Top 5 Affordable CNG SUV: గత కొన్నేళ్లుగా ఇంధన ధరల పెరుగుదల కారణంగా సీఎన్‌జీ వాహనాలకు డిమాండ్ పెరిగింది. సీఎన్‌జీ కార్లు పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే చౌకగా ఉండటమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి. సీఎన్‌జీ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, కార్ల తయారీ కంపెనీలు తమ సీఎన్‌జీ పోర్ట్‌ఫోలియోలో అనేక వాహనాలను అందిస్తున్నాయి. ఇప్పుడు మార్కెట్లో అనేక ఎస్‌యూవీలు సీఎన్‌జీ వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలోని కొన్ని సరసమైన సీఎన్‌జీ ఎస్‌యూవీలు కొనుగోలు చేయవచ్చు. వాటిలో బెస్ట్ ఏం ఉన్నాయో చూద్దాం.




మారుతి సుజుకి గ్రాండ్ విటారా సీఎన్‌జీ (Maruti Suzuki Grand Vitara CNG)
మారుతి సుజుకి గ్రాండ్ విటారా సీఎన్‌జీ కిట్‌తో అందుబాటులో ఉంది. మారుతి సుజుకి గ్రాండ్ విటారాలో సీఎన్‌జీ రెండు వేరియంట్‌ల్లో కనిపిస్తుంది. డెల్టా, జీటా వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ. 13.15 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా మాదిరిగానే టయోటా హైరైడర్ కూడా ఇలాంటి ఆప్షన్లతో అందుబాటులో ఉంది.




మారుతీ సుజుకి బ్రెజా సీఎన్‌జీ (Maruti Suzuki Brezza CNG)
బ్రెజా అనేది మారుతి సుజుకి అందిస్తున్న మరో ఎస్‌యూవీ. ఇది 1.5 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్‌జీ ఆప్షన్‌తో లభిస్తుంది. సీఎన్‌జీ మోడ్‌లో ఈ పవర్‌ట్రెయిన్ 88 హెచ్‌పీ, 121.5 ఎన్ఎం పీక్ టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. బ్రెజా సీఎన్‌జీ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ని పొందుతుంది. ఇది 25.51 కిలోమీటర్ల మైలేజీని పొందుతుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.9.29 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.




మారుతీ సుజుకి ఫ్రాంక్స్ సీఎన్‌జీ (Maruti Suzuki Fronx CNG)
మారుతి సుజుకి ఫ్రాంక్స్ సీఎన్‌జీ 77.5 హెచ్‌పీ, 98.5 ఎన్ఎం పీక్ టార్క్ అవుట్‌పుట్‌ అందించే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. సీఎన్‌జీ వెర్షన్‌లో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇది 28.51 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. మారుతీ ఫ్రాంక్స్ సీఎన్‌జీని ఎంట్రీ లెవల్ సిగ్మా వేరియంట్ లేదా మిడ్ లెవల్ డెల్టా ట్రిమ్‌లో కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ. 8.46 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.





టాటా పంచ్ సీఎన్‌జీ (Tata Punch CNG)
టాటా మోటార్స్ డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీని పంచ్ సీఎన్‌జీని ఉపయోగించారు. ఇది సాంప్రదాయ సీఎన్‌జీ సిలిండర్ల కంటే ఎక్కువ బూట్ స్పేస్‌ను అందిస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.7.23 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఇది 1.2 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఈ కారు సీఎన్‌జీ మోడ్‌లో 73.5 హెచ్‌పీ పవర్, 103 ఎన్ఎం పీక్ టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది.




హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ (Hyundai Exter CNG)
హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ భారతదేశంలో అత్యంత చవకైన సీఎన్‌జీ ఎస్‌యూవీ. దీని ప్రారంభ ఎక్స్ షోరూం ధర రూ. 6.43 లక్షలుగా ఉంది. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. ఇది 69 హెచ్‌పీ పవర్, 95 ఎన్ఎం పీక్ టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎక్స్‌టర్ సీఎన్‌జీ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది 27.10 కిలోమీటర్ల మైలేజీని కలిగి ఉంది.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!