CRCS Sahara Refund Portal: సహారా బాధితుల పదేళ్ల ఎదురు చూపులు ఫలించాయి. సహారా రీఫండ్ పోర్టల్‌ను (CRCS-Sahara Refund Portal) ప్రారంభించిన మూడు వారాల తర్వాత, ఫస్ట్‌ ఫేస్‌ కింద 112 మంది ఇన్వెస్టర్లకు ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున రిఫండ్‌ బదిలీ అయింది. కేంద్ర సహకార మంత్రి అమిత్ షా, బటన్‌ నొక్కి రిఫండ్‌ ప్రాసెస్‌ స్టార్ట్‌ చేశారు. సీఆర్‌సీఎస్‌-సహారా రిఫండ్‌ పోర్టర్‌లో ఇప్పటి వరకు 18 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారని మంత్రి చెప్పారు.


డబ్బు వచ్చిందో, లేదో ఎలా తెలుస్తుంది?
డిపాజిటర్‌ బ్యాంక్ ఖాతాలోకి రిఫండ్ క్రెడిట్‌ అయినట్లు అతను/ఆమెకు SMS లేదా ఈ-మెయిల్‌ వస్తుంది. అలాగే, క్లెయిమ్ రిక్వెస్ట్‌ను ఆమోదించినా, ఆమోదించకపోయినా సదరు డిపాజిటర్‌ SMS/ఈ-మెయిల్ ద్వారా తెలుసుకుంటారు.


సహారా నిజమైన బాధిత ఇన్వెస్టర్లు, తొలి విడత కింద, ఈ పోర్టల్ ద్వారా రూ. 10,000 వరకు ఫస్ట్‌ రిఫండ్‌ తీసుకుంటారు. వాళ్ల మొత్తం డిపాజిట్‌ రూ. 10,000 మించి ఉన్నా, తొలి దశ కింద రూ. 10,000 మాత్రమే పోర్టల్‌ ద్వారా అందుతుంది. ఈ పోర్టల్‌లో అప్లై చేసుకోవడానికి, మొత్తం నాలుగు సొసైటీల పూర్తి డేటా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.


డిపాజిటర్ రిఫండ్‌ ఎలా పొందుతాడు?
రిఫండ్‌ కోసం సహారా పోర్టల్‌లో క్లెయిమ్ అప్లికేషన్‌ పెట్టుకున్న డిపాజిటర్‌కు ఆధార్-లింక్ చేసిన మొబైల్ నంబర్, ఆధార్-లింక్‌ చేసిన బ్యాంక్ అకౌంట్‌ తప్పనిసరిగా ఉండాలి. వాటినే, క్లెయిమ్‌ సమయంలో సబ్మిట్‌ చేయాలి. బ్యాంక్ ఖాతాలు ఆధార్‌తో లింక్ కాకపోతే డిపాజిట్‌దార్లు క్లెయిమ్‌ సమర్పించలేరు. నిజమైన డిపాజిటర్ బ్యాంక్ ఖాతాకు సురక్షితంగా డబ్బు బదిలీ చేయడం కోసమే ఆధార్ సీడింగ్ బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌ అనే రూల్‌ పెట్టారు.


సహారా రిఫండ్‌ కోసం క్లెయిమ్ చేయడానికి ఎవరు అర్హులు?
ఈ 4 సహారా సొసైటీల్లో చట్టబద్ధంగా డబ్బులు డిపాజిట్‌ చేసిన వాళ్లు అర్హులు.
1. హమారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, కోల్‌కతా
2 సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, లఖ్‌నవూ
3. సహారాయన్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ లిమిటెడ్, భోపాల్
4. స్టార్స్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, హైదరాబాద్


హమారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, కోల్‌కతా; సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, లఖ్‌నవూ; సహారాయన్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ లిమిటెడ్‌, భోపాల్‌లో 2022 మార్చి 22వ తేదీకి ముందు డబ్బు డిపాజిట్‌ చేసి, బకాయిలు రావలసి ఉన్నవాళ్లు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. అలాగే, 2023 మార్చి 29వ తేదీకి ముందు స్టార్స్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌, హైదరాబాద్‌లో డబ్బు డిపాజిట్‌ చేసి, బకాయిలు రావలసి ఉన్నవాళ్లు క్లెయిమ్‌ చేసుకోవచ్చు.


సహారా రిఫండ్ మొత్తాన్ని అందుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది?
సహారా డిపాజిట్లర్లు రిఫండ్‌ కోసం అప్లై చేసిన తర్వాత, సహారా గ్రూప్ కమిటీ 30 రోజుల్లో ఆ వివరాలను ధృవీకరించుకుంటుంది. ఆ తర్వాత 15 రోజుల్లో, లేదా దరఖాస్తు చేసిన నాటి నుంచి 45 రోజుల లోపు పెట్టుబడిదార్లకు SMS లేదా వెబ్‌సైట్ ద్వారా ఇన్ఫర్మేషన్‌ అందుతుంది. క్లెయిమ్ చేసిన డబ్బు నేరుగా డిపాజిటర్ ఆధార్ సీడెడ్ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.


మరో ఆసక్తికర కథనం: పసిడి పట్టు - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial