Dividend Stocks: 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మధ్యంతర డివిడెండ్‌ను (Interim Dividend) 5 ప్రసిద్ధ కంపెనీలు ఈ నెలలోనే (నవంబర్‌ 2022) ప్రకటించబోతున్నాయి. మరికొన్ని రోజుల్లో ఈ కంపెనీ బోర్డ్‌ డైరెక్టర్ల సమావేశాలు జరగనున్నాయి. ఒక్కో షేరుకు ఎంత మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించాలన్నది ఆ సమావేశాల్లో నిర్ణయిస్తారు. సమావేశాల నుంచి దాదాపు వారం రోజుల్లో రికార్డ్‌ డేట్‌ ఉండవచ్చు. 


రికార్డ్‌ డేట్‌ అంటే.. సదరు కంపెనీ రికార్డ్స్‌ చెక్‌ చేసే తేదీ. ఆ తేదీ నాటికి మీ డీమ్యాట్‌ ఖాతాలో ఆయా కంపెనీల్లో షేర్లు ఉంటేనే మధ్యంతర డివిడెండ్‌కు మీరు అర్హులు అవుతారు. ఇప్పటికే మీ దగ్గర ఈ కంపెనీల షేర్లు ఉంటే ఇబ్బంది లేదు. షేర్లు లేకపోతే మాత్రం.. రికార్డ్‌ తేదీ నాటికి కనీసం రెండు రోజుల ముందే వాటిని కొనాలి. ఎందుకంటే మన స్టాక్‌ మార్కెట్‌లో T+2 ‍‌(కొన్ని స్క్రిప్‌లకు T+1) సెటిల్‌మెంట్‌ పద్ధతి అమలవుతోంది. అంటే, కనీసం రెండు రోజుల ముందు షేర్లు కొంటేనే, రికార్డ్‌ తేదీ నాటికి అవి మీ డీమ్యాట్‌ ఖాతాలోకి వచ్చి చేరతాయి. రికార్డ్‌ డేట్‌ నాడు ఆ షేర్లను కొంటే మధ్యంతర డివిడెండ్‌కు మీరు అర్హులు కాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి.


త్వరలో జరగబోయే బోర్డు సమావేశాల్లో మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించబోయే 5 కంపెనీలు...  జీఆర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్, గాబ్రియేల్ ఇండియా లిమిటెడ్‌, ఆస్ట్రల్ లిమిటెడ్‌, టైడ్ వాటర్ ఆయిల్ (ఇండియా) లిమిటెడ్‌, సుప్రీం ఇండస్ట్రీస్ లిమిటెడ్. 


1. జీఆర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ (G R Infraprojects)
కంపెనీ బోర్డ్‌ డైరెక్టర్ల సమావేశం తేదీ: గురువారం, 10 నవంబర్‌ 2022
రికార్డ్‌ డేట్‌గా నిర్ణయించే అవకాశం ఉన్న తేదీ: శుక్రవారం, 18 నవంబర్‌ 2022
శుక్రవారం ‍(04 నవంబర్‌ 2022) నాడు షేరు ముగింపు ధర: రూ. 1,227.50


2. గాబ్రియేల్ ఇండియా లిమిటెడ్‌ ‍(Gabriel India Ltd)
కంపెనీ బోర్డ్‌ డైరెక్టర్ల సమావేశం తేదీ: గురువారం, 10 నవంబర్‌ 2022
రికార్డ్‌ డేట్‌గా నిర్ణయించే అవకాశం ఉన్న తేదీ: శుక్రవారం, 18 నవంబర్‌ 2022
శుక్రవారం ‍(04 నవంబర్‌ 2022) నాడు షేరు ముగింపు ధర: రూ. 161.15


3. ఆస్ట్రల్ లిమిటెడ్‌ (Astral Ltd)
కంపెనీ బోర్డ్‌ డైరెక్టర్ల సమావేశం తేదీ: శుక్రవారం, 11 నవంబర్‌ 2022
రికార్డ్‌ డేట్‌గా నిర్ణయించే అవకాశం ఉన్న తేదీ: సోమవారం, 21 నవంబర్‌ 2022
శుక్రవారం ‍(04 నవంబర్‌ 2022) నాడు షేరు ముగింపు ధర: రూ. 2,090


4. ‍‌టైడ్ వాటర్ ఆయిల్ (ఇండియా) లిమిటెడ్‌ (Tide Water Oil (India) Ltd)
బోర్డ్ డెరెక్టర్ల సమావేశం ఇప్పటికే జరిగింది.
రెండో మధ్యంతర డివిడెండ్‌ కోసం రికార్డ్‌ డేట్‌: మంగళవారం, 22 నవంబర్‌ 2022
శుక్రవారం ‍(04 నవంబర్‌ 2022) నాడు షేరు ముగింపు ధర: రూ. 1,037


5. సుప్రీం ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Supreme Industries Limited)
ఒక్కో షేరుకు రూ.6 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. 
రికార్డ్‌ డేట్‌: బుధవారం, 9 నవంబర్‌ 2022
శుక్రవారం ‍(04 నవంబర్‌ 2022) నాడు షేరు ముగింపు ధర: రూ. 2,237


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.