Expectations For Senior Citizen From Union Budget 2025: శనివారం రానున్న భారతదేశ బడ్జెట్ కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ బడ్జెట్‌పై ప్రజలందరి ఆశలు ఆకాశాన్ని అంటాయి. ప్రతి వర్గానికీ ఖచ్చితమైన ప్రయోజనాలు ఉంటాయని అంతా ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో, బడ్జెట్ బండిలో సీనియర్ సిటిజన్ సీట్ ఎక్కడ ఉంటుంది?, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) సీనియర్ సిటిజన్స్ కోసం ఏం చేస్తారు?, ఎంత ప్రయోజనం కల్పిస్తారు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
బడ్జెట్ ప్రయోజనాల్లో తమకూ ఆకర్షణీయమైన వాటా ఉండాలని వృద్ధులు కోరుకుంటున్నారు. ఇదే జరిగితే.. రిటైర్మెంట్‌ను ఆస్వాదించడంలో విశ్వాసాన్ని పెంచుతుంది. ఎందుకంటే, పెరుగుతున్న ద్రవ్యోల్బణం మూలధన డిపాజిట్ల రాబడి (Return on deposits)పై ఒత్తిడిని పెంచుతోంది, వృద్ధుల ఆదాయాన్ని తగ్గిస్తోంది. కాబట్టి, సీనియర్ సిటిజన్‌ల విషయంలో, రూ. 10 లక్షల వరకు వార్షిక ఆదాయంపై ఆదాయ పన్ను విధించకూడదని (Income tax should not be levied on annual income up to Rs.10 lakhs) వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు, పెన్షన్ ప్రయోజనాలపై గరిష్ట రాయితీ పొందాలని కూడా ఆశిస్తున్నారు, తద్వారా గరిష్ట మొత్తంలో పెన్షన్ వారి చేతుల్లోకి వస్తుంది.
పొదుపు పథకాలపై కూడా వడ్డీ పెరుగుతుందని ఆశకుటుంబం కోసం & దేశం కోసం పని చేసి, అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న వయస్సులో, తమకు ఆనందం కలిగించేలా బడ్జెట్ ఉండాలన్నది సీనియర్ సిటిజన్ల భావన. దీనికోసం, పొదుపు పథకాల (High interest on senior citizen savings schemes)పై ఎక్కువ వడ్డీని కోరుతున్నారు. తద్వారా, నెలవారీ ఆదాయం లేకపోయినప్పటికీ, డిపాజిట్ చేసిన డబ్బుపై గరిష్ట రాబడిని పొందవచ్చు, వృద్ధాప్య అవసరాల కోసం వినియోగించుకోవచ్చు.
పన్ను నిపుణుల అభిప్రాయం ప్రకారం, సీనియర్ సిటిజన్లకు రిస్క్ లేని & దీర్ఘకాలిక పెట్టుబడి సాధనం అవసరం ఉంది, ఇది మార్కెట్ రేటు కంటే ఎక్కువ రాబడిని ఇచ్చేలా ఉండాలి. శనివారం నాటి బడ్జెట్‌లో ఇలాంటి ప్రకటన రావాలి.
పింఛను ఆదాయం మాత్రమే వస్తుంటే ఐటీఆర్ నుంచి మినహాయింపుఆదాయ పన్ను చట్టం (Income Tax Act) ప్రకారం, 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్‌ల ఆదాయ మూలం పెన్షన్ & అదే ఖాతా నుంచి పొందిన వడ్డీ మాత్రమే అయితే.. ఆదాయ పన్ను రిటర్న్ (ITR) దాఖలు నుంచి వారికి మినహాయింపు ఉంటుంది. ఈ సదుపాయాన్ని 70 ఏళ్లకు తగ్గించడం ద్వారా, పెద్ద సంఖ్యలో సీనియర్ సిటిజన్లకు ఈ ప్రయోజనం కల్పించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కొత్త పన్ను విధానం (New tax regime)లో, సీనియర్ సిటిజన్‌లకు ప్రాథమిక మినహాయింపు పరిమితిని కూడా రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. మెట్రో నగరాల్లో HRA ఆధారంగా అందుతున్న ప్రయోజనాలను కూడా పెంచుతారనే ఆశ వృద్ధుల్లో వ్యక్తమవుతోంది.
మరో ఆసక్తికర కథనం: బడ్జెట్ ప్రజెంటేషన్ కోసం నిర్మలమ్మ ట్యాబ్ ఎందుకు తీసుకెళ్తారు, అది ఏ బ్రాండ్?