SUVలు నెమ్మదిగా మార్కెట్‌ ను ఆక్రమిస్తున్నాయి. ప్రస్తుతం కారు కొనుగోలు చేయాలి అనుకునే వారంతా SUVల వైపే మొగ్గు చూపుతున్నారు. దేశంలో అమ్ముడు అవుతున్న కార్లలో 40 శాతానికి పైగా SUVలే ఉన్నాయి. ప్రస్తుతం SUV సెగ్మెంట్ అత్యంత ట్రెండింగ్ కేటగిరీగా కొనసాగుతుంది. ఒక వేళ మీరు SUVని కొనాలి అనుకుంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు. ప్రస్తుతం మార్కెట్లో అత్యంత ప్రజాదరణ కలిగిన SUVల వెయిటింగ్ పీరియడ్ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.. 


టాటా నెక్సాన్ - 60 రోజులు


టాటా నెక్సాన్ ప్రస్తుతం ఇండియాలో  అత్యధికంగా అమ్ముడవుతున్న SUV. టాటా కంపెనీ డిమాండ్‌కు అనుగుణంగా వీటి ఉత్పత్తిని కొనసాగిస్తున్నది. ప్రజాదరణ భారీగా పొందినప్పటికీ, దాని వెయిటింగ్ పీరియడ్‌ను అదుపులోనే ఉంచుకుంది కంపెనీ. టాటా నెక్సన్ దేశంలో పెట్రోల్, డీజిల్,  ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లలో అందుబాటులో  ఉన్న ఏకైక SUVగా గుర్తింపు పొందింది. పెట్రోల్ వెర్షన్ కారు 1.2 L రెవోట్రాన్ టర్బో ఇంజన్‌ తో పనిచేస్తుంది. డీజిల్ వెర్షన్ కారు 1.5 L రెవో టార్క్ ఇంజన్‌తో పని చేస్తుంది.  ఎలక్ట్రిక్ వెర్షన్ 40.5 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది.  


హ్యుందాయ్ వెన్యూ - 90 రోజులు


హ్యుందాయ్ తన  పాపులర్ సబ్-4ఎమ్ SUV వెన్యూను కొన్ని నెలల క్రితం అప్‌డేట్ చేసింది. కొద్ది రోజుల పాటు ఈ కారు వెయిటింగ్ పీరియడ్ 2 నెలలు అని ప్రకటించింది. ఇప్పుడు వెన్యూ   వెయిటింగ్ పీరియడ్ 3 నెలలకు పెరిగింది. భారతీయ మార్కెట్లో సబ్ కాంపాక్ట్ SUVకి ఉన్న డిమాండ్ ను తెలియజేస్తుంది. హ్యుందాయ్ వెన్యూ భారతీయ మార్కెట్లో మూడు పవర్‌ట్రెయిన్‌లలో అందుబాటులో ఉంది. 1.0 L కప్పా టర్బో GDi పెట్రోల్, 1.2 L కప్పా MPi పెట్రోల్ తో పాటు 1.5 L CRDi డీజిల్ వెర్షన్ లో లభిస్తుంది.


హ్యుందాయ్ క్రెటా - 180 రోజులు


హ్యుందాయ్ 2015లో క్రెటాను తిరిగి  దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.  అప్పటి నుంచి దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటిగా నిలిచింది. హ్యుందాయ్ 2020లో  సెకెండ్ జెనరేష్ క్రెటాను పరిచయం చేసింది. క్రెటా కు భారీగా డిమాండ్ ఉండటం మూలంగా 6 నెలల  వెయిటింగ్ పీరియడ్‌ను కలిగి ఉంది. హ్యుందాయ్ క్రెటా మూడు పవర్‌ట్రెయిన్‌లలో అందుబాటులో ఉంది.  1.5 L U2 CRDi డీజిల్, 1.5 L MPi పెట్రోల్ మరియు 1.4 L కప్పా టర్బో GDi పెట్రోల్ తో లభిస్తుంది.


కియా సెల్టోస్ - 120 రోజులు


 కియా సెల్టోస్ దేశంలో అత్యుత్తమ కాంపాక్ట్ SUVలలో ఒకదానిగా చెప్పుకోవచ్చు. దీని  ప్రస్తుత వెయిటింగ్ పీరియడ్ 4 నెలలు. కియా సెల్టోస్ భారత మార్కెట్లో మూడు పవర్‌ట్రెయిన్‌లలో అందుబాటులో ఉంది. 1.5L CRDi VGT డీజిల్, Smartstream G1.5 L పెట్రోల్ తో పాటు Smartstream G1.4 L T-GDI పెట్రోల్ వెర్షన్ లో లభిస్తుంది.


కియా సోనెట్ - 180 రోజులు


కియా సోనెట్ భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మరో SUV. ఇది సబ్-4m SUV.    కియా సోనెట్ కోసం వెయిటింగ్ పీరియడ్ దేశంలోనే అత్యధికంగా 6 నెలలుగా ఉంది. కియా సోనెట్ భారతీయ మార్కెట్లో మూడు పవర్‌ట్రెయిన్‌లలో అందుబాటులో ఉంది. 1.5 L CRDi WGT డీజిల్, Smartstream G1.2 L పెట్రోల్ తో ఆటు Smartstream G1.0 L T-GDi పెట్రోల్ తో భిస్తుంది.


నిస్సాన్ మాగ్నైట్ - 90 రోజులు


నిస్సాన్ భారతీయ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని మాగ్నైట్‌ ను అభివృద్ధి చేసింది.  తాజాగా ఈ SUV కి సంబంధించి స్పెషల్ RED ఎడిషన్‌ను పరిచయం చేసింది. ప్రస్తుతం మాగ్నైట్‌ మంచి డిమాండ్ ఉండటంతో  3 నెలల వెయిటింగ్ పీరియడ్ ను కలిగి ఉంది. నిస్సాన్ మాగ్నైట్ భారతీయ మార్కెట్లో రెండు పవర్‌ట్రెయిన్‌లలో అందుబాటులో ఉంది.  1.0 L B4D పెట్రోల్ తో పాటు HRA0 1.0 L టర్బో పెట్రోల్ తో లభిస్తుంది.


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?