Andhra Pradesh Budget 2025-26: కూటమి ప్రభుత్వం తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే - ఆయా రంగాలకు కేటాయింపులు ఇలా

Andhra Pradesh Budget 2025-26:ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ నేడు సభ ముందుకు రానుంది. పూర్తి వివరాలు, లైవ్‌ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Khagesh Last Updated: 28 Feb 2025 10:48 AM

Background

Andhra Pradesh Budget 2025-26:ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం తన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఇవాళ సభలోకి తీసుకురానుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్నారు. మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రసంగం...More

Andhra Pradesh Budget 2025: మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమానికి కేటాయింపులు

Andhra Pradesh Budget 2025: అనంబద్ధ సామాజిక కట్టుబాట్లను ధిక్కరించి భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా గుర్తింపు పొందిన శ్రీమతి సావిత్రిబాయి పూలే మాటలను గుర్తు చేశారు పయ్యావు కేశవ్. 'ఒక మహిళకు సాధికారత కల్పిస్తే-మొత్తం సమాజాన్నే ఉద్దరించినట్లు అవుతుంది' అన్న సిద్ధాంతాన్ని దృఢంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశ్వసించారు. "స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు సాధికారత కల్పించిన మొదటి వ్యక్తి. వంటగదికే పరిమితమైన మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా సామాజిక ఉద్యమంలో భాగమయ్యారు. మన రాష్ట్రం స్వయం సహాయక సంఘాల ఉద్యమానికి పర్యాయపదంగా, దేశానికే ఆదర్శంగా నిలిచింది. నేడు మన రాష్ట్రంలో 10 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలు వని చేస్తూ రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. స్వయం సహాయక సంఘాల ద్వారా సాధించిన ఈ సాధికారత ఎంతగా ఉందంటే, రాష్ట్ర సంక్షేమ విధానాలను మరియు రాజకీయాలను ప్రభావితం చేసే శక్తిగా డ్వాక్రా వ్యవస్థ రూపొందింది. 


స్త్రీ నిధికి కేటాయించిన నిధులలో 750 కోట్ల రూపాయలను గత ప్రభుత్వం ప్రక్కదారి పట్టించి, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థిక సాధికారతకు ఎంతో విఘాతం కలిగించింది. మహిళల ఆర్థిక అభ్యున్నతిలో స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషించేలా, మా ప్రభుత్వం ప్రస్తుతం దిద్దుబాటుచర్యలు చేపడుతోంది. 


నమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐ.సి.డి.ఎస్.), మిషన్-శక్తి వంటి పథకాల ద్వారా మహిళలు, పిల్లలు మరియు కౌమారదశలో ఉన్నవారికి తగిన పోషకాహారం అందించేందుకు మా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. మేనిఫెస్టోలోని హామీ మేరకు అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ మంజూరు చేసిన ఘనత మా ప్రభుత్వానిదే. వృద్ధుల సంరక్షణ కోసం కొత్తగా 12 వృద్ధాశ్రమాలు మంజూరు చేయడం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖకు 4,332 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను." అని చెప్పారు పయ్యావుల