Large Cap Stocks: స్టాక్ మార్కెట్లు, షేర్‌ ధరలు కుప్పకూలుతున్నప్పుడు దలాల్‌ స్ట్రీట్‌ కామన్‌గా చేసే పని 'లార్జ్‌ క్యాప్స్‌లో పెట్టుబడి పెట్టడం'. వాటిని 'సేఫ్ బెట్స్'గా స్ట్రీట్‌ పిలుస్తుంది. సూటిగా, సుత్తి లేకుండా ఉండే మంచి స్ట్రాటెజీ అది.


లార్జ్‌ క్యాప్స్‌ ఎందుకు సేఫ్‌ బెట్స్‌?
చాలా లార్జ్‌ క్యాప్స్‌ దలాల్‌ స్ట్రీట్‌లోని చాలా తుపాన్లను ఎదుర్కొని నిలబడ్డాయి. బలమైన ఫండమెంటల్స్, తక్కువ ఓలటాలిటీ, ఎక్కువ మంది అనలిస్ట్‌ల కవరేజ్, స్థిరమైన డివిడెండ్ స్ట్రీమ్‌ కారణంగా క్రమంగా పుంజుకుంటున్నాయి.


పెద్ద మొత్తంలో పెట్టుబడితో లేకుండానే స్టాక్‌ మార్కెట్‌లో రావాలనుకునే ఇన్వెస్టర్ల కోసం ETMarkets 7 నిఫ్టీ బ్లూచిప్‌ స్టాక్స్‌ను షార్ట్‌లిస్ట్‌ చేసింది. అవన్నీ రూ. 1,000 కంటే తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు, భారతదేశంలో అందరికీ తెలిసిన, ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌ ఉన్న కంపెనీలవి.


₹1000 లోపు ధరలో దొరుకుతున్న 7 నిఫ్టీ బ్లూచిప్‌ స్టాక్స్‌
కోల్ ఇండియా, NTPC, SBI, ICICI బ్యాంక్‌ ITC, టాటా కన్స్యూమర్స్, భారతి ఎయిర్‌టెల్‌ షేర్లు ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ 7 కంపెనీలు 10% పైగా అమ్మకాలు & లాభాల వృద్ధిని YoY ప్రాతిపదికన రాబట్టాయి. వీటిలో ఎక్కువ కౌంటర్లు 15-30% పరిధిలో పెరిగాయి.


నిఫ్టీ ప్యాక్‌లో, చాలా తక్కువ ప్రీమియంతో ట్రేడవుతున్న స్టాక్స్‌ NTPC & కోల్ ఇండియా. ఈ స్టాక్స్ 52 వారాల గరిష్ట స్థాయులు వరుసగా రూ. 188.65 & రూ. 263.30. కోల్ ఇండియా 14.55% డివిడెండ్ ఈల్డ్‌తో స్ట్రాంగ్‌ పెర్ఫార్మెన్స్‌ ఇస్తోంది. FY23లో, కోల్ ఇండియా 61% లాభ వృద్ధిని సాధించింది. గత ఒక సంవత్సర కాలంలో ఈ స్క్రిప్ దాదాపు 27% పెరిగింది. NTPC బలమైన టర్నరౌండ్ కెపాసిటీ ఉంది, ఈ స్టాక్‌ గత ఒక సంవత్సర కాలంలో 30% పైగా పెరిగింది.


లిస్ట్‌లో తర్వాత ఉన్న స్ట్రీట్ ఫేవరెట్, ITC. ఈ స్టార్ పెర్‌ఫార్మర్ గత సంవత్సర కాలంలో 73% పుంజుకుంది, ఇప్పుడు దాదాపు రూ. 450 స్థాయిలో అందుబాటులో ఉంది. ఈ FMCG ప్లేయర్, FY23లో, 17% అమ్మకాల పెరుగుదల, 25% లాభ వృద్ధితో బుల్లిష్‌ సిగ్నల్స్‌ ఇస్తోంది.


దేశంలో రెండు టాప్‌ బ్యాంకులు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు కూడా రూ. 1,000 లోపు అందుబాటులో ఉన్నాయి. వీటి 52-వీక్స్‌ హై రూ. 629.65 & రూ. 958. ఈ రెండు బ్యాంక్ స్క్రిప్‌ల మీద ఎనలిస్ట్‌ల ఏకాభిప్రాయ సిఫార్సు "బయ్‌". FY23లో ఈ రెండు సంస్థలు ఆరోగ్యకరమైన లాభం & అమ్మకాల వృద్ధిని సాధించాయి. గత ఏడాది కాలంలో SBI స్టాక్ 29% పెరిగింది. ICICI బ్యాంక్ 38% ర్యాలీ చేసింది, 33.5% రాబడిని అందించిన నిఫ్టీ బ్యాంక్‌ను ఓడించింది.


లిస్ట్‌లో చివరి రెండు పేర్లు టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ & భారతి ఎయిర్‌టెల్. ఈ రెండూ ఒక్కో షేర్‌కు రూ. 800-900 స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. FY23లో ఎయిర్‌టెల్‌ స్ట్రాంగ్‌ పెర్ఫార్మెన్స్‌ చేసింది.  రిలయన్స్ జియో నుంచి గట్టి పోటీ పెరుగుతున్నప్పటికీ, లాభాలను 95% పైగా పెంచుకుంది. గత ఒక సంవత్సర కాలంలో ఈ టెలికాం స్టాక్‌ దాదాపు 29% పరుగులు తీసింది. టాటా గ్రూప్ స్టాక్‌ కూడా FY23లో మంచి పనితీరును కనబరిచింది. ఈ స్టాక్ ప్రైస్‌ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నా, ఇంకా ఓవర్‌బాట్ జోన్‌లోకి వెళ్లలేదు.


ఈ 7 పేర్లతో పాటు, ప్రస్తుతం రూ. 1,000 వద్ద ట్రేడ్ అవుతున్న సన్ ఫార్మా షేర్లు కూడా పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవచ్చు. ఈ స్టాక్‌కు 52 వారాల గరిష్టం రూ. 1,072. గత సంవత్సరంలో ఈ ఫార్మా మేజర్ లాభాలు డబుల్‌ అయ్యాయి. స్టాక్‌ రిటర్న్స్‌ విషయానికొస్తే, గత 12 నెలల్లో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 12% రాబడి ఇస్తే, ఈ స్టాక్‌ 22% పెరిగింది.


మరో ఆసక్తికర కథనం: కుప్పకూలిన ఐఐఎఫ్‌ఎల్‌ షేర్లు, ఇన్వెస్టర్లకు హై ఓల్టేజ్‌ షాక్‌ 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial