమైన ఎలాన్ మస్క్ చివరి క్షణంలో వెనుకడుగు వేశారు. షోరూంలు పెట్టి కార్లు మాత్రమే అమ్మాలనుకుంటున్నారని కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రకటించారు. పరిశ్రమ పెట్టేందుకు మొదటి సారి సమావేశానికి టెస్లా బృందం వచ్చింది. కానీ తర్వాత సమావేశాలకు హాజరు కాలేదు. దీంతో టెస్లాకు ప్లాంట్ పెట్టే ఉద్దేశం లేదని స్పష్టమయింది.

భారత ప్రభుత్వం 2024లో కొత్త ఎలక్ట్రిక్ వాహన (EV) విధానాన్ని  ప్రకటించింది.  కనీసం  500 మిలియన్ డాలర్ల పెట్టుబడితో స్థానికంగా ఉత్పత్తి చేసే  కంపెనీలకు దిగుమతి సుంకాలను 70-100 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లుగా ప్రకటించింది.  కేవలం టెస్లా కోసమే ఈ విధానాన్ని తెచ్చారన్న ప్రచారం బిజినెస్ వర్గాల్లో జిగింది.    టెస్లా 2 నుంచి 5 బిలియన్ డాలర్ల  పెట్టుబడితో భారతదేశంలో ఒక EV ప్లాంట్ స్థాపించే అవకాశాన్ని పరిశీలిస్తోందని అప్పట్లో ప్రచారం జరిగిదంి.  మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు,  ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ప్లాంట్ అనుకూలతలపై పరిశీలన చేసింది. కానీ ప్రస్తుతం స్థానిక ఉత్పాదనకు ఆసక్తి చూపడం లేదు . 

ఎలాన్ మస్క్ వెనుకడుగు వేయడానికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అని భావిస్తున్నారు. మస్క్ తన ఆలోచన ప్రకటించిన మొదట్లో  టెస్లా భారతదేశంలో ప్లాంట్ స్థాపించడం "అన్యాయం" అని పేర్కొన్నారు, భారతదేశం అధిక సుంకాలను విధిస్తుందని,   అమెరికా కూడా పరస్పర సుంకాలను విధించాలని  నిర్ణయించారు. భౌగోళిక-రాజకీయ ఒత్తిడి,  మార్కెట్ సవాళ్లు టెస్లా నిర్ణయాలను ప్రభావితం చేశాయని అనుకవోచ్చు.  టెస్లా సమీప భవిష్యత్తులో దిగుమతుల ద్వారా మార్కెట్‌లోకి ప్రవేశించి, ఆ తర్వాత కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ లేదా స్థానిక ఉత్పాదనను పరిశీలించే అవకాశం ఉందని టెస్లా వర్గాలు చెబుతున్నాయి. 

అయితే దిగుమతి చేసిన విద్యుత్ కార్లను ఇండియాలో అమ్మేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. గతంలో ఇలా అమ్మే విషయంలో సుంకాలు తగ్గించేందుకు కేంద్రం అంగీకరించలేదు. తయారు చేసి అమ్మాలనే కండిషన్ పెట్టింది. ఇప్పుడు ముందుగా అమ్మకాలు చేపట్టనున్నారు  టెస్లా ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో 4,000 చదరపు అడుగుల స్థలాన్ని ఐదు సంవత్సరాల లీజుకు తీసుకుంది.  విక్రయాలు, కస్టమర్ సపోర్ట్,   వాహన సేవలకు సంబంధించిన ఉద్యోగుల్ని నియమించుకుంది.  టెస్లా మోడల్ Y , మోడల్ 3 వాహనాల కోసం భారతదేశంలో హోమోలోగేషన్ , సర్టిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించింది.  ఇది భారత మార్కెట్‌లో అమ్మకాలను ప్రారంభించడానికి అవసరం.