Gautam Adani Family Net Worth: ఎలాంటి పరిస్థితైనా మారడానికి ఒక్క రోజు చాలు. భారతీయ బిలియనీర్‌ గౌతమ్‌ అదానీ (Gautam Adani) విషయంలో ఇదే జరిగింది. బుధవారం (03 జనవరి 2024), అదానీ గ్రూప్‌-హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పు (Supreme Court verdict on Adani Group-Hindeburg Research case) తర్వాత అదానీ గ్రూప్‌ షేర్లు కళ్లెం వదిలిన గుర్రాల్లా దూసుకెళ్లాయి. అదానీ గ్రూప్‌పై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (SEBI) చేస్తున్న దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసు దర్యాప్తును సెబీ లేదా సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మిగిలిన రెండు కేసుల్లో దర్యాప్తు ముగించడానికి అత్యున్నత న్యాయస్థానం సెబీకి మరో 3 నెలల గడువు ఇచ్చింది.


సుప్రీంకోర్టు తీర్పు అదానీకి అనుకూలంగా ఉండడంతో, ఆ గ్రూప్‌లోని 10 లిస్టెడ్‌ కంపెనీల స్టాక్స్‌ బుధవారం 12 శాతం వరకు పెరిగాయి, అన్నీ కలిసి ఒక్కరోజులో దాదాపు రూ.64,500 కోట్లకు పైగా లాభపడ్డాయి. దీంతో, అదానీ గ్రూప్‌ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 15.11 లక్షల కోట్లకు పైగా (Adani Group’s Market Capitalisation) పెరిగింది. 


ఈ లాభాల ఫలితంగా, ఒక్క రోజులో సీన్‌ తారుమారైంది. రెండో స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ కుటుంబం ఫస్ట్‌ ప్లేస్‌లోకి, మొదటి స్థానంలో ఉన్న ముకేష్‌ అంబానీ (Mukesh Ambani) కుటుంబం రెండో స్థానంలోకి వచ్చాయి. తద్వారా భారతదేశంలో అత్యంత సంపన్న ప్రమోటర్‌ బిరుదును గౌతమ్‌ అదానీ ఫ్యామిలీ తిరిగి సొంతం చేసుకుందని బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్‌ చేసింది.



రికార్డు స్థాయిలో ఇళ్ల ధరలు





  • రికార్డు స్థాయిలో ఇళ్ల ధరలు పెరుగుతున్నాయి. అందులో హైదరాబాద్‌ టాప్ ప్లేస్‌లో ఉంది.



బుధవారం, గౌతమ్ అదానీ కుటుంబం నికర విలువ (net worth of the Gautam Adani’s family) రూ. 9.37 లక్షల కోట్లకు పెరిగింది, అంతకు ముందు రోజు ఇది రూ. 8.98 లక్షల కోట్లుగా ఉంది. అదే కాలంలో, ముఖేష్ అంబానీ కుటుంబం నికర విలువ (net worth of the Mukesh Ambani family) రూ. 9.38 లక్షల కోట్ల నుంచి రూ. 9.28 లక్షల కోట్లకు తగ్గింది.


అదానీ గ్రూప్ స్టాక్స్‌లో బుధవారం సూపర్‌ ర్యాలీ ‍‌(rally in Adani Group stocks)


- అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 11.60 శాతం పెరిగి రూ. 1,183.90కి చేరుకుంది.
- అదానీ టోటల్ గ్యాస్ 9.84 శాతం పెరిగి రూ. 1,099.05 వద్ద ముగిసింది.
- అదానీ గ్రీన్ ఎనర్జీ 6 శాతం ఎగబాకి రూ. 1,698.75 తో బలమైన పనితీరును ప్రదర్శించింది.
- అదానీ పవర్ షేర్లు 5 శాతం లాభంతో రూ. 544.65 వద్ద ముగిశాయి.
- అదానీ విల్మార్ 3.97 శాతం గెయిన్‌తో రూ. 381.05 వద్ద ఆగింది.
- NDTV షేర్లు 3.66 శాతం పెరిగి రూ. 281.60 వద్ద స్థిరపడ్డాయి.
- గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ 2.45 శాతం పెరిగి రూ. 3,003.95 వద్దకు చేరింది.
- గ్రూప్‌ ఏటీఎం అదానీ పోర్ట్స్ 1.39 శాతం పెరుగుదలతో రూ. 1,093.50 వద్ద ముగిసింది.
- అంబుజా సిమెంట్స్ షేర్లు 0.94 శాతం పెరిగి రూ. 535.60కి చేరుకున్నాయి.
- ACC 0.10 శాతం పెరిగి, రూ. 2,270 వద్ద ముగిసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.



Also Read: గోల్డెన్‌ ఛాన్స్, భారీగా పడిన పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి




    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 78,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.