5 Tests Before Buying A Car: మీరు త్వరలోనే మీ కొత్త కారు డెలివరీని తీసుకోబోతున్నట్లయితే ఈ వార్త మీకు చాలా ముఖ్యమైనది అవుతుంది. చాలా సార్లు కారు డీలర్లు తప్పుగా లేదా ఉద్దేశపూర్వకంగా చిన్న చిన్న డెంట్లు, గీతలు లేదా పాత మోడల్ వంటి సమస్యలు ఉన్న కారును అప్పగిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో లక్షల్లో నష్టం నుంచి తప్పించుకోవడానికి డెలివరీ తీసుకునే ముందు ఈ 5 ముఖ్యమైన పరీక్షలు చేయాలి. ఈ ముఖ్యమైన పరీక్షలు ఏమిటో తెలుసుకుందాం. 

Continues below advertisement


అవుటర్ డిజైన్‌ను జాగ్రత్తగా పరిశీలించండి


కారు డెలివరీని తీసుకునే ముందు దాని బాడీని బాగా పరిశీలించండి.  అణువణువూ జాగ్రత్తగా చూడండి కారుపై చిన్న చిన్న డెంట్లు, గీతలు లేదా తుప్పు మచ్చలను జాగ్రత్తగా తనిఖీ చేయండి. ఏదైనా లోపం కనిపించిన వెంటనే డీలర్‌కు తెలియజేయండి.


హెడ్‌ల్యాంప్ నుంచి టైల్‌ల్యాంప్ వరకు అన్ని లైట్లను తనిఖీ చేయండి


కొత్త కారులో హెడ్‌లైట్, ఫాగ్ లైట్, టైల్ లైట్, బ్రేక్ లైట్, సైడ్ మిర్రర్ లైట్లు, నంబర్ ప్లేట్ లైట్,  రిఫ్లెక్టర్ల పనితీరును బాగా చూడండి. ఏదైనా లైట్ సరిగ్గా పని చేయకపోతే, భవిష్యత్తులో మీకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.


కారులోపలి భాగాలను కచ్చితంగా పరీక్షించండి


కారు అంతర్గత భాగాలను సరిగ్గా పరీక్షించడం చాలా ముఖ్యం. డ్యాష్‌బోర్డ్, స్టీరింగ్ వీల్, మౌంట్ చేసిన నియంత్రణలు, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యాష్‌బోర్డ్ స్టోరేజ్ కంపార్ట్‌మెంట్ల సరియైన స్థితి , పనితీరును తనిఖీ చేయండి. అంతర్గత నాణ్యతే కారులో సౌకర్యం , అనుభవాన్ని డిసైడ్ చేస్తుంది.


సెక్యూరిటీ లక్షణాలు బాగా చూండి


కారులో ఉన్న సెక్యూరిటీ లక్షణాలను, ఉదాహరణకు సీట్ బెల్ట్లు, చైల్డ్ సేఫ్టీ సీట్ యాంకర్లు, పవర్ విండో సిస్టమ్ , పార్కింగ్ సెన్సార్లను తప్పనిసరిగా పరీక్షించండి. ఇవి అన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయని నిర్ధారించుకోండి, తద్వారా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఉండవు.


కారు బోనెట్ లోపలి భాగాన్ని తనిఖీ చేయండి


కారు ఇంజిన్ కంపార్ట్‌మెంట్‌ను కూడా పరిశీలించండి. ఇంజిన్ ఆయిల్, కూలెంట్, బ్రేక్ ఆయిల్,  పవర్ స్టీరింగ్ ఫ్లూయిడ్ స్థితిని తనిఖీ చేయండి. ఏదైనా లీక్ లేదా లోపం లేదని నిర్ధారించుకోండి, తద్వారా కారు దీర్ఘకాలం మంచి పనితీరును అందిస్తుంది.