DCB Bank Share Price: డీసీబీ బ్యాంక్‌లో వాటా పెంచుకోవడానికి టాటా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి (Tata AMC) రిజర్వ్ బ్యాంక్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఇవాళ్టి (గురువారం, 06 జులై 2023) ట్రేడింగ్‌లో బ్యాంక్ షేర్లు 8% జంప్ చేసి రూ. 131కి చేరుకున్నాయి. 52-వీక్స్ గరిష్టానికి (రూ. 141.20) కూతవేటు దూరంలో ఉన్నాయి.
"జులై 5, 2023న RBI నుంచి బ్యాంకుకు సమాచారం అందిందని, పెయిడప్ ఈక్విటీ క్యాపిటల్‌లో హోల్డింగ్‌ను 7.5% వరకు పెంచుకునేందుకు టాటా అసెట్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు (TAMPL) RBI అనుమతిని మంజూరు చేసిందని, టాటా మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ద్వారా తన వాటాను టాటా AMC పెంచుకోవచ్చని" ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో DCB బ్యాంక్ వెల్లడించింది. ఆర్‌బీఐ లేఖ పంపిన తేదీ నుంచి ఒక సంవత్సరం పాటు ఈ అప్రూవల్ చెల్లుబాటు అవుతుందని బ్యాంక్ తెలిపింది.
డీసీబీ బ్యాంక్‌లో టాటా ఏఎంసీ మొత్తం షేర్‌హోల్డింగ్ ఏ సమయంలో చూసినా బ్యాంక్ పెయిడప్ క్యాపిటల్‌లో 7.5% మించకుండా చూసుకోవాలని కూడా ఆర్‌బీఐ సూచించినట్లు ఎక్సేంజ్ ఫైలింగ్‌లో బ్యాంక్ ప్రకటించింది.
ఉదయం 11.10 గంటల సమయానికి, బీఎస్‌ఈలో, డీసీబీ బ్యాంక్ షేర్ ప్రైస్ 7 శాతం పెరిగి రూ. 130 వద్ద ట్రేడవుతోంది. గత 12 నెలల కాలంలో ఈ కౌంటర్ 65% పైగా లాభాలు కళ్లజూసింది. అయితే, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD) దాదాపు 3% రిటర్న్స్ మాత్రమే ఇచ్చింది. గత నెల రోజుల వ్యవధిలో 8% పైగా పెరిగింది.
బయ్ రేటింగ్ - రూ.142 ప్రైస్ టార్గెట్
బ్రోకరేజ్ ప్రభుదాస్ లీలాధర్, డీసీబీ బ్యాంక్ స్టాక్‌కు "బయ్" రేటింగ్ ఇచ్చింది. రూ. 142 ప్రైస్ టార్గెట్‌తో, రూ. 116 వద్ద స్టాప్ లాస్ పెట్టుకుని షేర్లు కొనొచ్చని సూచించింది.
"ఈ స్టాక్ రూ. 116 స్థాయిల నుంచి మంచి పుల్‌బ్యాక్ సాధించింది. రాబోయే రోజుల్లో మరింత ర్యాలీ అంచనాలను పెంచింది. RSI కూడా ట్రెండ్ రివర్సల్‌తో, బయ్ సిగ్నల్స్ ఇస్తోంది" - ప్రభుదాస్ లీలాధర్
ట్రెండ్‌లైన్ డేటా ప్రకారం, డీసీబీ బ్యాంక్ స్టాక్ యావరేజ్ టార్గెట్ ప్రైస్ రూ. 141. ప్రస్తుత మార్కెట్ ధర నుంచి మరో 10% అప్‌సైడ్ పొటెన్షియల్‌ను ఇది సూచిస్తోంది. ఈ స్క్రిప్‌ను ట్రాక్ చేస్తున్న మొత్తం 15 మంది మార్కెట్ ఎనలిస్ట్‌లు 'బయ్' సిఫార్సు చేశారు.
2023 జనవరి-మార్చి కాలంలో లాభనష్టాలు
Q4 FY23లో, DCB బ్యాంక్ నికర లాభంలో 25% పెరిగి రూ. 142 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ. 113 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అదే కాలంలో ఆదాయం కూడా రూ. 495 కోట్ల నుంచి రూ. 608 కోట్లకు పెరిగింది. 2023 మార్చి 31 నాటికి గ్రాస్ NPAలు 3.19%, నెట్ NPAలు 1.04% వద్ద ఉన్నాయి.
మరో ఆసక్తికర కథనం: రిచెస్ట్ పార్టీలో రీఎంట్రీ కోసం అంబానీ అడుగులు, ఎక్కువ దూరం లేదు!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.