ఒకప్పుడు కారును కొనుగోలు చేయాలంటే ముందుగా వెళ్లి బుక్ చేసుకుంటే నాలుగు నెలలకో ఐదు నెలలకో డెలివరీ ఇస్తారు. కానీ కొన్నేళ్లుగా ఆ పరిస్థితి మారిపోయింది. నచ్చిన కారును డబ్బులు కట్టి డెలివరీ తెచ్చుకోవడమే అన్నట్లుగా మారింది. ఎందుకంటే భారత్‌లో పెరిగిన అవకాశాలతో చాలా సంస్థలు ఇక్కడే తయారీని ప్రారంభించాయి. కానీ ఇప్పుడు మళ్లీ కార్ల కొరత ఏర్పడుతోంది. అయితే దీనికి కారణం పరిశ్రమలు మూతపడటమో మరో కారణమో కాదు. ఓ చిప్. కార్ల తయారీలో ఉపయోగించే ఓ చిన్నచిప్ ఇప్పుడు లభించడం లేదు. ఈ కారణంగా కార్ల తయారీ మందగించింది.


Also Read : ఈడీ విచారణకు తీరిక లేదన్న రకుల్


ఇటీవలి కాలంలో సెమీకండక్టర్ చిప్స్ ఆటోమొబైల్ పరిశ్రమలో చాలా కీలకంగా మారాయి.  ప్రస్తుతం మధ్యశ్రేణి, హైఎండ్‌ కార్లలో చిప్‌సెట్‌ల వినియోగం చాలా ఎక్కువగా ఉంది. కార్లలోని ఎయిర్‌బ్యాగ్‌లు, ఇంజిన్‌ కంట్రోల్‌ యూనిట్‌, ట్రాన్స్‌మిషన్‌ కంట్రోల్‌ యూనిట్‌, డిస్‌ప్లే, ఓడోమీటర్‌.. ఇలా అన్నింటికీ చిప్‌సెట్‌ కావాలి.  ఇప్పటి కార్లలో మెకానికల్‌ అప్లికేషన్‌ కోసం చిప్‌సెట్‌ కావాలి. అద్దాలపై వర్షం పడటం ప్రారంభం కాగానే, వాతంటత అవే వైపర్స్‌ పనిచేసేలా చూసేందుకు సెన్సర్‌లు అమరుస్తున్నారు. ఇందులో చిప్‌సెట్‌లు కావాలి. ఇంజిన్‌, ఎగ్జాస్ట్‌లకూ సెన్సర్లు ఉంటున్నాయి.


Also Read : పవర్ స్టార్‌ అని పవన్ కల్యాణ్‌కు ట్యాగ్ ఇచ్చిందెవరు..?


కార్లు తయారీలో మ్యూజిక్ సిస్టం దగ్గర నుంచి ప్రమాద హెచ్చరికలు, ఎయిర్ బ్యాగ్స్ జీపీఎస్ సిస్టమ్,  బ్లూటూత్ కనెక్టివిటీ, డ్రైవర్-అసిస్టెన్స్ ఫీచర్లు, నావిగేషన్ ఎక్విప్‌మెంట్‌లు, హైబ్రిడ్-ఎలక్ట్రిక్ సిస్టమ్‌ వంటివి అత్యాధునిక టెక్నాలజీ ద్వారానే రూపొందిస్తున్నారు. వాటి కోసం ప్రత్యేకంగా తయారు చేసే టెక్నాలజీ సెమీకండక్టర్ చిప్స్ వాడతారు. కరోనా కారణంగా ఈ చిప్‌ల తయారీ మందగించింది. ప్రపంచంలో చిప్‌సెట్‌లు తయారు చేసేది కొన్ని కంపెనీలే.  చిప్‌సెట్‌ల కొరత వాహన పరిశ్రమను బాగా ఇబ్బంది పెడుతోంది. గిరాకీ-సరఫరాల మధ్య అంతరాలే ఇందుకు కారణం.  కొవిడ్‌ వ్యాప్తి ప్రారంభమై, లాక్‌డౌన్‌ విధించినప్పుడు వాహన తయారీ రంగం కూడా స్తంభించింది. లాక్‌డౌన్‌ తొలగించినా, వాహనాలకు గిరాకీ వెంటనే రాదనే భావనతో కంపెనీలు తయారీ తగ్గించాయి. ఫలితంగా వాహన కంపెనీల నుంచి చిప్‌సెట్‌ సరఫరాలను డిజిటల్‌ పరికరాల తయారీ సంస్థలకు మళ్లాయి.


  
ప్రపంచంలో బాష్‌, వెస్టియాన్‌, కాంటినెంటల్‌, హిటాచీ, డెల్‌ వంటి దిగ్గజాలు వాహన సంస్థలకు చిప్‌సెట్‌లున్న ఎలక్ట్రానిక్స్‌ ప్రధానంగా సరఫరా చేస్తున్నాయి. సెల్‌ఫోన్లు, బొమ్మలు, టెలివిజన్‌లు, కంప్యూటర్లు, వాహన తయారీ కంపెనీలన్నింటికీ  దిగ్గజ కంపెనీల నుంచే సిలికాన్‌ చిప్‌సెట్‌లు సరఫరా అవుతుంటాయి. మోడల్‌, అప్లికేషన్‌, తయారీసంస్థకు అనుగుణంగా చిప్‌ డెఫినిషన్‌ మారుతుంటుంది. అలా ప్రత్యేకంగా కంపెనల కోసం చిప్‌లు తయారు చేయాల్సి ఉంటుంది.  ఈ సెమీకండక్టర్ చిప్స్ లేకుండా, కారును పూర్తి స్థాయిలో రెడీ చేయలేరు. ఫలితంగా కార్ల ఉత్పత్తి మందగించింది. అందుకే కంపెనీలన్నీ ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయి. ఫలితంగా కారు కొందామనుకున్నా వెయిటింగ్‌లో ఉండక తప్పదు.