XPeng AeroHT eVTOL Flying Car: చైనీస్ కార్ల తయారీదారు ఎక్స్‌పెంగ్ తన ఎగిరే కారు గురించి పెద్ద ప్రకటన చేసింది. తమ ఫ్లయింగ్ కారు డిజైన్‌లో క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందిందని కార్ల తయారీ కంపెనీ తెలిపింది. కంపెనీ ఈవీటోల్ ఆర్మ్ (ఈవీటోల్ - ఎలక్ట్రిక్ వెర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్) ఏరో హెచ్‌టీ ఫ్లయింగ్ సర్టిఫికేట్ పొందే దిశగా మరో అడుగు వేసింది. ఈ ఎయిర్ మాడ్యూల్ వాహనం కోడ్‌నేమ్ ఎక్స్3-ఎఫ్‌గా ఉంది. డిజైన్ సర్టిఫికేషన్‌తో కంపెనీ తన ప్రాజెక్ట్‌లో గొప్ప విజయాన్ని సాధించింది.
2023లో జరిగిన ఎక్స్‌పెంగ్ వార్షిక ఈవెంట్‌లో కంపెనీ రెండు కొత్త ఎగిరే కార్లను పరిచయం చేసింది. అందులో ఒక కారు ఎక్స్3 కాగా మరొకటి మాడ్యులర్ ఈవీ. కంపెనీ తన మునుపటి ఎగిరే కారు ఎక్స్2 నుంచి చాలా నేర్చుకోవడం ద్వారా ఎక్స్3ని రూపొందించింది. ఎగిరే కారు ఎక్స్3ని టేకాఫ్, పార్క్, డ్రైవ్ చేయవచ్చు. మాడ్యులర్ ఈవీని 2025 సంవత్సరంలో లాంచ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. దీని ద్వారా ప్రజలు ఈ కారును చైనాలో కొనుగోలు చేయవచ్చు.
రోడ్డు మీద నుంచి గాల్లోకి
ఎక్స్‌పెంగ్ లాంచ్ చేసిన ఈ ఎగిరే కారు రోడ్డుపై పరుగెత్తడంతో పాటు ఈ కారు కూడా గాలిలో ఎగురుతుంది. దీంతో తమ లక్ష్యం దిశగా మరో అడుగు ముందుకేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫ్లయింగ్ కార్ కాంబో ఎక్స్3-ఎఫ్ ఈవీ/ఈవీటోల్ సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సెంట్రల్ (CAAC), సదరన్ చైనా నుంచి డిజైనింగ్ సర్టిఫికేట్‌ను పొందింది. డిజైన్ సర్టిఫికేట్ పొందిన తర్వాత ఈ చైనీస్ ఆటోమేకర్ ఫ్లయింగ్ సర్టిఫికేట్ పొందాలనుకుంటోంది.
ఈవీటోల్ ఎయిర్ మాడ్యూల్‌ను ఫ్లయింగ్ కారు డిజైన్‌లో ప్రదర్శించారు. ఈ ఈవీ ఎయిర్ మాడ్యూల్ 6*6 ఆల్ వీల్ డ్రైవ్ (AWD) గ్రౌండ్ మాడ్యులేటర్‌లను కలిగి ఉంది. సీఏఏసీ నుంచి డిజైన్ వెరిఫికేషన్ తర్వాత వారు ఎయిర్ సర్టిఫికేట్‌పై దృష్టి పెడుతున్నట్లు కంపెనీ తెలిపింది. ఎయిర్ సర్టిఫికేషన్ తర్వాత కంపెనీ 2025 చివరి నాటికి ప్రజల కోసం ఈ ఎగిరే కారు ఉత్పత్తిని ప్రారంభించవచ్చు.