Citi Bank to Axis Bank Transfer: సిటీ బ్యాంక్ రిటైల్ బ్యాంకింగ్ బిజినెస్‌ను ఈ నెల 15 నాటికి యాక్సిస్ బ్యాంక్‌కు ట్రాన్స్‌ఫర్ చేయడం పూర్తవుతుంది. కాబట్టి, సిటీ బ్యాంక్ కస్టమర్‌లు తమ ప్రస్తుత రివార్డ్ పాయింట్‌లకు ఏం జరుగుతుందో తెలుసుకోవడం ముఖ్యం.
బిజినెస్ టాన్స్‌ఫర్‌కు సంబంధించిన కీలకాంశాలు:
* సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఫీచర్‌లు యాక్సిస్ బ్యాంక్ రూల్స్‌కు అనుగుణంగా మారతాయి, కార్డ్ నంబర్‌లు మాత్రం యథాతథంగా ఉంటాయి.
* కొత్త యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లు జారీ చేసే వరకు సిటీ కార్డ్‌లు పని చేస్తాయి. కొత్త కార్డ్‌లు ఇవ్వడానికి కొన్ని నెలల సమయం పడుతుంది.
సిటీ బ్యాంక్ కార్డ్‌లు యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఫీచర్లలోకి ఇలా మారతాయి:
* సిటీ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్ --- యాక్సిస్ బ్యాంక్ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్
* ఇండియన్ ఆయిల్ సిటీ క్రెడిట్ కార్డ్ --- యాక్సిస్ బ్యాంక్ ప్రీమియం క్రెడిట్ కార్డ్
* సిటీ ప్రీమియర్ మైల్స్ క్రెడిట్ కార్డ్ --- యాక్సిస్ బ్యాంక్ హోరిజాన్ క్రెడిట్ కార్డ్
* సిటీ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ --- యాక్సిస్ బ్యాంక్ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్
* ఫస్ట్ సిటిజన్ సిటీ క్రెడిట్ కార్డ్ --- యాక్సిస్ బ్యాంక్ షాపర్స్ స్టాప్ క్రెడిట్ కార్డ్
* సిటీ ప్రెస్టీజ్ క్రెడిట్ కార్డ్ --- యాక్సిస్ బ్యాంక్ ఒలింపస్ క్రెడిట్ కార్డ్
* సిటీ బిజినెస్ క్రెడిట్ కార్డ్ --- యాక్సిస్ బ్యాంక్ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్
* ఇండియన్ ఆయిల్ సిటీ బిజినెస్ క్రెడిట్ కార్డ్ --- ఇండియన్ ఆయిల్ యాక్సిస్ బ్యాంక్ ప్రీమియం క్రెడిట్ కార్డ్
* సిటీ ద్వారా ఐకియా ఫ్యామిలీ క్రెడిట్ కార్డ్ --- యాక్సిస్ బ్యాంక్ ద్వారా ఐకియా ఫ్యామిలీ క్రెడిట్ కార్డ్
యాక్సిస్ బ్యాంక్‌కు మారిన తర్వాత సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పాయింట్స్ ఏమవుతాయి?
* జులై 15 నాటికి రీడీమ్ చేయని సిటీ రివార్డ్ పాయింట్లను యాక్సిస్ ఎడ్జ్ (Axis EDGE) రివార్డ్ పాయింట్లు లేదా ఎడ్జ్ మైల్స్ (EDGE Miles)గా మారుస్తారు.
* ఈ పాయింట్ల మానిటరీ వాల్యూ యథాతథంగా ఉంటుంది.
* మైగ్రేషన్‌కు ముందు సంపాదించిన పాయింట్లకు ఎక్స్‌పైరీ డేట్ ఉండదు.
* మైగ్రేషన్ తర్వాత సంపాదించిన పాయింట్లు మూడు సంవత్సరాల వరకు చెల్లుతాయి.
సిటీ-యాక్సిస్ పాయింట్ల మార్పిడి ఇలా జరుగుతుంది:
* సిటీ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్‌లో 1 రివార్డ్ పాయింట్ = యాక్సిస్ బ్యాంక్ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్‌పై 1.75 ఎడ్జ్ రివార్డ్ పాయింట్లు.
* ఇండియన్ ఆయిల్ సిటీ క్రెడిట్ కార్డ్‌లో 1 టర్బో పాయింట్ = ఇండియన్ ఆయిల్ యాక్సిస్ బ్యాంక్ ప్రీమియం క్రెడిట్ కార్డ్‌లో 1 ఎడ్జ్ మైల్.
* సిటీ ప్రీమియర్ మైల్స్ క్రెడిట్ కార్డ్‌లో 1 ప్రీమియర్ మైల్ = యాక్సిస్ బ్యాంక్ హోరిజాన్ క్రెడిట్ కార్డ్‌లో 0.45 ఎడ్జ్ మైల్స్.
* సిటీ ప్రెస్టీజ్ క్రెడిట్ కార్డ్‌లో 1 రివార్డ్ పాయింట్ = యాక్సిస్ బ్యాంక్ ఒలింపస్ క్రెడిట్ కార్డ్‌లో 1 ఎడ్జ్ మైల్.
* సిటీ బిజినెస్ క్రెడిట్ కార్డ్‌లో 1 రివార్డ్ పాయింట్ = యాక్సిస్ బ్యాంక్ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్‌లో 2.5 ఎడ్జ్ రివార్డ్ పాయింట్లు.
* ఇండియన్ ఆయిల్ సిటీబిజినెస్ క్రెడిట్ కార్డ్‌లో 1 టర్బో పాయింట్ = ఇండియన్ ఆయిల్ యాక్సిస్ బ్యాంక్ ప్రీమియం క్రెడిట్ కార్డ్‌లో 1 ఎడ్జ్ మైల్.
* సిటీ ద్వారా ఐకియా ఫ్యామిలీ క్రెడిట్ కార్డ్‌లో 1 రివార్డ్ పాయింట్ = యాక్సిస్ బ్యాంక్ ఐకియా ఫ్యామిలీ క్రెడిట్ కార్డ్‌లో 1 ఎడ్జ్ రివార్డ్ పాయింట్.
క్రెడిట్ కార్డ్‌ల వినియోగంపై వచ్చే రివార్డ్ కరెన్సీని ఎడ్జ్ రివార్డ్స్ లేదా ఎడ్జ్ మైల్స్ అని పిలుస్తారు. సిటీ నుంచి యాక్సిస్‌కు మారే పాయింట్ల విలువను చూపించే కాలిక్యులేటర్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.
మైగ్రేషన్ పూర్తయిన తర్వాత, అన్ని సిటీ పాయింట్లను మైగ్రేషన్ రోజున సంపాదించినట్లుగా యాక్సిస్ బ్యాంక్ సిస్టమ్‌లో చూపుతారు.
మొదట ఏ బ్యాంక్ పాయింట్లు ఖర్చవుతాయి?:
* యాక్సిస్ బ్యాంక్‌తో సంబంధం లేని కస్టమర్‌ల విషయంలో... ముందు, సిటీ పాయింట్‌ల రీడీమ్ జరుగుతుంది. యాక్సిస్ బ్యాంక్ మైగ్రేషన్ తర్వాత పొందిన పాయింట్‌లను ఆ తర్వాత రిడీమ్ చేస్తారు.
* రెండు బ్యాంకులతో ఇప్పటికే ఉన్న సంబంధం ఉన్న కస్టమర్‌ల విషయంలో... మైగ్రేషన్‌కు ముందు సంపాదించిన యాక్సిస్ బ్యాంక్ పాయింట్‌లను ముందుగా రీడీమ్ జరుగుతుంది. ఆ తర్వాత సిటీ పాయింట్‌లు, చివరగా, మైగ్రేషన్ తర్వాత సంపాదించిన పాయింట్‌లను రిడీమ్ జరుగుతుంది.
మరో ఆసక్తికర కథనం: మీ పొదుపు ఖాతాపై నిర్మల సీతారామన్ నుంచి గిఫ్ట్ - రూ.25,000 వేల వరకు రాయితీ!