BSE Smallcap index: డిసెంబరు 1న ఆల్ టైమ్ హై రికార్డ్‌ క్రియేట్‌ చేసిన సెన్సెక్స్, మళ్లీ ఆ స్టేజ్‌ను దాటడానికి 137 ట్రేడింగ్ సెషన్‌లు తీసుకుంది. నిన్న (బుధవారం, 21 జూన్‌ 2023) కొత్త ఆల్ టైమ్ పీక్‌కి చేరింది. ఈ రెండు పీక్‌ స్టేజ్‌ల మధ్యకాలంలో 18 స్మాల్‌ క్యాప్ స్టాక్స్‌ మ్యాజిక్‌ చేశాయి. మల్టీబ్యాగర్ రిటర్న్స్‌తో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చాయి.


ఆల్ఫా స్టాక్స్‌ను (ఇండెక్స్‌ కంటే ఎక్కువ రిటర్న్స్‌ ఇచ్చే స్టాక్స్‌) వెతుకుతున్న ఇన్వెస్టర్లు, ఇప్పుడు స్మాల్‌ క్యాప్స్‌ వెంటబడుతున్నారు. ఫలితంగా, నిఫ్టీ స్మాల్‌ క్యాప్ ఇండెక్స్ గత 3 నెలల్లో దాదాపు 20% పెరిగింది. గత రెండున్నర నెలలుగా విజయాల పరంపర కొనసాగిస్తున్న BSE స్మాల్‌ క్యాప్ ఇండెక్స్ (BSE Smallcap index), ఈ వారాన్ని కూడా సేమ్‌ ట్రెండ్‌తో ముగిస్తే, ఇండెక్స్‌ చరిత్రలో ఇదే అత్యధిక లాభాల కాలం అవుతుంది.


2022 డిసెంబరు 1 నుంచి ఇప్పటి వరకు, 18 స్మాల్‌ క్యాప్ కౌంటర్లు ఇన్వెస్టర్ల సంపదను రెట్టింపు పైగా పెంచాయి. మలబార్ ఇండియా ఫండ్‌కి ఈక్విటీ షేర్లు & వారెంట్ల జారీ కోసం ఇటీవలే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ఐటీ స్టాక్ ఆరియన్‌ప్రో సొల్యూషన్స్ (Aurionpro Solutions), రాబడి విషయంలో టాప్‌ ప్లేస్‌లో ఉంది. ఈ కాలంలో 3 రెట్లు లాభాలను అందించింది. 


2022 డిసెంబరు 1 నుంచి ఇప్పటి వరకు మల్టీబ్యాగర్‌ రిటర్న్స్‌ ఇచ్చిన స్మాల్‌ క్యాప్స్‌:


ఆరియన్‌ప్రో సొల్యూషన్స్ - అందించిన లాభం: 203%
న్యూక్లియస్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్స్‌ -  అందించిన లాభం: 166%
జిందాల్ సా  -  అందించిన లాభం: 161%
టిటాగర్ రైల్‌ సిస్టమ్స్‌ -  అందించిన లాభం: 154%
JBM ఆటో  -  అందించిన లాభం: 141%
సెంటమ్ ఎలక్ట్రానిక్స్  -  అందించిన లాభం: 137%
డిదేవ్ ప్లాస్టిక్స్ ఇండస్ట్రీస్  -  అందించిన లాభం: 135%
మనాక్సియా  -  అందించిన లాభం: 134%
WPIL  -  అందించిన లాభం: 133%
లాయిడ్స్ మెటల్స్ & ఎనర్జీ  -  అందించిన లాభం: 120%
కేన్స్ టెక్నాలజీ  -  అందించిన లాభం: 114%
వారీ రెన్యూవబుల్ టెక్నాలజీస్  -  అందించిన లాభం: 108%
జెన్ టెక్నాలజీస్  -  అందించిన లాభం: 108%
హరిఓం పైప్ ఇండస్ట్రీస్  -  అందించిన లాభం: 107%
ఉషా మార్టిన్  -  అందించిన లాభం: 105%
టెక్నోక్రాఫ్ట్ ఇండస్ట్రీస్  -  అందించిన లాభం: 105%
రామకృష్ణ ఫోర్జింగ్స్  -  అందించిన లాభం: 105%
RACL గేర్‌టెక్  -  అందించిన లాభం: 105%


మరో ఆసక్తికర కథనం: జులైలో బ్యాంక్‌లకు సగం రోజులు సెలవులే, ఇదిగో హాలిడేస్‌ లిస్ట్‌ 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial