Yamaha XSR155 Mileage: తెలుగు యువత చాలా కాలంగా ఎదురుచూస్తున్న Yamaha XSR155 చివరకు మన మార్కెట్‌లోకి వచ్చింది. MT-15, R15 లతో ఒకే ఇంజిన్, ఒకే ప్లాట్‌ఫామ్‌ను పంచుకుంటూ వచ్చిన ఈ స్పోర్టీ నియో రెట్రో బైక్ గురించి రైడర్లలో ప్రధానంగా ఉన్న ప్రశ్న – "కంపెనీ చెప్పిన లెక్కలు కాకుండా, నిజ జీవితంలో ఈ బండి ఎంత మైలేజ్ ఇస్తుంది?". ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి, Yamaha XSR155ను ఎక్స్‌పర్ట్‌లు రియల్ వరల్డ్ పరిస్థితుల్లో టెస్ట్ చేశారు.
Yamaha XSR155 రియల్ వరల్డ్ మైలేజ్ ఫలితాలు
టెస్టింగ్ విధానం ప్రకారం, ముందుగా బైక్ ట్యాంక్‌ను పూర్తిగా నింపి, కంపెనీ సూచించిన విధంగానే టైర్ ప్రెషర్‌లో ఉంచి నడిపారు.
హైవే మైలేజ్ టెస్ట్ముందుగా, విశాలమైన హైవే మీద సుమారు 50 కిలోమీటర్లకు పైగా XSR155ను ఎక్స్‌పర్ట్ రైడర్లు నడిపారు. ఆ తర్వాత మళ్లీ ట్యాంక్ నింపినప్పుడు 1.1 లీటర్ పెట్రోల్ అవసరమైంది. దీని ఆధారంగా లెక్కిస్తే, హైవే మీద ఈ బైక్ ఇచ్చిన మైలేజ్ప్రతి లీటరుకు 51.7 కిలోమీటర్లు.
సిటీ మైలేజ్ టెస్ట్తర్వాత సౌత్ ముంబైలోని ట్రాఫిక్‌తో నిండిన రోడ్లపై దాదాపు 50 కిలోమీటర్ల లోపు రైడ్ చేశారు. ఈసారి ట్యాంక్ టాప్ అప్ చేయడానికి (తిరిగి నింపడానికి) కేవలం 0.96 లీటర్ పెట్రోల్ సరిపోయింది. దీంతో సిటీ మైలేజ్ ప్రతి లీటర్‌కు 50.3 కిలోమీటర్లు అని తేలింది.
మొత్తం సగటు మైలేజ్సిటీ + హైవే కలిపి చూస్తే, సగటున, లీటర్‌కు 50 కిలోమీటర్లు ఈ బండి ఇచ్చింది. ఈ సంఖ్యలు 155cc సెగ్మెంట్‌లో నిజంగా అద్భుతమైనవే.
Yamaha XSR155 ఫ్యూయల్ ఎఫిషియెన్సీ ఎందుకు బాగుంది?
Yamaha 155సీసీ లిక్విడ్ కూల్డ్ బైక్‌లు ఎప్పటి నుంచో మంచి మైలేజ్‌కు పేరుగాంచాయి. XSR155 కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. ఈ బైక్‌లో ఉన్న 155సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ MT-15తో ఒకే గేరింగ్‌ను ఉపయోగిస్తుంది. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే, XSR155 బరువు కేవలం 137 కిలోలు మాత్రమే. ఇది MT-15తో పోలిస్తే సుమారు 4 కిలోలు తక్కువ. తక్కువ బరువు అంటే ఇంజిన్‌పై తక్కువ లోడ్, మైలేజ్ మెరుగ్గా రావడం సహజం.
ఇంకో ముఖ్యమైన అంశం 6 స్పీడ్ గేర్‌బాక్స్. గేర్ రేషియోలు చాలా బాగా సెట్ చేశారు. హైవే మీద గంటకు 80 కిలోమీటర్ల వేగంతో (టెస్ట్ జరిగిన రోడ్డు మీద లీగల్ లిమిట్) వెళ్తున్నప్పుడు కూడా ఇంజిన్ తన స్వీట్ స్పాట్‌లోనే ఉంది. ఇది కూడా ఫ్యూయల్ ఎఫిషియెన్సీ పెరగడానికి కారణం.
Yamaha XSR155 ఫ్యూయల్ ఎఫిషియెన్సీ టెస్ట్ ఎలా జరిగింది?
- టెస్టింగ్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా సాగింది.
- ముందుగా ట్యాంక్‌ను పూర్తిగా నింపారు.
- టైర్ ప్రెషర్‌ను కంపెనీ సూచించిన స్థాయిలో ఉంచారు
- ముందుగానే ఫిక్స్ చేసిన సిటీ, హైవే రూట్లపై బైక్‌ను నడిపారు
- నిజ జీవితానికి దగ్గరగా ఉండే సగటు వేగాలను పాటించారు
- రెండు రకాల రోడ్లపై రైడర్ బరువు, లోడ్ అన్నీ సమానంగా ఉంచారు
- టెస్ట్ ముగిసిన తర్వాత మళ్లీ ట్యాంక్ పూర్తిగా నింపి, ఎంత పెట్రోల్ ఖర్చైంది అనే దాని ఆధారంగా ఖచ్చితమైన మైలేజ్ లెక్కించారు.
ముగింపు
Yamaha XSR155 కేవలం లుక్‌లకే కాదు, మైలేజ్ విషయంలో కూడా బలమైన బైక్ అని ఈ టెస్ట్ స్పష్టంగా చూపించింది. రోజువారీ ప్రయాణాలు, హైవే రైడ్స్ రెండింటికీ మంచి బ్యాలెన్స్ కావాలనుకునే వారికి ఇది ఖచ్చితంగా ఒక ఆకర్షణీయమైన ఎంపిక.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.