Telangana Budget 2023 Live Updates: 2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ 2023-24

Telangana Budget 2023 Live Updates: తెలంగాణ బడ్జెట్‌కు సంబంధించిన వివరాల కోసం ఈ పేజ్‌ను రిఫ్రెష్ చేయండి.

ABP Desam Last Updated: 06 Feb 2023 11:38 AM

Background

 Telangana Budget 2023 Live Updates: తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం ఈ విడతకు సంబంధించిన తన ఆఖరి బడ్జెట్‌ను ఇవాళ ప్రవేశపెట్టనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి మూడు లక్షల కోట్లతో ఈ పద్దును రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఉదయం 10.30 గంటలకు శాసనసభలో...More

కేంద్రం తీరుతో తెలంగాణకు తీరని అన్యాయం: హరీష్‌రావు

కేంద్ర ప్రభుత్వం ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా ఆంక్షలు పెట్టిందన్నారు. ఆర్థిక సంఘం చేసే సిఫార్సులను పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణకు 2019-20 సంవత్సరంలో ఇచ్చిన మొత్తానికి తగ్గకుండా 723 కోట్లు స్పెషల్ గ్రాంట్‌ ఇవ్వాలని 15వ ఆర్థిక సంగం చెప్పినప్పటికీ కేంద్రం ఇవ్వకుండా మొండి చెయ్యి చూపిందన్నారు. 2021-26 సంవత్సరాలకు 5,374 కోట్లు గ్రాంట్‌గా ఇవ్వాలని సిఫార్సు చేసినా... ఇవ్వకుండా అన్యాయం చేస్తుందన్నారు. 
ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రావాల్సిన పన్నుల రాయితీలు, వెనుకబడి ప్రాంతాల అభివృద్ధి కోసం చేపట్టే ప్రత్యేక చర్యలు ఇంత వరకు తీసుకోకుండా ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసిందన్నారు. ఏడాదికి 450 కోట్లు చొప్పున తలంగాణకు ఇవ్వాలిసి ఉండగా మూడు సంవత్సరాలకు సంబంధించి 13,50 కోట్లు ఇవ్వనేలేదన్నారు. 
మిషన్ భగీరథకు 19,205కోట్లు, మిషన్ కాకతీయ పథకానికి ఐదువేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా పట్టించుకోలేదన్నారు. 
రాష్ట్రంలో కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్‌, గిరిజన యూనివర్శిటీని స్థాపించాలని చట్టంలో ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. ఐటీఐఆర్‌ ప్రాజెక్టును కూడా వెనక్కి తీసుకున్నారని విమర్శించారు. 
కృష్ణాజలాల వాటాను నిర్ణయించాలని బ్రజేష్‌ కుమార్ ట్రైబ్యులనల్‌కు కేంద్రం సూచించవలసి ఉంది కానీ ఇంతవ రకు ఆ దిశగానే చర్యలు తీసుకోలేదన్నారు. దీని వల్ల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి, డిండీ వంటి ప్రాజెక్టులకు అంతరాయం కలుగుతుందన్నారు.