Ashish Kacholia Stocks: తాజా కార్పొరేట్ షేర్‌హోల్డింగ్స్ ప్రకారం... ప్రఖ్యాత ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా పోర్ట్‌ఫోలియోలో రూ. 1,844.8 కోట్ల నికర విలువైన 44 స్టాక్స్ ఉన్నాయి. 2022 డిసెంబర్ త్రైమాసికంలో, గోల్డియం ఇంటర్నేషనల్ & రాఘవ్ ప్రొడక్టివిటీ ఎన్‌హాన్సర్స్ అనే రెండు కొత్త స్క్రిప్స్‌ను తన కిట్టీకి కచోలియా జోడించారు. (CMP అంటే ఆ షేర్ ప్రస్తుత మార్కెట్ ధర)
ట్రెండ్‌లైన్ డేటా ప్రకారం... కచోలియా కొత్తగా కొన్న 2 స్టాక్స్, వాటా పెంచుకున్న 4 పాత స్టాక్స్ ఇవి:
గోల్డియం ఇంటర్నేషనల్ (Goldiam International) | CMP: రూ 161.35
ఆశిష్ కచోలియా, 2022 డిసెంబర్ త్రైమాసికంలో గోల్డియం ఇంటర్నేషనల్‌లో 1% వాటాను కొనుగోలు చేశారు. ఆయనకు ఈ కంపెనీలో మొత్తం 11,02,527 ఈక్విటీ షేర్లున్నాయి. గోల్డియం ఇంటర్నేషనల్, రూ. 1758 కోట్ల మార్కెట్ విలువతో ఉన్న స్మాల్ క్యాప్ కంపెనీ.
రాఘవ్ ప్రొడక్టివిటీ ఎన్‌హాన్సర్స్ (Raghav Productivity Enhancers ) | CMP: రూ. 1,091
2022 డిసెంబర్ త్రైమాసికంలో, ఈ కంపెనీలో 2.1% వాటాను కొనుగోలు చేశారు. ఈ కంపెనీలో కచోలియాకు 2,31,683 ఈక్విటీ షేర్లు కలిగి ఉంది. ఇది, రూ. 1,186 కోట్ల మార్కెట్ విలువతో ఉన్న స్మాల్ క్యాప్ కంపెనీ.
అగర్వాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (Agarwal Industries Corporation) | CMP: రూ 632.15
ఈ కంపెనీలో తన వాటాను, 2022 సెప్టెంబర్ త్రైమాసికంలోని 2.6% నుంచి 2022 డిసెంబర్ త్రైమాసికం చివరి నాటికి 3.8%కి పెంచుకున్నారు. ఈ కంపెనీలో మొత్తం 5,72,128 ఈక్విటీ షేర్లను ఉన్నాయి. అగర్వాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ 945 కోట్ల రూపాయల మార్కెట్ విలువతో ఉన్న స్మాల్ క్యాప్ కంపెనీ.
యశో ఇండస్ట్రీస్ (Yasho Industries) | CMP: రూ. 1,624.55
ఈ కంపెనీలో తన వాటాను Q2FY23లోని 2.6% నుంచి Q3FY23లో 3.8%కి పెంచారు. ఈ కంపెనీలో ఆయనకు మొత్తం 4,35,350 ఈక్విటీ షేర్లు ఉన్నాయి. యశో ఇండస్ట్రీస్ రూ.1,852 కోట్ల మార్కెట్ విలువతో ఉన్న స్మాల్ క్యాప్ కంపెనీ.
మెగాస్టార్ ఫుడ్స్ (Megastar Foods) | CMP: రూ 249
మెగాస్టార్ ఫుడ్స్‌లో తన వాటాను సెప్టెంబర్ త్రైమాసికంలోని 1% నుంచి 2022 డిసెంబర్ త్రైమాసికంలో 1.1%కి పెంచారు. ఈ కంపెనీలో మొత్తం 1,12,968 ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నారు. మెగాస్టార్ ఫుడ్స్ మార్కెట్ క్యాప్ రూ. 249 కోట్లు.
ఎక్స్‌ప్రో ఇండియా (Xpro India) | CMP: రూ 749
ఆశిష్ కచోలియా, ఈ కంపెనీలో తన వాటాను సెప్టెంబర్ త్రైమాసికంలోని 4.4% నుంచి డిసెంబర్ త్రైమాసికంలో 4.5%కి పెంచుకున్నారు. అయనకు ఈ కంపెనీలో మొత్తం 7,88,550 ఈక్విటీ షేర్లు ఉన్నాయి. ఎక్స్‌ప్రో ఇండియా మార్కెట్ క్యాప్ రూ. 1,326 కోట్లు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.