TVS Jupiter 110 Price, Down Payment, Loan and EMI Details: రోజూ ఆఫీస్‌కు వెళ్లి రావడానికి లేదా ఇతర పనుల కోసం అప్-డౌన్ చేయడానికి అతికినట్లు సరిపోయే స్కూటర్‌ టీవీఎస్‌ జూపిటర్‌ 110. ఈ స్కూటర్‌ మీ కోసం చక్కగా పని చేస్తుంది & మెరుగైన మైలేజీతో డబ్బు కూడా ఆదా చేస్తుంది. మీరు కూడా TVS Jupitor 110 కొనాలని ప్లాన్ చేస్తుంటే, మీ దగ్గర పూర్తి స్థాయి డబ్బు లేకపోతే, ఈ స్కూటర్‌ను ఫైనాన్స్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. దీనికోసం, కాస్త డౌన్‌పేమెంట్‌, నెలనెలా కట్టేందుకు మీ దగ్గర దాదాపు రూ. 3000 ఉంటే చాలు.

తెలుగు నగరాల్లో ధరTVS Jupiter 110 ఎక్స్‌-షోరూమ్‌ ధర (TVS Jupiter 110 ex-showroom price) 81,831 రూపాయలు. మీరు ఈ స్కూటర్‌ బేస్ వేరియంట్‌ను హైదరాబాద్‌ లేదా విజయవాడలో కొనాలంటే, ఆన్-రోడ్ ధర (TVS Jupiter 110 on-road price) దాదాపు రూ. 1,02 లక్షలు. ఇతర తెలుగు నగరాలు/పట్టణాల్లోనూ దాదాపు ఇదే ధర ఉంటుంది. ఆన్-రోడ్ ధర అంటే.. ఇందులో ఎక్స్‌-షోరూమ్‌ ధర, RTO ఛార్జీలు, బీమా & ఇతర ఖర్చులు కలిసి ఉంటాయి. TVS Jupiter ను ఫైనాన్స్‌లో తీసుకోవడానికి, మీరు కనీసం రూ. 10,000 డౌన్ పేమెంట్ చెల్లించాలి. ఆ తర్వాత, మిగిలిన రూ. 92,000 బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలి. మీకు ఈ లోన్‌ ఇప్పించడానికి, టీవీఎస్‌ షోరూమ్‌లోనే బ్యాంక్‌ ప్రతినిధులు ఉంటారు, అతి తక్కువ సమయంలో పని పూర్తి చేస్తారు.

బ్యాంక్‌, రూ. 92,000 రుణాన్ని మీకు 9 శాతం వడ్డీ రేటుతో ఇచ్చిందని అనుకుందాం. ఇప్పుడు EMI ప్లాన్‌ చూద్దాం.

4 సంవత్సరాల్లో రుణం మొత్తం తీర్చేయాలనుకుంటే, నెలకు EMI రూ. 2,584 చెల్లించాలి.

3 సంవత్సరాల రుణ కాలపరిమితి పెట్టుకుంటే, నెలకు EMI రూ. 3,217 చెల్లించాలి.

2 సంవత్సరాల కోసం లోన్‌ తీసుకుంటే, నెలకు EMI రూ. 4,483 చెల్లించాలి.

1 సంవత్సరంలో లోన్‌ క్లియర్‌ చేయాలంటే, నెలకు EMI రూ. 8,282 చెల్లించాలి.

నెలకు దాదాపు రూ.3000 మీరు చెల్లించగలిగితే, 3 లేదా 4 సంవత్సరాల EMI ఆప్షన్‌తో టీవీఎస్‌ జూపిటర్‌ను మీ సొంతం చేసుకోవచ్చు. 

బ్యాంక్‌ ఇచ్చే లోన్‌, విధించే వడ్డీ రేటు మీ క్రెడిట్‌ స్కోర్‌, బ్యాంక్‌ విధానంపై ఆధారపడి ఉంటాయి.

టీవీఎస్ జూపిటర్ 110 ఫీచర్లుTVS జూపిటర్‌లో OBD-2B (On-Board Diagnostics, Phase 2) ఉంటుంది, సెన్సార్ టెక్నాలజీతో ఇది పని చేస్తుంది. ఈ సెన్సార్ సాయంతో థ్రోటిల్ రెస్పాన్స్, గాలి-ఇంధన మిశ్రమం, ఇంజిన్ ఉష్ణోగ్రత, ఇంధన పరిమాణం & ఇంజిన్ వేగానికి సంబంధించిన డేటా రైడర్‌కు అందుబాటులోకి వస్తుంది. ఆన్‌బోర్డ్ ఇంజిన్ కంట్రోల్ యూనిట్ (ECU) సాయంతో ఈ డేటాను నిజ సమయంలో పర్యవేక్షించవచ్చు. ఆన్‌బోర్డ్ ఇంటెలిజెన్స్ సాయంతో స్కూటర్‌ను పర్యావరణానికి అనుగుణంగా నడపవచ్చు, ఇది కాలుష్యాన్ని తగ్గిస్తుంది.

TVS జూపిటర్ 110 పవర్TVS Jupiter 110 ఇంజిన్‌ అప్‌డేట్‌ అయింది. ఈ ద్విచక్ర వాహనంలో 113.3 cc, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ బిగించారు, ఇది ఇంధన ఇంజెక్షన్ టెక్నాలజీని కలిగి ఉంది. స్కూటర్‌లోని ఈ ఇంజిన్ 5,000 rpm వద్ద 7.91 bhp పవర్‌ను ఇస్తుంది & 5,000 rpm వద్ద 9.2 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. దీనిలో CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ఉపయోగించినప్పుడు, అది ఎలక్ట్రిక్ అసిస్ట్‌తో టార్క్‌ను 9.8 Nmకి పెంచుతుంది. TVS జూపిటర్‌ 110 స్కూటర్ గంటలకు గరిష్టంగా 82 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు.