హ్యూందాయ్ కంపెనీకి సోషల్ మీడియా సెగ తగిలింది! ఆ కంపెనీ ద్వంద్వ వైఖరిని నెటిజన్లు ఖండిస్తున్నారు. ట్విటర్లో #BoycottHyundai ని ట్రెండ్ చేస్తున్నారు. భారతీయుల మనోభావాలను దెబ్బతీస్తూ హ్యూందాయ్ పాకిస్థాన్ కశ్మీర్‌పై యాడ్ ఇవ్వడమే ఇందుకు కారణం.
'మన కశ్మీరీ సోదరుల త్యాగాలను మనం గుర్తు చేసుకోవాలి. స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కోసం పోరాడుతున్న వారికి మనం అండగా నిలవాలి' అని హ్యూందాయ్ పాకిస్థాన్ ట్వీట్ చేసింది. దాల్ సరస్సులో ప్రయాణిస్తున్న ఓ పడవ చిత్రాన్ని పోస్టు చేసింది. అందులో కశ్మీర్ అనే అక్షరాలు రెండు దేశాల సరిహద్దుల్లో ఉండే ముళ్ల తీగల్లో ఉంటాయి.
ఏటా ఫిబ్రవరి 5న పాకిస్థాన్ 'కశ్మీర్ సంఘీభావ దినోత్సవం' నిర్వహిస్తుంది. ఇదే సమయంలో హ్యుందాయ్ పాకిస్థాన్ కశ్మీర్‌కు మద్దతుగా యాడ్ ఇవ్వడం భారతీయులకు ఆగ్రహం తెప్పించింది. వారు వెంటనే హ్యుందాయ్ ఇండియా, హ్యుందాయ్ గ్లోబల్‌కు ట్యాగ్ చేస్తూ ప్రశ్నించడం మొదలు పెట్టారు. అందుకు వారు సమాధానం ఇవ్వకుండా నెటిజన్లను బ్లాక్ చేయడం మొదలు పెట్టారు. దాంతో #BoycottHyundai అని ట్రెండ్ చేస్తున్నారు. ఇలా బ్లాక్ చేయడంతో తాను హ్యూందాయ్ కస్టమర్ అయినందుకు సిగ్గుపడుతున్నానని, మరోసారి ఆ కంపెనీ కార్లను కొనబోనని ట్వీట్ చేశాడు.
ఈ మధ్య కాలంలో కంపెనీ ద్వంద్వ వైఖరి, మనోభావాలు దెబ్బతీసే వైఖరి నెటిజన్లు సహించడం లేదు. వెంటనే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కొంత కాలం క్రితమే #Boycott Amazon #Cancel Spotify వంటి హ్యాష్‌ట్యాగులను ట్రెండ్ చేశారు.
Also Read: LIC offers: కస్టమర్లకు ఎల్‌ఐసీ ఆఫర్- ఆలస్య రుసుములో భారీ రాయితీ
Also Read: SBI Q3 Results: ఎస్‌బీఐ బంపర్ ప్రాఫిట్! మార్కెట్ అంచనాలు బీట్ చేసిన బ్యాంకు