The Naval Indian Mutiny : ఫిబ్రవరి 18, 1946 న రాయల్ ఇండియన్ నేవీకి చెందిన నావికులు చేసిన తిరుగుబాటును రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు (The Naval Indian Mutiny) అని పిలుస్తారు. దీన్ని బాంబే తిరుగుబాటు అని కూడా వ్యవహరిస్తారు. అందుకు నవంబర్ 1945లోనే ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA) బీజం వేసింది. 'నేతాజీ' సుభాస్ బోస్ ధైర్యం, భావజాలానికి ఆకర్షితులైన లక్షలాది యువకులు ఆర్మీలో చేరారు. మహిళలు సైతం పోరాడేందుకు సిద్ధమయ్యారు. 1939లో మహాత్మా గాంధీ వద్దని వారిస్తున్నా బోస్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రెండోసారి పోటీ చేశారు. గాంధీజీ బలపరిచిన అభ్యర్థిని ఓడించి మరి నేతాజీ విజయం సాధించారు. పలువురు నేతలు తనకు వ్యతిరేకింగా ఉన్నారని గుర్తించిన బోస్ తక్కువ సమయంలోనే మెజార్టీ ఓట్లు సాధించడంలో సక్సెస్ అయ్యారు.


1941లో బ్రిటీష్ సైన్యం కలకత్తాలోని తన నివాసంలో సుభాష్ చంద్రబోస్‌ను గృహనిర్బంధంలో ఉంచగా.. అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న బోస్ ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్లిపోయాడు. అక్కడి నుంచి చివరికి జర్మనీకి చేరుకున్నారు. జర్మనీ అధినేత హిట్లర్‌ను సైతం కలుసుకుని చర్చలు జరిపారు. నాటకీయ పరిణామాల మధ్య 1943లో ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ (INA)ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అదే సంవత్సరం అక్టోబర్‌లో స్వేచ్ఛాయుత తాత్కాలకి భారత ప్రభుత్వాన్ని బోస్ ఏర్పాటు చేశారు.


ఇంఫాల్ మరియు కోహిమా మరియు బర్మాలో ఆజాద్ హింద్ ఫౌజ్ సైనిక చర్యను ఎదుర్కొనాల్సి వచ్చింది. యుద్ధం ముగియడానికి నెలల ముందు ఐఎన్ఏను నిర్వీర్యం చేశారు.  యుద్ధం ముగిసే సమయానికి బ్రిటన్ విజయం సాధించింది. కానీ బోస్ భవిష్యత్ ఏంటన్న దానిపై సందేహాలు నెలకొన్నాయి.  కొంతకాలానికి సెప్టెంబరు 1945లో తైవాన్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ మరణించినట్లు ప్రకటించారు. అయితే భారతదేశంలో లక్షలాది ప్రజలు బోస్ మరణాన్ని విశ్వసించలేదు. కొందరు నేటికీ బోస్ మరణం ఎప్పుడు సంభవించనే దానిపై ఆధారాలు అడుగుతుంటారు. ఏది ఏమైతేనేం దేశ స్వాతంత్య్రం కోసం తన వంతుగా పోరాడిన నేతాజీని తమ హీరోగా భావిస్తారు.


సుభాస్ బోస్ మరణం నుండి దేశం ఇంకా కోలుకోకముందే బ్రిటీషు అధికారులు మరిన్ని చర్యలు తీసుకున్నారు. తమకు వ్యతిరేకంగా పోరాడిన భారత సైనికులు, అధికారులపై రాజద్రోహం, హత్య, రాజు-చక్రవర్తికి వ్యతిరేకంగా చట్టవిరుద్ధంగా యుద్ధం చేయడం వంటి ఆరోపణలతో చట్టపరమైన చర్యలు మొదలుపెట్టారు. రాయల్ ఇండియన్ నేవీ (RIN) తిరుగుబాటును తక్కువ సమయంలోనే అణచివేశారు. అయితే నేవీ తిరుగుబాటుకు మాత్రం ఇండియన్ నేషనల్ ఆర్మీ గతంలో చేసిన పోరాటమే ఓ కారకంగా మారింది.


భారతదేశపు ప్రముఖ చరిత్రకారులలో ఒకరైన సుమిత్ సర్కార్ దీని గురించి ఏమన్నారంటే.. నావికాదళ తిరుగుబాటు (రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు) దేశ స్వాతంత్ర్య పోరాటంలో విస్మరించబడిన ప్రధాన ఘట్టాలలో ఇది ఒకటని పేర్కొన్నారు. తిరుగుబాటుదారులు తాము సాధించిన అంశాల ప్రాముఖ్యతను నొక్కిచెప్పినా అంతగా గుర్తింపు దక్కలేదు. తమ సమ్మె, తిరుగుబాటు దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక సంఘటన అని తిరుగుబాటు చేసిన నేవీ అధికారులు గొంతెత్తి చెప్పారు. దేశ సర్వీసులలో ఉన్న ఉద్యోగులతో పాటు ప్రజల రక్తం సైతం మరిగిపోయింది, తొలిసారిగా సర్వీసు ఉద్యోగులతో కలిసి సోదర సోదరీమణులు సైతం తమ వంతుగా పోరాడారు. సాహసం చేసిన వారంతా ఎప్పటికీ జీవించి ఉంటారు, జైహింద్ అని రాసుకొచ్చారు.


తిరిగి ఎంపికైన నావికులపై చాలా వరకు ఫిర్యాదలు నమోదయ్యాయి. వారికి తగిన ర్యాంకులు, రేటింగ్స్ ఇవ్వలేదు. యువకులకు తగినంత జీతం, ఉద్యోగంలో స్థిరత్వం అని ఆశ చూపి వారిని దేశ రక్షణలో భాగం చేశారు. కానీ ఎంపికైన తరువాత వారు ఆహారం కోసం సైతం ఎన్నో కష్టాలు పడ్డారు. తప్పుడు గ్దానాలతో వారిని నియమించారని తెలుసుకునేలోపే ఆలస్యం జరిగిపోయింది. బ్రిటీష్ అధికారులు భారత సైనికులు, నేవీ అధికారులకు కుళ్లిపోయిన ఆహారం పెట్టేవారు. వీలు కల్పించుకుని మరీ అవమానాలకు గురిచేశారు. ఆ తిరుగుబాటు తరువాత వారు బాహ్య ప్రపంచాన్ని చూసే అవకాశాన్ని సైతం మనవారికి కల్పించలేదు. అయినప్పటికీ, తిరుగుబాటుదారుల డిమాండ్లు నెరవేర్చాలని కమిటీలు ఏర్పాటు చేసుకుని బ్రిటీషు వారిని ప్రశ్నించే ప్రయత్నాలు తరచూ జరుగుతుండేవి. వీరి కమిటీ సూచనల్ని బ్రిటీషర్లు పెడచెవిన పెట్టేవారు.


యుద్ధం ముగిసిన తరువాత మగవారిని సాధారణ జీవితం గడిపేందుకు విడుదల చేస్తారు. కానీ వారికి ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండేవి. అంతేకాకుండా, జపాన్ తర్వాత వలసరాజ్యాలను పెంచుకోవాలని డచ్చివారు నిశ్చయించుకున్న ఇండోనేషియాకు భారత బలగాలు, సిబ్బందిని బ్రిటన్ అధికారులు బలవంతంగా తరలించారు. బ్రిటీష్ మరియు భారతీయ నావికులకు చాలా వ్యత్యాసం చూపించారు.


ఫిబ్రవరి 18న, HMIS తల్వార్ అనే సిగ్నల్స్ ట్రైనింగ్ విషయంలో రేటింగ్ సమస్య మొదలైంది. HMIS తల్వార్  కమాండింగ్ ఆఫీసర్ నీచమైన జాతి, మీరు ఎవరికి పుట్టారురా అంటూ దారుణంగా వ్యవహరించారు. అడవి జాతి వాళ్లు, కూలీలుగా పడి ఉండాలని హెచ్చరిస్తూ నరకయాతన పెట్టారు. 1 డిసెంబర్ 1945న, HMIS తల్వార్ మరియు ఇతర నౌకాదళ నౌకలు, తీర ప్రాంతానికి వస్తాయని అంతా భావించారు. కానీ ఆ తెల్లవారుజామున బ్రిటిష్ అధికారులు పరేడ్ గ్రౌండ్‌లో ఉండగా 'క్విట్ ఇండియా', 'తిరుగుబాటు చేద్దాం' అనే సంకేతాలను గుర్తించారు. నావికాదళంలో ఐదు సంవత్సరాలు పనిచేసిన సీనియర్ టెలిగ్రాఫిస్ట్ బలాయ్ చంద్ దత్ చేసిన పని అని తరువాత నిర్ధారించారు. రాయల్ ఇండియన్ నేవీ పోరాటం గురించి తనకు తెలిసిన విషయాలు ఆయన వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.


RIN తిరుగుబాటుపై ప్రమోద్ కపూర్ తన పుస్తకంలో ఎన్నో  అమూల్యమైన, మనకు అంతగా తెలియని వివరాలను పంచుకున్నారు. నేవీ తిరుగుబాటు ఆకస్మికంగా జరిగినప్పటికీ, తిరుగుబాటుదారులను ప్రేరేపించే విధంగా జరిగినట్లు పేర్కొన్నారు. భారతీయ వ్యవసాయంపై బ్లాసమ్స్ ఇన్ ది డస్ట్, ఇండిపెండెన్స్ ఆఫ్ ది ఇర్రేషనల్ పెసెంట్ వంటి క్లాసిక్‌లను యువ జర్నలిస్ట్ కుసుమ్ నాయర్ రచించారు. రగిలిన అసంతృప్తి ఎంత విస్తృతంగా వ్యాపించిందో త్వరలోనే అందరికీ తెలిసింది. మూడు రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే సమ్మె ఉధృతంగా మారిపోయింది. తిరుగుబాటు 75 ఓడలు, 20 తీర ప్రాంతాలకు వ్యాపించగా.. 20,000 మంది నావికులు ఇందులో పాల్గొన్నారు. వారంతా అందరూ 26 ఏళ్లలోపు వారే. ఈ విషయాన్ని అప్పటి భారతదేశ వైస్రాయ్ ఫీల్డ్ మార్షల్ వేవెల్ బ్రిటన్ ప్రధాని క్లెమెంట్ అట్లీకి టెలిగ్రామ్‌లో తెలిపారు.


అడ్మిరల్ జాన్ హెన్రీ గాడ్‌ఫ్రే తాను నౌకాదళాన్ని నిర్వీర్యం చేయడానికి సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించాడు. కానీ ఆ చర్యకు పూనుకుంటే అది మరింత పెద్ద తిరుగుబాటుకు దారి తీస్తుందని భావించాడు. నేవల్ సెంట్రల్ స్ట్రైక్ కమిటీ నగర వ్యాప్త హర్తాల్‌కు పిలుపునివ్వగా కార్మికులు మరియు బొంబాయి నివాసితులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అప్పటి రెండు ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, ముస్లిం లీగ్ సమ్మెకు మద్దతు ఇవ్వనప్పటికీ, సామాన్య ప్రజలే సొంతంగా సమ్మెలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. 


బ్రిటీష్ దళాల ముట్టడితో కొందరు నిరాహారదీక్షలో చిక్కుకుపోగా, ప్రజలు మాత్రం రేటింగ్‌లకు ఉచితంగా ఆహారాన్ని పంపిణీ చేశారు. దుకాణదారులు కూడా వారికి అవసరమైన వాటిని తీసుకోవాలని చెప్పి ఉచితంగా ఇచ్చారు. ఒక్క చోటల మొదలైన సమ్మె దేశంలోని అన్ని నాకాదళాలకు వ్యాపించింది. కరాచీలో HMIS హిందుస్థాన్  యుద్ధం తర్వాత అణచివేత పూర్తయింది. ఫిబ్రవరి 23న ఇకపై వలసరాజ్యాల నియంత్రణలో బొంబాయి లేనట్లు అని 'బాంబే ఇన్ రివోల్ట్: సిటీ ఎ బాటిల్ ఫీల్డ్ ' (ది హిందూస్తాన్ టైమ్స్); ‘నైట్మేర్ గ్రిప్స్ బాంబే’ (డాన్-అప్పుడు బొంబాయిలో ప్రచురితమయ్యే పేపర్), రాయటర్స్ మెషిన్-గన్డ్ ఇన్ బొంబాయి (ది స్టేట్స్ మాన్) వార్తా పత్రికల్లో వచ్చింది.


ఈ ఘర్షణలో దాదాపు 400 మంది వరకు చనిపోతారు. సమ్మె ఫిబ్రవరి 23న అకస్మాత్తుగా ముగిసింది. సమ్మె వెనుక అరుణా అసఫ్ అలీ మినహా రాజకీయ నాయకులు ఎవరూ లేరని గ్రహించారు. హింసకు గాంధీ నైతిక బాధ్యత వహించి, ఆయుధాలను వదిలేస్తామని ప్రకటిస్తారని అంతా ఊహించారు. నావికా దళ తిరుగుబాటు చరిత్రలో కొందరు నేతలు విమర్శలకు గురి కాగా, మరికొందరిపై విశ్వాసం కోల్పోయారు. 


నావికా దళానికి తక్షణమే తాను మద్దతు తెలుపుతున్నాని నెహ్రూ చెప్పాలని భావించగా.. స్ట్రైక్ కమిటీ సభ్యులతో చర్చలు జరగడానికి కాంగ్రెస్ నేతలైన వల్లభాయ్ పటేల్, అందుకు నిరాకరించినట్లు సమాచారం. హడావుడిగా ఏ విషయంలోనూ మద్దతు తెలుపకూడదని, ఆలోచించి పరిష్కారం ఆలోచించాలని పటేల్ సూచించారు. అయితే లొంగిపోయిన వారిని తక్కువ శిక్షలతో వదిలివేస్తామని, లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పడంతో రేటింగ్స్ సమ్మె విరమించినట్లు రాశారు.


కపూర్ తాను రాసిక పుస్తకం ‘1946-ది లాస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్: రాయల్ ఇండియన్ నేవీ మ్యూటినీ’లో రేటింగ్‌ల జరిగిన ద్రోహం భారత జాతీయవాదం, రాజకీయ నాయకత్వ వైఫల్యం చరిత్రలో అత్యంత హీనమైన అధ్యాయంగా అభివర్ణించారు. కొందరు నేవీ సిబ్బందిని ఖైదు చేయగా, మరికొందర్ని శిబిరాల్లో ఉంచారు. వారికి రావాల్సిన జీతాలు, బకాయిలు చెల్లించకుండానే స్వస్థలాలకు ఉట్టి చేతులతో తిరిగి పంపించేశారు. అదే విధంగా చరిత్రలో సైతం కనుమరుగయ్యారు. పటేల్, ఆజాద్, నెహ్రూ,  జిన్నాలు విఫలమయ్యారు అని చెబితే చిన్న పదం అవుతుంది. 


కాంగ్రెస్‌ పార్టీని, నేతల్ని కేవలం అధికారం కోసం మాత్రమే ఆశ చూసే వారికి చెప్పడానికి ఇది ఓ ఉదాహరణగా మారింది. దేశంలోని సాయుధ దళాలలో తిరుగుబాటును వారసత్వంగా పొందుతున్నాం. కానీ ఈ విషయాన్ని కాంగ్రెస్ గానీ, ముస్లిం లీగ్ గానీ అంగీకరించలేదు. లొంగిపోవడానికి రేటింగ్‌లను ఒప్పించే తన నిర్ణయాన్ని పటేల్ సమర్థించుకున్నారు. సైన్యంలో క్రమశిక్షణ ఎల్లప్పుడూ అలాగే ఉండాలని, దృఢ సంకల్పంతో కొనసాగాలని తాను కోరుకునన్నట్లు చెప్పారు పటేల్.


1946లో రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటుకు సంబంధించిన అన్ని అంశాలు ఇక్కడ ప్రస్తావించలేదు. కానీ పాఠకులకు రెండు విషయాలు మాత్రం అర్థమవుతాయి. కాంగ్రెస్, ముస్లిం లీగ్ మద్దతు ఇవ్వని సమయంలో కమ్యూనిస్టులు మాత్రమే రేటింగ్‌ల (Sailors)కు తమ పూర్తి మద్దతునిచ్చిన ఘనత పొందారు. అదే సమయంలో క్విట్ ఇండియా ఉద్యమానికి మద్దతు తెలపకపోవడంతో తమ ప్రాబల్యాన్ని కోల్పోయారు. కమ్యూనిస్టులు విముక్తి కోసం చూశామని, ఆ క్రెడిట్ మాత్రం వదులుకునే ఛాన్స్ లేదు. 


భారతీయ కమ్యూనిజంలో విలక్షణత ఉంది. చాలా మంది కమ్యూనిస్టులు రాజ్యాంగ బద్ధంగా పనిచేయడానికి అంగీకరించారు. కొందరు కమ్యూనిస్టులు తిరుగుబాటును ఆయుధంగా చేసుకుని ముందుకు నడవాలని పిలుపునివ్వడం మరో భిన్నమైన వాదన.  కమ్యూనిస్ట్ పాలన కొనసాగుతున్న దేశాలలో సాయుధ దళాలలో అసమ్మతిని అణచివేయడం అంశంలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాయి.


రెండో అంశం ఏంటంటే.. ఓ ప్రధాన సమస్య వచ్చినప్పుడు హిందువులు, ముస్లింలులు సోదర భావంతో మెలిగి ఏకమై పోరాటం చేస్తామని నేవీ పోరాటం ద్వారా స్పష్టమైంది. ఆ తరువాత కొందరు మతపరమైన విభజనకు మద్దతిస్తూ హిందూ దేశంగా మార్చాలని ప్రయత్నాలు చేశారు. స్వాతంత్య్రం కోసం సుదీర్ఘకాలం పోరాటం చేసిన తరువాత మతతత్వ విభజన అంశాలు తెరపైకి రావడం విచారకరం. అందరూ కలిసికట్టుగా పోరాటం చేయడంతోనే బ్రిటీషు పాలనకు తెరదించాం.  


(Vinay Lal is a writer, blogger, cultural critic, and Professor of History at UCLA)


[Disclaimer: The opinions, beliefs, and views expressed by the various authors and forum participants on this website are personal and do not reflect the opinions, beliefs, and views of ABP News Network Pvt Ltd.]