Bank Holidays List For May 2024: మీకు బ్యాంక్‌లో ఏ పని ఉన్నా ఈ రోజు (01 మే 2024) మాత్రం అటు వైపు వెళ్లకండి. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (May Day 2024) సందర్భంగా ఈ రోజు బ్యాంక్‌లకు సెలవు ఇచ్చారు. ఇదే కాదు.. లోక్‌సభ ఎన్నికలు, వివిధ సందర్భాల కారణంగా ఈ నెలలో బ్యాంక్‌లు 14 రోజులు పని చేయవు. మే డే, రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి, నజ్రుల్ జయంతి, అక్షయ తృతీయ వంటి సందర్భాలు ఈ నెలలో ఉన్నాయి. ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారతాయి. 


ముందుగా, బ్యాంక్‌ హాలిడేస్‌ లిస్ట్‌ను ముందుగా సేవ్‌ చేసుకోండి. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి, బయటకు వస్తే నిప్పుల కొలిమిలో అడుగు పెట్టినట్లు ఉంటోంది. ఈ నెలలో మీకు బ్యాంక్‌లో ఏదైనా పని ఉంటే, బ్యాంక్‌ సెలవుల జాబితాను చూసుకున్న తర్వాతే ఇంటి నుంచి కాలు బయట పెట్టండి.


2024 మే నెలలో బ్యాంక్‌ సెలవు రోజులు ‍‌(Bank Holidays in May 2024): 


మే 01 (బుధవారం): మే డే/ మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా బేలాపూర్, బెంగళూరు, చెన్నై, గౌహతి, హైదరాబాద్, అమరావతి, ఇంఫాల్, కొచ్చి, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, పట్నా, తిరువనంతపురం తదితర ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు


మే 05: ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు


మే 07 (మంగళవారం): లోక్‌సభ ఎన్నికల కారణంగా అహ్మదాబాద్, భోపాల్, పనాజీ, రాయ్‌పూర్‌లో బ్యాంకులను క్లోజ్‌ చేస్తారు.


మే 08 (బుధవారం): రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి (Rabindra Jayanti) సందర్భంగా కోల్‌కతాలోని అన్ని బ్యాంకులను మూసివేస్తారు


మే 10 ‍‌(శుక్రవారం): బసవ జయంతి/ అక్షయ తృతీయ సందర్భంగా బెంగళూరులో బ్యాంకులకు హాలిడే ఇచ్చారు


మే 11: రెండో శనివారం, దేశంలోని అన్ని బ్యాంక్‌లు మూతబడతాయి


మే 12: ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు


మే 13 (సోమవారం): తెలుగురాష్ట్రాలు సహా చాలా ప్రాంతాల్లో లోక్‌సభ ఎన్నికల కారణంగా బ్యాంకులు పని చేయవు.


మే 16 (గురువారం): రాష్ట్ర దినోత్సవం సందర్భంగా గ్యాంగ్‌టక్‌లోని అన్ని బ్యాంకులకు సెలవు


మే 19: ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు


మే 20 ‍‌(సోమవారం): లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా బేలాపూర్, ముంబైలోని బ్యాంకులను మూసేస్తారు.


మే 23 ‍‌(గురువారం): బుద్ధ పూర్ణిమ సందర్భంగా అగర్తల, ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, చండీగఢ్, డెహ్రాడూన్, ఇటానగర్, జమ్ము, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూదిల్లీ, రాయ్‌పూర్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్‌లో బ్యాంకులు పని చేయవు.


మే 25: నాలుగో శనివారం, దేశంలోని అన్ని బ్యాంక్‌లు మూతబడతాయి


మే 26: ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు


మొబైల్ బ్యాంకింగ్, UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సర్వీస్‌లు 24 గంటలూ అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి బ్యాంక్‌ సెలవులు కొన్ని పనులపై ప్రభావం చూపవు. ఈ సేవల్లో ఏదైనా ఆటంకం ఉంటే, మీ బ్యాంక్‌ ముందుగానే మీకు తెలియజేస్తుంది. 


భారతదేశంలో, బ్యాంక్ సెలవులు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టం 1881 కింద లిస్ట్‌ అయ్యాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI), మొత్తం సంవత్సరానికి వార్షిక బ్యాంక్ సెలవుల క్యాలెండర్‌ను ప్రచురిస్తుంది. దీనిని దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు అనుసరిస్తాయి. 


మరో ఆసక్తికర కథనం: బ్యాంక్‌ ఛార్జీల నుంచి ఆధార్‌-పాన్‌ వరకు, ఈ నెలలో చాలా రూల్స్‌ మారాయ్‌