తెలంగాణ బడ్జెట్ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఉంటుందన్నారు మంత్రి హరీష్ రావు. కేసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించినట్టు తెలిపారు. సంక్షేమానికి అభివృద్ధి రెండు జొడేద్దులుగా సమపాళ్లలో బడ్జెట్ కూర్పు ఉండబోతోందన్నారు. తెలంగాణపై కేంద్రం వివక్ష కొనసాగుతుంటే... ఒక్క రూపాయి కూడా రాకపోయినా అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తోందన్నారు హరీష్‌రావు. సంక్షేమ పథకాలు ఆగకూడదన్న కెసీఆర్ ఆలోచనతో బడ్జెట్ కేటాయింపులు చేశామన్నారు. తెలంగాణ మోడల్ దేశం అవలంభిస్తోందని అభిప్రాయపడ్డారు. దేశానికి రోల్ మోడల్ తెలంగాణ నిలిచిందన్నారు. సభలో నేను, మండలి లో ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెడుతారన్నారు. బడ్జెట్ నిన్న కేబినేట్ ఆమోదంతో పాటు గవర్నర్ ఆమోదం కూడా లభించిందన్నారు.
జూబ్లిహిల్స్ టీటీడీ ఆలయానికి మంత్రి హరీష్ రావు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ ఆ బడ్జెట్ కాపీలను తీసుకెళ్లి దేవుడి సన్నిధిలో పెట్టారు.
మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు రానున్నాయి. అందుకే ఈసారి ప్రవేశ పెట్టే బడ్జెట్ వాటిని దృష్టిలో పెట్టుకొని సంక్షేమానికి భారీగా కేటాయింపులు ఉంటాయన్న అంచనాలు ఉన్నాయి. అందుకే ఈసారి బడ్జెట్ 3 లక్షల కోట్లకు పైగానే ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఆ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం భారీ కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. రుణ మాఫీకి కూడా భారీగా నిధులు ఇస్తున్నట్టు సమాచారం.
కేంద్రం పన్నుల వాటా తగ్గిపోతున్న వేళ సొంతంగా నిధులు వేటను సాగిస్తోంది ప్రభుత్వం. భూముల అమ్మకాలు, పన్నుల పెంపు ద్వారా ఆదాయం పెంచుకునే దిశగా ప్రభుత్వం కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే పన్నుల్లో తెలంగాణ వాటా 2.10 శాతం. ఈ ప్రకారం రూ.21,470 కోట్లు తెలంగాణకు వస్తాయి. వీటికి కేంద్ర ప్రభుత్వ పథకాలు.. ఇతర గ్రాంట్స్ కూడా కలిపి రాష్ట్రానికి రూ.38 వేల కోట్లు మాత్రమే అందనున్నాయి. అప్పుల పరిమితిపై కూడా కేంద్రం నియంత్రణ విధించనుంది. ఈ ఏడాది కార్పొరేషన్ల పేరుతో చేసిన అప్పులను కూడా పరిగణనలోకి తీసుకుని వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిబంధనల ప్రకారం రావాల్సిన అప్పులను కూడా నియంత్రించడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే.. బడ్జెట్‌లో ఎంత మేర అప్పులను లక్ష్యంగా పెట్టుకున్నా.. వాటి లక్ష్యం మేర బహిరంగ మార్కెట్ రుణాలను సాధించుకోవడం అంత తేలిక కాదు.
స్వల్పంగా వివిధ రకాల పన్నుల పెంపు ఉండే చాన్స్ !
భూముల అమ్మకంపై ఎక్కువ ఆశలు !
హైదరాబాద్ శివార్లలో భూములను వేలం వేసి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు సమీకరించుకుంది. ఈ సారి జిల్లాల్లో కూడా భూములు వేలం వేయాలన్న ఆలోచన చేస్తోంది. నిరుపయోగ భూములు 32 జిల్లాల్లో గుర్తిం చిన వివరాల సేకరణ, అమ్మకం, రాజీవ్ స్వగృహ ఇండ్లు, కార్పొ రేషన్ పరిధిలోని భూముల అమ్మకం, దిల్‌కు సంబంధించిన భూములపై ఉన్న కేసును పరిష్కరించుకుని వీటి విక్రయాలు నిర్వహించి ఆదాయాన్ని పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలిసింది. అదేవిధంగా పలు శాఖల్లో పేరుకుపోయిన బకాయిలు, వన్‌టైం సెటిల్‌మెంట్లకు ఉన్న అవకాశాలు, కేంద్రం వద్ద ఉన్న బకాయిలను వసూలు చేసుకునే అవకాశాలతో బడ్జెట్‌లో అంచనాలను ప్రతిపాదించనున్నట్లుగా తెలుస్తోంది.