FASTag KYV Verification: అక్టోబర్‌ 31 తరువాత మీ FASTag పని చేయడం ఆగిపోయి ఉండవచ్చు, చెక్‌ చేసుకోండి. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా డ్రైవర్లలో టెన్షన్‌ కలిగిస్తున్న కొత్త విషయం. నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI) తాజాగా తీసుకున్న “Know Your Vehicle (KYV)” వెరిఫికేషన్‌ నియమం అందరినీ అలజడికి గురి చేస్తోంది.

Continues below advertisement

కొత్త నియమం ఏంటి?అక్టోబర్‌ 31 తరువాత, ప్రతి వాహన యజమాని తన FASTag కొనసాగించాలంటే KYV వెరిఫికేషన్‌ తప్పనిసరి. మీరు అక్టోబర్‌ 31 లోపు ఈల పనిని పూర్తి చేసి ఉండకపోతే, మీ FASTag ఆటోమేటిక్‌గా డిసేబుల్‌ అవుతుంది. ఈ విషయం తెలీక మీరు హైవే ఎక్కినప్పుడు టోల్‌ వద్ద FASTag పని చేయదు, దాదాపు రెట్టింపు మొత్తాన్ని క్యాష్‌లో చెల్లించాల్సి వస్తుంది.

ఎందుకు KYV అవసరం?NHAI తెలిపిన వివరాల ప్రకారం, చాలామంది ఒకే FASTag ని ఒకటి కంటే ఎక్కువ వాహనాల్లో ఉపయోగించడం, వాహనానికి సంబంధించిన వివరాలు తప్పుగా లింక్‌ చేయడం, లేదా వాహనాల రకాలను మార్చి తక్కువ టోల్‌ చెల్లించడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ మోసాలను అరికట్టేందుకే KYV వెరిఫికేషన్‌ ప్రారంభమైంది.

Continues below advertisement

ఏ డాక్యుమెంట్లు అవసరం?వాహనం RC బుక్‌, యజమాని పేరు స్పష్టంగా కనిపించేలా ఉండాలి. ఆధార్‌, పాన్‌ లేదా పాస్‌పోర్ట్‌ కాపీ అప్‌లోడ్‌ చేయాలి. కొన్ని వాహనాలకు వాహనం ముందు వైపు, సైడ్‌, ఛాసిస్‌ కూడా కనిపించేలా ఫోటోలు తీయాలి. ఈ ప్రాసెస్‌ను బ్యాంక్‌ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ ద్వారా చేయవచ్చు.

KYV ఎలా చేయాలి?FASTag ఇచ్చిన బ్యాంక్‌ వెబ్‌సైట్‌ లేదా యాప్‌లో లాగిన్‌ అయి ‘Know Your Vehicle’ లేదా ‘Update KYV’ అనే ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేయాలి. డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేసి, OTP వెరిఫికేషన్‌ పూర్తి చేసిన తర్వాత మీ ట్యాగ్‌ “Active and Verified”గా చూపిస్తుంది.

KYV చేయకపోతే ఏమవుతుంది?KYV పూర్తి చేయని లేదా పాక్షికంగా వెరిఫై అయిన FASTagలు ఇప్పటికే (అక్టోబర్‌ 31 తరువాత) ఆటోమేటిక్‌గా డీయాక్టివేట్‌ అయ్యాయి. బ్యాలెన్స్‌ ఉన్నా కూడా ఆ FASTag పని చేయదు. ఈ విషయం తెలీక హైవే ఎక్కిన డ్రైవర్లు టోల్‌ ప్లాజా వద్ద ఇబ్బందులు పడినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

KYV వల్ల లాభాలేమిటి?NHAI ప్రకారం, ఈ కొత్త సిస్టమ్‌ వాహనాల దుర్వినియోగం ఆగుతుంది, చోరీ అయిన లేదా అమ్మిన వాహనాలను ట్రాక్‌ చేయడంలో సులభంగా మారుతుంది, టోల్‌ క్యాటగిరీలలో తప్పులు తగ్గుతాయి & వినియోగదారులకు పారదర్శక డేటా అందుబాటులో ఉంటుంది.

ప్రజల స్పందన?చాలా మంది డ్రైవర్లు మాత్రం ఈ ప్రక్రియను కొత్త తలనొప్పిగా చూస్తున్నారు. “KYCలాగే మరో ఫార్మాలిటీ ఇది,” అని చాలామంది సోషల్‌ మీడియాలో వాపోతున్నారు. అయితే, FASTag ఆగిపోతే టోల్‌ వద్ద క్యాష్‌ క్యూలలో నిలబడాల్సి వస్తుందనే భయంతో, KYV పూర్తి చేయడానికే మొగ్గు చూపుతున్నారు. 

మొత్తం మీద, FASTag వ్యవస్థను ప్రక్షాళన చేయడం, దుర్వినియోగాన్ని అరికట్టడం & భవిష్యత్తులో టోల్‌ చెల్లింపులను మరింత పారదర్శకంగా మార్చడమే లక్ష్యంగా ఈ కొత్త నియమం వచ్చింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.