PSU stocks: అన్ని రకాల కంపెనీల్లాగే PSU కంపెనీలకు (ప్రభుత్వ రంగ సంస్థలు) కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. కానీ, మిగిలిన సంస్థలకు లేని అతి పెద్ద బలం వాటికి ఉంది. తక్కువ ఖర్చుతో, సులభంగా మూలధనాన్ని సేకరించ గల సామర్థ్యం వాటి సొంతం. ఎందుకంటే, ప్రభుత్వ సంస్థలు కాబట్టి పెట్టుబడిదార్లు సులభంగా ముందుకు వస్తారు, అడిషనల్ రిస్క్ ప్రీమియం తీసుకోవలసిన అవసరం వాళ్లకు ఉండదు. ఈ సంస్థల్లో కొన్నింటిది గుత్తాధిపత్యం లేదా ద్వంద్వస్వామ్యం (రెండు కంపెనీల ఆధిపత్యం). మూలధన కేటాయింపుల్లో అలాంటి వాటిపై అసంతృప్తి అసమర్థంగా ఉన్నప్పటికీ, అవి ఇప్పటికీ మంచి రాబడిని తీసుకొస్తున్నాయి.
ఈ సమయంలో, PSUల గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అంటే.. ప్రస్తుత వడ్డీ రేట్లు ఎలివేటెడ్ లెవెల్స్‌లో ఉన్నాయి. తక్కువ ఖర్చుతో, పెద్దగా ఇబ్బంది లేకుండా మూలధనాన్ని సమీకరించగల సామర్థ్యం PSUలకు ఒక పెద్ద ప్రయోజనంగా ఉంటుంది, ఈ ఫలితం రాబోయే త్రైమాసికాల్లో కనిపించవచ్చు. ప్రత్యేకించి, వచ్చే రెండు త్రైమాసికాల్లోని బ్యాలెన్స్ షీట్లలో ఇది ప్రతిబింబిస్తుంది.
ఈ నేపథ్యంలో, వివిధ బ్రోకరేజ్‌లు బుల్లిష్‌గా ఉన్న PSU కంపెనీలను ఇప్పుడు పరిశీలిద్దాం. కనీసం 10% RoE (return on equity) ఉన్న కంపెనీలను ఏరి ఈ ఒక జాబితా తయారు చేశాం. నికర లాభ మార్జిన్ కూడా ఇక్కడ కలిపాం. దీనివల్ల, సదరు కంపెనీ పనితీరును అంచనా వేయడంలో ఇవి రెండూ కీలక కొలమానంగా మారాయి.
కనీసం 10% RoE, 10% నికర లాభ మార్జిన్ ఉన్న PSUs:
REC
రికమెండేషన్: స్ట్రాంగ్ బయ్
స్టాక్ ప్రైస్‌లో ఎంత ర్యాలీకి అవకాశం: 33%
నికర లాభ మార్జిన్: 27%
రిటర్న్ ఆన్ ఈక్విటీ: 20%
FII, DIIల వాటా: 23%
మార్కెట్ క్యాప్ (కోట్ల రూ.ల్లో): 31,256
CONCOR
రికమెండేషన్: బయ్
స్టాక్ ప్రైస్‌లో ఎంత ర్యాలీకి అవకాశం: 29%
నికర లాభ మార్జిన్: 14%
రిటర్న్ ఆన్ ఈక్విటీ: 11%
FII, DIIల వాటా: 28%
మార్కెట్ క్యాప్ (కోట్ల రూ.ల్లో): 34,766
IRFC
రికమెండేషన్: స్ట్రాంగ్ బయ్
స్టాక్ ప్రైస్‌లో ఎంత ర్యాలీకి అవకాశం: 28%
నికర లాభ మార్జిన్: 28%
రిటర్న్ ఆన్ ఈక్విటీ: 16%
FII, DIIల వాటా: 3%
మార్కెట్ క్యాప్ (కోట్ల రూ.ల్లో): 35,899
NHPC
రికమెండేషన్: స్ట్రాంగ్ బయ్
స్టాక్ ప్రైస్‌లో ఎంత ర్యాలీకి అవకాశం: 26%
నికర లాభ మార్జిన్: 36%
రిటర్న్ ఆన్ ఈక్విటీ: 11%
FII, DIIల వాటా: 19%
మార్కెట్ క్యాప్ (కోట్ల రూ.ల్లో): 40,391
PFC
రికమెండేషన్: స్ట్రాంగ్ బయ్
స్టాక్ ప్రైస్‌లో ఎంత ర్యాలీకి అవకాశం: 21%
నికర లాభ మార్జిన్: 19%
రిటర్న్ ఆన్ ఈక్విటీ: 20%
FII, DIIల వాటా: 28%
మార్కెట్ క్యాప్ (కోట్ల రూ.ల్లో): 41,568
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.