Volvo EV Car Latest News: రోజురోజుకు పెరుగుతున్న భారత ఈవీ మార్కెట్ పై విదేశీ కంపెనీలు కన్నేశాయి. తాజాగా వోల్వో ఈ విభాగంలో సరికొత్త అప్డేట్ తో ముందుకు వచ్చింది. లగ్జరీ కార్ బ్రాండ్ వోల్వో ఇండియా తన కొత్త ఎలక్ట్రిక్ SUV EX30 టీజర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ కారు త్వరలో భారత మార్కెట్లోకి ప్రవేశిస్తుందని ఈ టీజర్ ద్వారా తెలుస్తోంది. ప్రస్తుత వోల్వో ఎలక్ట్రిక్ లైనప్ EX40 , EC40 కంటే EX30 వోల్వో ఈవీ కారు చిన్నదిగా ఉంటుంది. ఎంట్రీ-లెవల్ ప్రీమియం EV సెగ్మెంట్ కోసం ప్రత్యేకంగా కంపెనీ రూపొందించింది.. కాంపాక్ట్ సైజు మరియు ఆధునిక డిజైన్ యువ కొనుగోలుదారులను మరింత ఆకర్షిస్తాయని కంపెనీ నమ్మకంగా ఉంది. ఈ వేరియంట్ ద్వారా ప్రీమియం ఎంట్రీ లెవల్లో మార్కెట్ ను కైవసం చేసుకోవాలని కంపెనీ భావిస్తోంది.
స్టైలిష్ ఫీచర్లు..అనాది గా వోల్వో అంటే వినియోగదారుల్లో ఒక క్రేజ్ ఉంది. సొగసైన మరియు మినిమలిస్ట్ డిజైన్‌కు ఈ కంపెనీ ప్రసిద్ధి చెందింది. అదే కోవలో EX30ని తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారులో అనేక ఆకర్షణలను పొందుపరిచారు. LED హెడ్‌ల్యాంప్‌లు, క్లోజ్డ్ గ్రిల్ , ప్రత్యేకమైన టెయిల్‌లైట్‌లతో చూడటానికి సూపర్బ్ లుక్ తో వస్తోంది. ఈ హంగులు దీనికి ప్రీమియం మరియు క్లాసీ అప్పీల్‌ను ఇస్తాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇంటీరియర్ విషయానికొస్తే.. దీని క్యాబిన్ చాలా చిన్నదిగా, హైటెక్ గా ఉంది. ఇందులో పెద్ద 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ముందర ఇన్‌స్టాల్ చేయబడింది. ఇది గూగుల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది, దీనిలో గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్ వంటి ఇతర యాప్‌లు అందుబాటులో ఉంటాయి.
సూపర్బ్ రేంజ్..వోల్వో EX30 SEA ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. ఈ కారు 69 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుందని అంచనా. ఈ SUV ఒకే ఛార్జ్‌పై దాదాపు 474 కిలోమీటర్ల రేంజ్ ని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. అటు లోకల్ గా తిరగడంతోపాటు కాస్త దూర ప్రాంతాల వారికి కూడా ఈ రేంజీ సరిపోతుంది. ఇందులో ఉన్న ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ద్వారా బ్యాటరీ తక్కువ సమయంలో ఛార్జ్ అవుతుంది. వోల్వో EX30 ను ఇండియాలో స్థానికంగా అసెంబుల్ చేస్తే, దాని ధర రూ. 40 నుండి 50 లక్షల మధ్య ఉంటుందని అంచనా. ఈ ధరతో ప్రత్యర్థి కంపెనీలకు చెందిన BMW iX1, హ్యుందాయ్ ఐయోనిక్ 5 , కియా EV6 వంటి ప్రసిద్ధ ఎలక్ట్రిక్ కార్లకు గట్టి పోటీని ఇస్తుంది. . దీని స్టైలిష్ డిజైన్, హై-టెక్ ఫీచర్లు మరియు లాంగ్ రేంజ్ ఇండియన్ ప్రీమియం EV మార్కెట్‌లో బలమైన పోటీదారుగా మారుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.