3C Budget Stocks: స్టాక్ మార్కెట్ విషయంలో కేంద్ర బడ్జెట్ 2023-24 బాగుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రతిపాదించిన వృద్ధి అనుకూల బడ్జెట్, దలాల్ స్ట్రీట్‌లో ఎలుగుబంట్ల కంటే ఎద్దులకే ఎక్కువ లబ్ధిని చేకూరుస్తుంది. అయితే, అదానీ స్టాక్స్ ఆ సంతోషాన్ని ఆవిరి చేశాయి. వేడుకలు జరగాల్సిన చోట ఏడుపులు మిగిలాయి.
దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల కల్పన మీద ప్రభుత్వం స్పష్టంగా దృష్టి సారించడంతో.. బ్యాంకింగ్, ఆటో, కన్జ్యూమర్స్, బిల్డింగ్ మెటీరియల్స్, ఇన్‌ఫ్రా వంటి రంగాలు ఫోకస్‌లోకి వచ్చాయి. క్యాపెక్స్ (capex), క్రెడిట్ గ్రోత్ (credit growth), కన్‌జంప్షన్ (consumption) అనే 3C మంత్రం పెట్టుబడిదార్లకు ఇప్పుడు మార్కెట్ మొత్తం ప్రతిధ్వనిస్తోంది. అనుకూల బడ్జెట్ నేపథ్యంలో, ఆరు ప్రముఖ బ్రోకింగ్ కంపెనీలు వివిధ రంగాల్లోని 30 స్టాక్స్‌ను స్ట్రాంగ్ బుల్లిష్‌గా చూస్తున్నాయి.
ఆరు బ్రోకరేజ్‌లు ఎంచుకున్న టాప్ స్టాక్స్ ఇవి:
బ్రోకరేజ్: షేర్‌ఖాన్ (Sharekhan)
లార్జ్‌క్యాప్స్: రిలయన్స్ ఇండస్ట్రీస్, HDFC బ్యాంక్, SBI, M&M, అల్ట్రాటెక్, ఇన్ఫోసిస్, టైటాన్, ITC, SRF, L&T
మిడ్ & స్మాల్ క్యాప్స్: ట్రెంట్, ఇండియన్ హోటల్స్, గ్రీవ్స్ కాటన్, పాలిక్యాబ్ ఇండియా, PNC ఇన్‌ఫ్రాటెక్, కోఫోర్జ్, కమిన్స్
బ్రోకరేజ్: బీపీ ఈక్విటీస్ (BP Equities)
రైల్వే స్టాక్స్: ఐఆర్‌సీటీసీ, ఇర్కాన్ (IRCON), IRFC, RVNL & RITES
అగ్రి స్టాక్స్: గోద్రెజ్ ఆగ్రోవెట్, అవంతి ఫీడ్స్, వెంకీస్ ఇండియా
ఆటో స్టాక్స్: టాటా మోటార్స్, మారుతీ, అశోక్ లేలాండ్, మహీంద్రా & మహీంద్రా
స్పెషాలిటీ కెమికల్ స్టాక్స్: SRF, నవీన్ ఫ్లోరిన్, గుజరాత్ ఫ్లోరోకెమ్, జూబిలెంట్ ఇంగ్రేవియా, లక్ష్మీ ఆర్గానిక్స్, MFL
ఆగ్రోకెమికల్ స్టాక్స్: UPL, PI ఇండస్ట్రీస్
ఎలక్ట్రానిక్స్ తయారీ: డిక్సన్, అంబర్ ఎంటర్‌ప్రైజెస్
హోటల్ స్టాక్స్: చాలెట్ హోటల్స్, లెమన్ ట్రీ హోటల్స్, ఇండియన్ హోటల్స్
బ్రోకరేజ్: విలియం ఓ'నీల్ (William O'Neil)
డిఫెన్స్ స్టాక్స్: BEL, భారత్ ఫోర్జ్, HAL, మజగాన్ డాక్, GRSE
రోడ్స్ అండ్ హైవేస్: ACE, L&T, PNC ఇన్‌ఫ్రా, KNR కన్‌స్ట్రక్షన్, HG ఇన్‌ఫ్రా, GR ఇన్‌ఫ్రా, IRB ఇన్‌ఫ్రా, అశోక బిల్డ్‌కాన్
పర్యాటకం: ఇండియన్ హోటల్స్, ఐఆర్‌సీటీసీ, ఈజీ ట్రిప్, EIH
బ్రోకరేజ్: ఆనంద్ రాఠీ (Anand Rathi)
అంబర్ ఎంటర్‌ప్రైజెస్, అశోక్ లేలాండ్, ఇండియన్ హోటల్స్, ITD సిమెంటేషన్, ITC, KNR కన్స్ట్రక్షన్స్, NCC, PNC ఇన్‌ఫ్రాటెక్, టాటా మోటార్స్, అల్ట్రాటెక్
బ్రోకరేజ్: బీఎన్‌పీ పారిబాస్ (BNP Paribas)
L&T, ITC, భారత్ ఎలక్ట్రానిక్స్
బ్రోకరేజ్: మోతీలాల్ ఓస్వాల్ (Motilal Oswal)
లార్జ్‌క్యాప్స్: L&T, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, TCS, ITC, టైటాన్, ONGC, మారుతి సుజుకి, సన్ ఫార్మా
మిడ్ క్యాప్స్: సంవర్ధన మదర్సన్, APL అపోలో, దాల్మియా భారత్, ఏంజెల్ వన్, లెమన్ ట్రీ
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.