Yamaha Ray ZR Hybrid Scooter: ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా స్కూటీలకు చాలా డిమాండ్ ఉంది. యూరోప్ దేశాల్లో ఇవి భారీ సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన పెద్ద విషయం ఏమిటంటే ఒక మేడ్ ఇన్ ఇండియా స్కూటర్ యూరోప్‌లో అమ్మకాల పరంగా దూసుకుపోతుంది. దీన్ని ఇండియా యమహా మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసింది. ఈ సంవత్సరం జూన్, జూలై మధ్య, యమహా రే జెడ్ఆర్ 125ఎఫ్‌కు సంబంధించిన 13,400 యూనిట్లను కంపెనీ ఎగుమతి చేసింది. ఈ స్కూటర్లన్నీ యూరప్‌లోని వివిధ దేశాల్లో అమ్ముడుపోయాయి.


యమహా తయారు చేసిన ఈ స్కూటర్ గొప్ప ఫీచర్లను కలిగి ఉంది. దాని అత్యుత్తమ నాణ్యత, అత్యాధునిక ఫీచర్లకు ప్రసిద్ధి చెందింది. అంతే కాకుండా ఇది అద్భుతమైన మైలేజీని కూడా ఇస్తుంది. ఈ ఫీచర్ల కారణంగా యూరోపియన్ దేశాలలో దీని అభిమానుల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. 


Also Read: 4 లక్షల స్కూటర్లు వెనక్కి తీసుకుంటున్న సుజుకి- మీ దగ్గర ఉంటే వెంటనే షోరూమ్‌కి తీసుకెళ్లండి


యూరోపియన్ మార్కెట్లలో దీనికి విపరీతమైన డిమాండ్
యమహా రే జెడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ మేడ్ ఇన్ ఇండియా మోడల్ ధర పెరుగుతోంది. ఈ ఏడాది యూరప్‌లోని 27 దేశాలకు ఈ స్కూటీకి సంబంధించి మొత్తం 13,400 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. యూరప్ మార్కెట్‌లోనూ యమహా స్కూటర్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోందని ఇది తెలియజేస్తోంది. ఈ సందర్భంగా యమహా మోటార్‌ ఇండియా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చైర్మన్‌ ఐషిన్‌ చిన్నా మాట్లాడుతూ ఇది తమకు గర్వకారణమని యూరప్‌లో ఈ స్కూటర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.


ఈ స్కూటర్‌కు డిమాండ్ పెరుగుతున్న యూరోపియన్ దేశాలలో గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్, గ్రీస్, స్విట్జర్లాండ్, టర్కీ ఉన్నాయి. దీనికి డిమాండ్ పెరగడానికి ఈ స్కూటీలో ఉన్న గొప్ప ఫీచర్లే కారణం. హైబ్రిడ్ స్టైలింగ్, పవర్ ఫుల్ ఇంజన్ కాంబోతో వస్తున్న ఈ స్కూటర్ బోల్డ్ కలర్ ఆప్షన్‌లతో మార్కెట్లోకి వచ్చింది. యమహా రే జెడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ మీకు మెరుగైన పనితీరును అందిస్తుంది. దీంతో పాటు ఈ పవర్ ఫుల్ స్కూటీలో ఫ్రంట్ డిస్క్ బ్రేక్, పెద్ద స్టోరేజ్ కంపార్ట్‌మెంట్ పిక్-అప్, మైలేజీతో సహా అనేక అధునాతన ఫీచర్లు ఇందులో కంపెనీ అందించింది.



Also Read: మహీంద్రా థార్ 5 డోర్స్‌ వెర్షన్‌ ROXXలో అదిరిపోయే ఫీచర్ - సేల్స్ దుమ్ములేపాలని టార్గెట్