Car Colours: మారుతున్న ట్రెండ్‌లతో కస్టమర్ల ప్రాధాన్యతలు కూడా మారుతున్నాయి. భారతదేశంలో కొత్త కార్లను కొనుగోలు చేసే వారి విషయంలో కూడా అదే జరుగుతోంది. గతంతో పోలిస్తే కలర్స్ పరంగా కస్టమర్ల ప్రాధాన్యతల్లో మార్పులు వచ్చి వివిధ రంగులతో ప్రయోగాలు కూడా చేస్తున్నారు. అయితే పాపులారిటీ దృష్ట్యా ఇప్పటికీ వైట్ కలర్ మునుపటిలానే ఎక్కువ ప్రాధాన్యతను పొందుతుందని ఊహించడం కష్టం కాదు. కొత్త కారు కొనుగోలుదారులలో చాలా మంది తెలుపు రంగు కార్లను ఎంచుకుంటున్నారు.
వైట్ కలర్ కారును ఎంచుకోవాలనే కస్టమర్ నిర్ణయాన్ని అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. ఇది లగ్జరీ కార్లు, ఎస్‌యూవీల్లో మరీ ఎక్కువగా ఉంది. భారతదేశంలో ఇవి వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగాలు. అయితే ఇది కాకుండా తెలుపు కార్లు ఎక్కువగా అమ్ముడుపోతున్నప్పటికీ భారతీయ కారు కొనుగోలుదారులు ఇప్పటికీ నలుపు లేదా బూడిద వంటి రంగుల కార్లను ఎంచుకుంటున్నారు. అయితే సిల్వర్, వైట్, గ్రే వంటి కలర్లు ఇప్పటికీ టాప్ ప్లేస్‌లో ఉన్నాయి. ఇతర రంగుల వాడకం పెరగడం వల్ల బ్లూ కార్లు కస్టమర్లకు కొత్త ఇష్టమైన రంగుగా మారాయి.
కొత్త రంగుల ట్రెండ్ పెరుగుతోంది
కార్ల కోసం కొత్త రంగుల ట్రెండ్ పెరుగుతుండటం చూసి కార్ల తయారీదారులు కూడా బ్లూ, రెడ్‌తో సహా ప్రత్యేక రంగులను అందించడం ప్రారంభించారు. బ్లాక్ తర్వాత కార్లకు బ్లూ అత్యంత ప్రజాదరణ పొందిన రంగు. ఇది ఎస్‌యూవీలు, లగ్జరీ కార్లలో కూడా పెరుగుతోంది.
ఇప్పుడు కొత్తగా వస్తున్న మరో ట్రెండ్ ఏంటంటే... బ్లాక్ కలర్ ఆధారంగా ప్రత్యేక ఎడిషన్ కార్లు. ఈ రంగు ప్రజాదరణ తర్వాత ఇప్పుడు అనేక తయారీదారులు అందిస్తున్నాయి. కొనుగోలుదారుల్లో గ్రీన్ కలర్ పట్ల కూడా పెరుగుతున్న ట్రెండ్‌ని కూడా మేం చూశాం. ఇందులో ఎస్‌యూవీ కస్టమర్లు ముఖ్యంగా ఆకుపచ్చ రంగును ఎక్కువగా ఇష్టపడతారు. ఈ అన్ని రంగులలో కొత్త కార్లలో గోల్డెన్ కలర్ అత్యల్ప వాటాను కలిగి ఉంది. అయితే సిల్వర్‌కి డిమాండ్ కూడా బాగా తగ్గింది. ఈ మార్పులతో బ్లూ, బ్లాక్, గ్రీన్ ఇప్పుడు కొత్త పోకడలు అయితే మొత్తంగా వైట్ అత్యంత ప్రాధాన్యతనిచ్చే ఆప్షన్‌గా మిగిలింది. ఇది కాకుండా కొన్ని కార్ల కంపెనీ నిర్దిష్ట మోడల్, కస్టమర్ ప్రొఫైల్‌ని ఆధారంగా చేసుకుని విస్తృత కలర్ ఆప్షన్లు అందిస్తున్నారు.
Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?