Brahmamudi Serial Today Episode:  భోజనానికి రాజ్‌, కావ్య రాగానే రాహుల్‌, కూయిలీ చూస్తుంటారు. తినడానికి కూర్చున్న రాజ్‌ వడ్డించడానికి ఎవరూ లేరా అని అడుగుతాడు.

Continues below advertisement

కూయిలీ: ఎవరు లేర తాతగారు..

కావ్య: ఇంట్లో పని వాళ్లు కూడా లేని ఈ ఇంటి పిల్ల మన మనవడికి సరిపోదు పెనిమిటి

Continues below advertisement

రాజ్: అవును నిజమే

రంజిత్: ఇంట్లో పని వాళ్లు మ కంపెనీ సీక్రెట్స్‌ పక్క వాళ్లకు చెప్తున్నారని తీసేశాము బామ్మ

కావ్య: మరి మాకు ఎవరు వడ్డిస్తారు..?

రంజిత్‌: మా కూయిలీ మీకు వడ్డిస్తుంది.

కూయిలీ: అవును నేను వడ్డిస్తాను..

కూయిలీ వడ్డించగానే.. కొంచెం తిన్నట్టు నటించి మొత్తం బయటకు ఊసేస్తారు.

రాజ్: ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. కాకా హోటల్‌ నుంచి తెప్పించారా..?

కావ్య: తిండి కూడా సరిగ్గా పెట్టని ఈ ఇంటి పిల్ల మన వాడికి ఎలా సరిపోతుందండి

రాజ్‌: అందుకే మన మనవడిని తీసుకుని వెళ్లిపోదాం పద

కూయిలీ: అయ్యో తాతగారు.. బామ్మ గారు ఆగండి రేపు మీ కోసం ఇంత కన్నా పెద్ద హోటల్‌ నుంచి ఫుడ్డు తెప్పిస్తాను..

రంజిత్‌:  ఇంత కన్నా పెద్ద హోటలా..?

రాజ్‌: ఏరా తెప్పించరా..? అంత సీన్‌ లేదా..?

కావ్య: అంటే అంత లోపల డొల్ల అన్నమాట..

రంజిత్‌ :  ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ నుంచే కదా తెప్పించేద్దాం

కావ్య:  అయితే మొత్తం హోటల్‌ తిండి పెట్టి నా మనవడిని ఏం చేద్దాం అనుకుంటున్నారు..?

రాజ్: వాన్ని చంపేద్దాం అనుకుంటున్నారు

కావ్య: అయినా గుండ్రాయి లాంటి ఆడది ఇంట్లో ఉండగా హోటల్‌ తిండి ఎందుకురా మనవడా నీకు

రాజ్‌: నాకు ఈ హోటల్‌ ఫుడ్డు అసలు పడదు..

కావ్య: నాకు అసలు పడదు

రంజిత్‌: మీరే కదా హోటల్‌ పుడ్డు కావాలి అన్నారు.

రాజ్: అన్నాము.. కానీ ఇప్పుడు వద్దంటున్నాము అనకూడదా..?

కూయిలీ: అనొచ్చు లేండి

కావ్య: అయితే రేపటి నుంచి ఈ కూయిలీ వంట చేస్తుంది

కూయిలీ: బామ్మగారు నాకు వంట రాదు..

రాజ్: అయితే ఇలాంటి దాన్ని చేసుకుని నా మనవడు ఏం సుఖపడతాడు ఇంక వద్దురా రాహుల్‌ వెళ్దాం పద ఇక్కడి నుంచి

కూయిలీ: అంత దూరం ఎందుకు లేండి..? నేను వంట నేర్చుకుంటాను..

రాజ్: ఎలా నేర్చుకుంటావు.. ఎప్పుడు నేర్చుకుంటావు

కూయిలీ: బామ్మ దగ్గర నేర్చుకుంటాను.. బామ్మే నాకు వంట నేర్పిస్తుంది..

అని చెప్పగానే.. అయితే నీకు మరణ మృదంగం మొదలైనట్టే అనుకుంటాడు రాజ్‌. తర్వాత కూయిలీ, రంజిత్‌ ఇద్దరూ కిచెన్‌ మాట్లాడుకుంటారు.

రంజిత్‌:  వీళ్లు ఒక్క రోజు తిండికి 30 వేల బిల్లు చేశారు.. ఇలా అయితే ఇక మనం లక్షలు పెట్టాల్సి వస్తుంది వీరికి

కూయిలీ: ఎం కాదులే మహా అయితే నాలుగు రోజులు ఉంటారు.. తర్వాత వాళ్ల దగ్గర ఉన్న కోట్ల ఆస్థి మనం కొట్టేయోచ్చు

రంజిత్‌: కానీ ఇప్పటికే మనకు లక్షల అప్పు ఉంది

కూయిలీ: ఉండని కానీ వాళ్ల కోట్ల ఆస్థి మనకు వచ్చాక ఈ లక్షలు మనకొక లెక్కా

అంటూ కూయిలీ చెప్తుంటే.. అవును కదా అంటాడు రంజిత్‌. వీళ్లిద్దరూ మాట్లాడుకోవడం రాజ్, కావ్య వింటారు. ఎలాగైనా వీళ్లకు బుద్ది చెప్పాలని డిసైడ్‌ అవుతారు. అందుకోసం తన ఫ్రెండ్‌ డైమండ్‌ బాబును దింపాలని రాజ్‌ చెప్తాడు. తర్వాత కూయిలీకి వంట నేర్పుతానని టార్చర్‌ చేస్తుంది కావ్య. రాజ్‌ కూడా కూయిలీని ఇరిటేట్‌ చేస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!