Cars24 fires 600 employees: కార్స్ 24 కంపెనీ ఉద్యోగులకు షాకిచ్చింది! 600 మందికి పైగా ఉద్యోగులను విధుల్లోంచి తొలగించినట్టు తెలిసింది. వివిధ శాఖల్లో చాలామందిని తీసేసింది. మొత్తం 9000 మంది వర్క్‌ఫోర్స్‌లో లేఆఫ్‌లు 6 శాతం కన్నా ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ స్టార్టప్‌లో సాఫ్ట్‌బ్యాంక్, ఆల్ఫా వేవ్ గ్లోబల్ సంస్థలు పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే అన్‌అకాడమీ, వేదాంతు, మీషో వంటి స్టార్టప్పులు ఉద్యోగులను తొలగించాయి. ఇప్పుడీ జాబితాలోకి కార్స్24 జాయిన్ ప్రవేశించింది. ఆర్థిక వ్యవస్థ పురోగతి బలహీన పడటం, ఫండింగ్ తగ్గిపోవడంతో పెట్టుబడిదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. నిధుల కొరతతో స్టార్టప్పులు డౌన్ సైజింగ్ వైపు వెళ్తున్నాయి.
Also Read: ఎరుపెక్కిన గురువారం! రూ.7 లక్షల కోట్లు నష్టం - సెన్సెక్స్ 1416 డౌన్!
Also Read: రూ.12,500 కడితే రూ.4.62 కోట్లు ఇస్తున్న ఆర్బీఐ! పూర్తి వివరాలు ఇవీ!
చివరి సారిగా కార్స్24 ఆల్ఫా వేవ్ గ్లోబల్ నుంచి 400 మిలియన్ డాలర్ల నిధులు సమీకరించింది. ఇందులో 100 మిలియన్ డాలర్ల అప్పు ఉంది. ఈ ఫండింగ్ రౌండ్ ముగిశాక కంపెనీ విలువ 3.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అన్‌అకాడమీ 1000, వేదాంతు 624, కార్స్ 24 కంపెనీ 600, ట్రెల్ 300, లిడో 200, ఫర్లెన్‌కో 180, మీషో 150, ఓకే క్రెడిట్ 35 మందిని ఉద్యోగాల్లోంచి తీసేయడం గమనార్హం. ద్రవ్యోల్బణం, మందగమనం నుంచి ఎకానమీ బయట పడకపోతే స్టార్టప్పులు మరింత మందిని తొలగించే అవకాశం లేకపోలేదు.