కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గత 2 నెలలుగా వరుస శుభవార్తలు వస్తున్నాయి. 2021 జూలై 1 నుంచి పెరిగిన డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. 2020 జనవరి నుంచి ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) పెండింగ్‌లో ఉంది. ఇటీవల డీఏ, డీఆర్ రీస్టోర్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జూలై నుంచి డీఏ, డీఆర్ పెంపు ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతం అందడం ప్రారంభమైంది. డీఏ, డీఆర్ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ (House Rent Allowance) రూ.15,120 వరకు పెరిగింది. డీఏ 25 శాతం దాటితే హౌజ్ రెంట్ అలవెన్స్ (HRA) కూడా సవరించాలని గతంలోనే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండీచర్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు 1 నుంచి 3 శాతం వరకు హెచ్ఆర్ఏ పెరుగుతుంది.
సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు ఇంతకుముందు 17 శాతం డీఏ అందించేవారు. దీనిని 28 శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి ఇది అమలులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం డీఏ, డీఆర్ 11 శాతం పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో కొత్త డీఏ రేటు 17 శాతం నుంచి 28 శాతానికి పెరిగింది. డీఏ పెంపుతో ఉద్యోగుల జీతాలు రూ.2,000 నుంచి రూ.25,000 మధ్య పెరిగాయి.
డీఏ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందించే హెచ్ఆర్ఏ కూడా సవరించిబడింది. ప్రభుత్వం హెచ్ఆర్ఏని 27 శాతానికి పెంచింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం.. ఉద్యోగులు వారి నివసించే నగరాన్ని బట్టి 27 శాతం, 18 శాతం మరియు 9 శాతం హెచ్ఆర్ఏ పొందుతారు. ఈ మూడు కేటగిరీలకు (27 శాతం, 18 శాతం, 9శాతం) కనీస హెచ్ఆర్ఏ రూ.5400, రూ.3600, రూ .1800గా ఉంది.
హెచ్ఆర్ఏను ఎలా లెక్కిస్తారంటే?
డీఓపీటీ నోటిఫికేషన్ ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెచ్‌ఆర్‌ఏలో రివిజన్ డీఏ ఆధారంగా మాత్రమే జరిగింది. 7వ పే కమిషన్ ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గరిష్ట ప్రాథమిక వేతనం (Maximum Basic Salary) నెలకు రూ.56000 అనుకుందాం. దీనికి 27 శాతం చొప్పున హెచ్‌ఆర్‌ఏ అదనంగా చేరుతుంది. అంటే..
హెచ్‌ఆర్‌ఏ = రూ.56000 X 27/100 = రూ.15120 (నెలకు)
మొదటి హెచ్‌ఆర్‌ఏ = రూ.56000 X 24/100 = రూ.13440 (నెలకు)
Also Read: LIC Pay Direct: ఎల్‌ఐసీ ప్రీమియం ఆన్‌లైన్‌లో చెల్లిస్తున్నారా? యాప్‌ను ఇలా వినియోగిస్తే బెటర్!
Also Read: GST Concil meet: జీఎస్‌టీ పరిధిలోకి పెట్రోల్? తగ్గనున్న ధరలు? సమావేశంలో చర్చించనున్న కమిటీ!