Fascino and RayZR Latest News:  య‌మ‌హా మోటార్స్ ఇండియా.. త‌న స్కూట‌ర్స్ విభాగంలో స‌రికొత్త‌గా రెండు మోడ‌ళ్ల‌ను తీసుకొచ్చింది. ట్రాఫిక్ లో ఈజీగా వెళ్ల‌డంతోపాటు స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో ఈ మోపెడ్ల‌ను తీర్చిదిద్దింది. ఇప్పుడు సంస్థ అందిస్తున్న ఈ మోడళ్లను చూసి యూత్ ఫిదా అవుతున్నారు.  ఇప్ప‌టివ‌ర‌కు స్కూట‌ర్స్ విభాగంలో ఆర్ 15 బేస్ క‌లిగిన ఏరోక్స్ 155 అనే మోడ‌ల్ ని మాత్ర‌మే య‌మ‌హా విక్ర‌యిస్తుండ‌గా, తాజాగా మ‌రో రెండు మోడ‌ళ్లు దీనికి యాడ్ అయ్యాయి.

Continues below advertisement


125 సీసీ విభాగంలో ఫాసినో, రేజ‌డ్ఆర్ అనే రెండు నూత‌న మోడ‌ళ్ల‌ను ప్ర‌వేశ పెట్టింది. అత్య‌ధిక సామ‌ర్థ్యం క‌ల హైబ్రీడ్ స్కూట‌ర్స్ ఇవి కావ‌డం విశేషం. అలాగే వివిధ ర‌కాల ఫీచ‌ర్లు, ఆక‌ర్ష‌ణీయ‌మైన క‌ల‌ర్ల‌తో ఈ రెండు డీజైన్ల‌ను య‌మ‌హా తీర్చిదిద్దింది. ఇందులో ఫాసినో విష‌యానికొస్తే ఇందులో ఐదు ర‌కాల వేరియంట్స్ ఉన్నాయి. ఫాసినో 125 ఫి హైబ్రీడ్ మోడ‌ల్ అన్నిటికంటే ఖ‌రీదైన‌ది కాగా, దీని ఢిల్లీ ఎక్స్ షోరూం ధ‌ర‌. 1,02, 790 లుగా కంపెనీ నిర్దారించింది. ఇందులో మ‌రో నాలుగు వేరియంట్ల‌ను క‌నిష్టంగా 79,340 నుంచి 95,850 మ‌ధ్య ధ‌ర‌తో అందుబాటులోకి తెచ్చింది. 


రివ‌ర్స్డ్ హైబ్రీడ్..
ఇంత‌కుముందు చెప్పిన‌ట్లుగానే ఈ రెండు మోడ‌ళ్ల‌లో ప‌వ‌ర్ ట్రెయిన్ అంశంలో అనేక మెరుగైన ఫీచర్ల‌ను కంపెనీ జోడించింది. ఎన్హాన్స్ డ్ ప‌వ‌ర్ అసిస్ట్ ఫంక్ష‌న్ ద్వారా వినియోగ‌దారుల‌కు స్మార్టైన ప‌నితీరుతోపాటు ట్రూ హైబ్రీడ్ టెక్నాల‌జీ అనుభూతి పొంద‌వ‌చ్చ‌ని కంపెనీ చెబుతోంది. ఇందులో బ్ఊ కోర్ హైబ్రీడ్ ఇంజ‌న్ తోపాటు హై ఫార్ఫ‌ర్మెన్స్ బ్యాట‌రీని జోడించిన‌ట్లు వెల్ల‌డించింది. దీంతో హై టార్క్ జ‌న‌రేట్ కావ‌డంతో మంచి పిక‌ప్ ల‌భిస్తుంద‌ని పేర్కొంది. ఈక్ర‌మంలో ప్ర‌యాణంలో మంచి ప‌నితీరును ఆశించ‌వ‌చ్చ‌ని తెలిపింది. ఇక బ్యాట‌రీలో అధునాత‌మైన స్మార్ట్ మోటార్ జెన‌రేట‌ర్ టెక్నాలజీని పొందుప‌ర్చ‌డంతో ఫ్యూయ‌ల్ ఎఫిషియెంట్ గా ప‌ని చేస్తుంద‌ని పేర్కొంది. 


క‌ల‌ర్ ఫుల్ గా..
బండి ప‌నితీరుతోపాటు అకర్షీయ‌మైన రూపు రేఖ‌ల‌పైనా కంపెనీ దృష్టి పెట్టిన‌ట్లుగా తెలుస్తోంది. ఫాసినో 125 సీసీ బండి.. స్టైలిష్ మాట్ గ్రే క‌ల‌ర్ లో ల‌భ్యం కానుంది. ఇక ఇందులో డిస్క్ బ్రేక్ వేరియంట్ మెటాలిక్ లైట్ గ్రీన్, డ్ర‌మ్ బ్రేక్ వేరియంట్ మెటాలిక్ వైట్ షేడ్స్ లో ల‌భ్యం అవుతుంది. ఇక మ‌రో మోడ‌ల్ రేజ‌డ్ఆర్ మేట్ గ్రే మెటిల‌క్ హూ క‌ల‌ర్లో ల‌భిస్తుండ‌గా, రేజ‌డ్ఆర్ వేరియంట్ లోని డిస్క్ వేరియంట్ ను సిల్వ‌ర్ వైట్ కాక్ టెయిల్ క‌ల‌ర్ లో అందుబాటులో ఉంటుంది.


ఇక ఫాసినో ఎస్ వేరియంట్ లో ట‌ర్న్ బై ట‌ర్న్ నావిగేష‌న్ స‌పోర్ట్ సిస్టం అందుబాటులో ఉంది. దీని ద్వారా గూగుల్ మాప్స్ తో నేరుగా అనుసంధానం కాబ‌డి, రియ‌ల్ టైం ట్రాఫిక్ ను తెలుసుకుని, తద్వారా ప్ర‌యాణం కావ‌చ్చ‌ని కంపెనీ తెలుపుతోంది. ఈ వేరియంట్ ను వై క‌నెక్ట్ యాప్ తో స్మార్ట్ ఫోన్ ద్వారా అనుసంధానిచ్చ వచ్చంటూ పేర్కొంటోంది. ఏదేమైనా రెండు స‌రికొత్త వేరియంట్ల‌తో మార్కెట్లో త‌న ఉనికిని బ‌లంగా చాటు కోవాల‌ని య‌మ‌హా ప్ర‌య‌త్నిస్తోంది.