Dividend Stocks: స్టాక్‌ మార్కెట్‌ నుంచి అట్రాక్టివ్‌ ఇన్‌కమ్‌ సంపాదించే తెలివైన నిర్ణయాల్లో.. డివిడెండ్‌ స్టాక్స్‌ను ఎంచుకోవడం ఒకటి. మార్కెట్ సెంటిమెంట్‌, రోలర్‌ కోస్టర్‌ రైడ్‌తో సంబంధం లేకుండా డివిడెండ్స్‌ వచ్చి పడుతుంటాయి. స్థిరమైన పేమెంట్స్‌తో పెట్టుబడిదార్ల బ్యాంక్‌ బ్యాలెన్స్‌ను పెంచుతుండడం వల్ల, ఎక్కువ డివిడెండ్ చెల్లించే స్టాక్స్‌కు దలాల్‌ స్ట్రీట్‌లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. 


FY23లో అత్యధికంగా 5,000% వరకు డివిడెండ్‌ చెల్లించిన 10 స్టాక్స్‌:


కోల్ ఇండియా ‍‌(Coal India)
ప్రస్తుతం షేర్‌ ధర: రూ. 225
కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో పని చేసే కోల్ ఇండియా, 2023 ఆర్థిక సంవత్సరంలో 332% డివిడెండ్‌ పే చేసింది. అంటే, ఒక్కో షేరుకు రూ. 33.3 చెల్లించింది. కంపెనీ డివిడెండ్ ఈల్డ్‌ 14.7%.


హెచ్‌సీఎల్‌ టెక్ (HCL Tech)
ప్రస్తుతం షేర్‌ ధర: రూ. 1165
IT సర్వీసెస్‌ కంపెనీ HCL టెక్, FY23లో 2,400% వరకు డివిడెండ్స్‌ చెల్లించింది. కంపెనీ డివిడెండ్ ఈల్డ్‌ 4.1%.


హీరో మోటోకార్ప్ (Hero MotoCorp)
ప్రస్తుతం షేర్‌ ధర: రూ. 2,840
టూ-వీలర్‌ సెగ్మెంట్‌ లీడర్‌ హీరో మోటోకార్ప్, గత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడిదార్లకు భారీగా 5,000% డివిడెండ్ ప్రకటించింది. కంపెనీ డివిడెండ్ ఈల్డ్‌ 3.5%.


బజాజ్ ఆటో (Bajaj Auto)
ప్రస్తుతం షేర్‌ ధర: రూ. 4,654
ఆటో సెక్టార్‌కు చెందిన బజాజ్ ఆటో, 2022-23 ఆర్థిక సంవత్సరంలో తన ఇన్వెస్టర్లకు 1,400% డివిడెండ్ పే చేసింది. కంపెనీ డివిడెండ్ ఈల్డ్‌ 3%.


పిరమాల్ ఎంటర్‌ప్రైజెస్ (Piramal Enterprises)
ప్రస్తుతం షేర్‌ ధర: రూ. 883
పిరమాల్ ఎంటర్‌ప్రైజెస్ 2022-23 కాలంలో ఒక్కొక్కటి రూ. 2 ముఖ విలువ గల షేర్‌కు 1550% డివిడెండ్ ప్రకటించింది. కంపెనీ డివిడెండ్ ఈల్డ్‌ 3.3%.


వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌ (VST Industries)
ప్రస్తుతం షేర్‌ ధర: రూ. 3,466
VST ఇండస్ట్రీస్ 2023 ఫైనాన్షియల్‌ ఇయర్‌లో షేర్‌హోల్డర్లకు 1500% డివిడెండ్ అందించింది. కంపెనీ డివిడెండ్ ఈల్డ్‌ 4.3%.


బేయర్ క్రాప్ సైన్స్ (Bayer Crop Science)
ప్రస్తుతం షేర్‌ ధర: రూ. 4,328
బేయర్ క్రాప్ సైన్స్ గత ఆర్థిక సంవత్సరంలో తన పెట్టుబడిదార్లకు 1300% డివిడెండ్ చెల్లించింది. కంపెనీ డివిడెండ్ ఈల్డ్‌ 3%.


గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ (Gulf Oil Lubricants)
ప్రస్తుతం షేర్‌ ధర: రూ. 459
గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ FY23లో షేర్‌హోల్డర్లకు 1250% డివిడెండ్ పే చేసింది. కంపెనీ డివిడెండ్ ఈల్డ్‌ 5.5%.


ఐసీఐసీఐ సెక్యూరిటీస్ (ICICI Securities)
ప్రస్తుతం షేర్‌ ధర: రూ. 609
ICICI సెక్యూరిటీస్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 450% వరకు డివిడెండ్ ఇచ్చింది. కంపెనీ డివిడెండ్ ఈల్డ్‌ 4.3%.


ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ONGC)
ప్రస్తుతం షేర్‌ ధర: రూ. 158
కేంద్ర ప్రభుత్వ సంస్థ ONGC, గత ఆర్థిక సంవత్సరంలో 225% డివిడెండ్ ప్రకటించింది. కంపెనీ డివిడెండ్ ఈల్డ్‌ 7.1%.


మరో ఆసక్తికర కథనం: ఇవి షేర్లా, విమానాలా? ₹లక్ష కోట్ల మార్క్‌ దగ్గర్లో ఇండిగో మార్కెట్‌ క్యాప్‌


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial