Smallcap Stocks: బెంచ్‌మార్క్‌ సెన్సెక్స్ ఇండెక్స్‌ గత ఐదు ట్రేడింగ్ సెషన్లలోని నాలుగు సెషన్లలో సానుకూలంగా ముగిసింది. BSE స్మాల్‌ క్యాప్ ఇండెక్స్ కూడా బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ మాదిరిగానే సేమ్‌ ట్రెండ్‌ కంటిన్యూ చేసింది, ఈ కాలంలో కాస్త మెరుగ్గా 4.42% రాబడి సాధించింది. ఈ 5 ట్రేడింగ్‌ సెషన్ల కాలంలో 55 స్మాల్‌ క్యాప్ స్టాక్స్‌ స్థిరంగా ట్రెండ్ అయ్యాయి. వాటిలో ఆరు 20% పైగా లాభపడ్డాయి. ఈ రేంజ్‌లో లాభపడినా, ఈ ఆరింటిలో నాలుగు స్టాక్స్‌కు బలాల కంటే బలహీనతలే ఎక్కువగా ఉన్నాయి.


గత 5 ట్రేడింగ్‌ సెషన్లలో  20% పైగా లాభపడిన 6 స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌:


ఎస్‌ఎంఎల్‌ ఇసుజు (SML Isuzu)
5 ట్రేడింగ్‌ రోజుల లాభాలు: 40% |  ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 949 | 52 వారాల గరిష్ట స్థాయి: రూ. 957
- పెరుగుతున్న లాభాల మార్జిన్‌లు
- జీరో ప్రమోటర్ ప్లెజ్డ్‌
- వాటా పెంచుకుంటున్న FIIs/FPIs
- 52 వారాల గరిష్టానికి సమీపంలో ట్రేడ్‌ అవుతున్న షేర్లు


ధని సర్వీసెస్‌ (Dhani Services)
5 ట్రేడింగ్‌ రోజుల లాభాలు: 39% | ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 35 | 52 వారాల గరిష్ట స్థాయి: రూ. 74
- గత రెండేళ్లుగా తగ్గుతున్న RoCE
- గత రెండేళ్లుగా తగ్గుతున్న ROE 
- గత రెండేళ్లుగా తగ్గుతున్న ROA
- గత రెండేళ్లుగా తగ్గుతున్న లాభాలు


ఎస్‌హెచ్‌ కేల్కర్‌ అండ్‌ కంపెనీ (SH Kelkar And Company)
5 ట్రేడింగ్‌ రోజుల లాభాలు: 26% | ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 105 | 52 వారాల గరిష్ట స్థాయి: రూ. 167
- QoQలో నికర లాభం, నికర లాభ మార్జిన్‌ తగ్గుతోంది
- YoY నికర లాభం, నికర లాభ మార్జిన్‌ తగ్గుతోంది
- గత మూడు త్రైమాసికాలుగా స్థిరంగా తగ్గుతున్న ఆదాయం
- క్యాష్‌ ఫ్లోస్‌లో భారీ తగ్గుదల


షల్బీ (Shalby)
5 ట్రేడింగ్‌ రోజుల లాభాలు: 24% | ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 145 | 52 వారాల గరిష్ట స్థాయి: రూ. 168
- తక్కువ రుణం ఉన్న కంపెనీ
- గత 4 త్రైమాసికాల్లో ప్రతి త్రైమాసికంలో ఆదాయం పెరిగింది
- గత 2 సంవత్సరాలుగా మెరుగుపడుతున్న నికర లాభాలు
- జీరో ప్రమోటర్ ప్లెజ్డ్‌ 
- వాటా పెంచుకుంటున్న FIIs/FPIs


వేదాంత లెర్నింగ్‌ సొల్యూషన్స్‌ (Veranda Learning Solutions)
5 ట్రేడింగ్‌ రోజుల లాభాలు: 24% | ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 207 | 52 వారాల గరిష్ట స్థాయి: రూ. 380
- అధిక అప్పులు ఉన్న కంపెనీలు
- గత 2 సంవత్సరాలుగా తగ్గుతున్న నగదు ప్రవాహం
- పెరుగుతున్న ఇతర ఆదాయాలు, తక్కువ నిర్వహణ ఆదాయం
- గత 2 సంవత్సరాలుగా వార్షిక నికర లాభంలో క్షీణత


డి-లింక్‌ ‍(ఇండియా) [D-Link (India)]
5 ట్రేడింగ్‌ రోజుల లాభాలు: 20% | ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 249 | 52 వారాల గరిష్ట స్థాయి: రూ. 311.
- గత 4 త్రైమాసికాలుగా పెరుగుతున్న లాభం, లాభాల మార్జిన్‌ 
- అప్పులు లేని కంపెనీ
- జీరో ప్రమోటర్ ప్లెజ్డ్‌ 
- వాటా పెంచుకుంటున్న FIIs/FPIs


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.