Bank Holidays list in July 2023: ఈ నెలలో (జులై) బ్యాంకులు 15 రోజులు పని చేయవు. రెండు వేల రూపాయల నోట్లు మార్చుకోవడానికి గానీ, మరో పని కోసం ఈ నెలలో బ్యాంక్‌కు వెళ్లాలని మీరు అనుకుంటుంటే, బ్యాంక్‌ హాలిడేస్‌ లిస్ట్‌ను కచ్చితంగా గుర్తుంచుకోండి. ఆ లిస్ట్‌కు తగ్గట్లుగా మీ పనిని ప్లాన్‌ చేసుకోవచ్చు.


జులై నెలలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు    
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్‌ కస్టమర్ల సౌలభ్యం కోసం ప్రతి నెలకు సంబంధించిన బ్యాంక్‌ హాలిడేస్‌ లిస్ట్‌ను ముందుగానే విడుదల చేస్తుంది. ప్రతి రాష్ట్రంలోని పండుగలు, ఇతర ముఖ్యమైన రోజుల్లో వచ్చే సెలవుల వివరాలు ఆ లిస్ట్‌లో ఉంటాయి. ఈ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 15 రోజులు సెలవులు ఉన్నాయి. శని, ఆదివారాల్లో వచ్చే సాధారణ సెలవులతో పాటు, పండుగలు, ఇతర కార్యక్రమాల వల్ల వచ్చే సెలవులు కూడా ఈ లిస్ట్‌లో కలిసి ఉన్నాయి. జులై 02న ఆదివారంతో మొదలై 31న షహీద్ ఉధమ్ సింగ్ అమరవీరుల దినోత్సవంతో హాలిడేస్‌ అయిపోతాయి. బ్యాంకు సెలవుల జాబితా ఒక రాష్ట్రానికి, మరొక రాష్ట్రానికి మారుతుంది. 


2023 జులై నెలలో బ్యాంకులకు సెలవు రోజులు:


జులై 02, 2023- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జులై 05, 2023- గురు హరగోవింద్ జయంతి సందర్భంగా జమ్ముకశ్మీర్‌లో బ్యాంకులకు సెలవు
జులై 06, 2023- MHIP డే కారణంగా మిజోరంలో బ్యాంక్‌లకు సెలవు
జులై 08, 2023 - రెండో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జులై 09, 2023 - ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జులై 13, 2023- భాను జయంతి సందర్భంగా సిక్కింలో బ్యాంకులకు సెలవు
జులై 13, 2023- బోనాలు సందర్భంగా తెలంగాణలో బ్యాంకులకు సెలవు
జులై 13, 2023- అమరవీరుల దినోత్సవం సందర్భంగా జమ్ముకశ్మీర్‌లో బ్యాంకులకు సెలవు
జులై 16, 2023- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జులై 17, 2023- యు టిరోట్ సింగ్ డే సందర్భంగా మేఘాలయలో బ్యాంకులకు సెలవు
జులై 22, 2023 - నాలుగో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జులై 23, 2023 - ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జులై 29, 2023- మొహర్రం సందర్భంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు
జులై 30, 2023 - ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జులై 31, 2023- షహీద్ ఉధమ్ సింగ్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా హరియాణాలో బ్యాంకులకు సెలవు


బ్యాంకు సెలవు రోజుల్లో నగదు లావాదేవీలు ఎలా?
RBI, బ్యాంక్‌ సెలవులను మూడు కేటగిరీల కింద వర్గీకరించింది. 'హాలిడేస్‌ అండర్‌ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్', 'రియల్-టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడేస్' & 'క్లోజింగ్‌ ఆఫ్‌ అకౌంట్స్‌'. ఏ బ్యాంక్‌ సెలవైనా ఈ మూడు కేటగిరీల్లో ఒకదాని కిందకు వస్తుంది. బ్యాంకులకు సెలవు రోజుల్లోనూ ఆన్‌లైన్ & నెట్ బ్యాంకింగ్, UPI, ATM సేవలు 24 గంటలూ పని చేస్తాయి. బ్యాంకు సెలవుల్లో నగదు విత్‌డ్రా/డిపాజిట్‌ చేయాల్సివస్తే ATMను ఉపయోగించవచ్చు. ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్‌ లేదా UPIని ఉపయోగించవచ్చు. 


మరో ఆసక్తికర కథనం: పేమెంట్‌ పూర్తయినా పాన్-ఆధార్ లింక్ కాలేదా?, స్టేటస్‌ ఇలా చెక్‌ చేయండి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial