Bank Holidays In January 2025: మరో 3 రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. దీంతో బ్యాంకు కస్టమర్లకు అవసరమొచ్చే వార్త ఇప్పుడు ట్రెండింగ్ లో నిలుస్తోంది. జనవరి నెలలో బ్యాంకులు దాదాపు సగం రోజులు మూతపడనున్నట్టు తెలుస్తోంది. అందుకే ఏమైనా పనులుంటే బ్యాంకు సెలవులకు అనుగుణంగా ప్లాన్ చేసుకుంటే మంచిది. మరి జనవరి నెలలో ఎప్పుడెప్పుడు బ్యాంకులకు సెలవులున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సగం రోజులు సెలవులే
జనవరి నెలలో బ్యాంకులు దాదాపు సగం రోజులు మూతపడనున్నాయి. వీటిలో రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు, రిపబ్లిక్ డే, సంక్రాంతి సెలవులున్నాయి. సాధారణంగా కొత్త సంవత్సరం కొన్ని ప్రాంతాల్లో జనవరి 1వ తేదీన బ్యాంకులకు సెలవుతో ప్రారంభమవుతుంది. సంవత్సరానికి సంబంధించిన బ్యాంకుల సెలవులను ఆర్బీఐ అధికారికంగా ఇంకా విడుదల చేయనప్పటికీ, బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ మునుపటి లాగానే ఈ రోజుల్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం (ATM)ల ద్వారా కస్టమర్లు లావాదేవీలను నిర్వహించవచ్చు. అయితే, ఈ సెలవుల సమయంలో బ్యాంకింగ్ కార్యకలాపాలు కొన్నిసార్లు పరిమితం కావచ్చు. కాబట్టి ఏదైనా అసౌకర్యాన్ని నివారించడానికి మీ స్థానిక బ్యాంక్ బ్రాంచ్‌తో తేదీలను తెలుసుకోవడం మంచిది.
జనవరి 2025లో బ్యాంక్ సెలవులు ఇవే:
జనవరి,1 2025, బుధవారం: నూతన సంవత్సర దినోత్సవం - దేశవ్యాప్తంగా
జనవరి, 6 2025, సోమవారం: గురుగోవింద్ సింగ్ జయంతి - హర్యానా, పంజాబ్‌లో సెలవు
జనవరి, 11 2025, శనివారం: మిషనరీ డే - మిజోరం
జనవరి, 11 2025, శనివారం: రెండవ శనివారం - దేశవ్యాప్తంగా
జనవరి, 12 2025, ఆదివారం: స్వామి వివేకానంద జయంతి - పశ్చిమ బెంగాల్
జనవరి, 13 2025, సోమవారం: లోహ్రీ - పంజాబ్, ఇతర రాష్ట్రాలు
జనవరి, 14 2025, మంగళవారం: సంక్రాంతి - అనేక రాష్ట్రాలు
జనవరి, 14 2025, మంగళవారం: పొంగల్ - తమిళనాడు, ఆంధ్రప్రదేశ్
జనవరి, 15 2025, బుధవారం: తిరువల్లువర్ దినోత్సవం - తమిళనాడు
జనవరి, 15 2025, బుధవారం: తుసు పూజ - పశ్చిమ బెంగాల్, అస్సాం
జనవరి, 23 2025, గురువారం: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి - అనేక రాష్ట్రాలు
జనవరి, 24 2025, శనివారం: నాల్గవ శనివారం - దేశం అంతటా
జనవరి, 26 2025, ఆదివారం: గణతంత్ర దినోత్సవం - దేశవ్యాప్తంగా
జనవరి, 30 2025, గురువారం: సోనమ్ లోసర్ - సిక్కిం
ముఖ్యమైన విషయాలు
- బ్యాంక్ సెలవుల జాబితాను ఆర్బీఐ అధికారికంగా త్వరలోనే విడుదల చేయనుంది.
- బ్యాంకులు మూసివేసిననప్పటికీ, మీరు లావాదేవీల కోసం ATMలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లను ఉపయోగించవచ్చు.
- ఏదైనా అసౌకర్యాన్ని నివారించడానికి మీ నిర్దిష్ట బ్యాంక్‌తో సెలవు తేదీలను నిర్ధారించడం ఎల్లప్పుడూ ఉత్తమం.
బ్యాంకు సెలవుల జాబితాను ముందే తెలుసుకున్నట్టయితే కస్టమర్లు తాము ముఖ్యమైన చెల్లింపులు, బ్యాంక్ విజిట్స్ కోసం ప్లాన్ చేసుకుంటారు. ఫలితంగా వారి సమయమూ వృథా అవుతుంది.