RBI: రూ.2000 నోట్లపై RBI కీలక ప్రకటన చేసింది. రూ.2 వేల నోట్లు ఇంకా పూర్తిస్థాయిలో తమ వద్దకు చేరలేదని రూ.6,181 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు ఉన్నాయని ప్రజల వద్దే ఉండిపోయాయని తెలిపింది. వాటిని నిర్దేశించిన పోస్టాఫీసుల్లో వాటిని మార్చుకోవచ్చని  అవకాశం ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మే 19, 2023న రూ. 2000 విలువ కలిగిన నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి నోట్లను మార్చుకోవడానికి చాలా కాలం సమయం ఇచ్చారు. దాదాపుగా రెండేళ్ల తర్వాత అంటే  మే 02, 2025న  రూ. 2000 నోట్లను మార్చుకునే గడువు ముగిసిందని ప్రకటిచింది. 

మే 19, 2023 నాటికి 3.56 లక్షల కోట్లుగా  రూ. 2000 నోట్ల మొత్తం విలువ ఉంది. మే 31, 2025న వ్యాపారం ముగిసే సమయానికి రూ.6,181 కోట్లకు తగ్గింది.అంటే ఇకా అంత మేర ప్రజల వద్ద నగదు ఉంది.  చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్లలో 98.26 శాతం వెనక్కి వచ్చాయి.  

సంపదలో వంద శాతం వెనక్కి రావడం అనేది దాదాపుగా ఉండకపోవచ్చని భావిస్తున్నారు. కొంత అక్రమ సంపాదనను చాలా మంది బయట పెట్టడానికి భయపడే అవకాశం ఉంది.  అదే సమయంలో టాక్స్ లు కట్టని సొమ్ముల్ని కూడా బయట పెట్టలేరు.  చెలామణిలో కొన్ని నోట్లు ఎక్కడో చోట మిస్సయి పోయే ప్రమాదం ఉంది. ఇలా వివిధ కారణాలతో కనీసం చెలామణిలో ఉన్న రెండు శాతం నోట్లు మిస్ అవుతూ ఉంటాయని..   అంత కంటే తక్కువ స్థాయిలోనే మిస్సింగ్ నోట్లు ఉన్నట్లుగా తేలినందుకు మార్చుకునే అవకాశం ఇచ్చినా ఎక్కువగా వెనక్కి రాకపోవచ్చని భావిస్తున్నారు.