Discount on Volkswagen Taigun: ఫోక్స్‌వ్యాగన్ ఇండియా తన టైగన్‌పై పరిమిత కాలపు తగ్గింపు ఆఫర్‌ను అందిస్తోంది. బేస్ స్పెక్ 1.0 లీటర్ కంఫర్ట్‌లైన్ ఎంటీ, 1.5 లీటర్ జీటీ ప్లస్ క్రోమ్ డీఎస్‌జీ, 1.5 లీటర్ జీటీ ఎడ్జ్ ప్లస్ డీఎస్‌జీ వేరియంట్‌ల వంటి ఎంపిక చేసిన వేరియంట్‌లపై మాత్రమే ఈ తగ్గింపు అందిస్తున్నారు.
ఏ వేరియంట్ ధర ఎంత తగ్గింది?
టైగన్ కంఫర్ట్‌లైన్ 1.0 లీటర్ మాన్యువల్ వేరియంట్ రూ. 71,000 తగ్గింపును పొందుతోంది. దీని ధర రూ. 10.99 లక్షలకు చేరుకుంది.
టైగన్ 1.5 లీటర్ జీటీ ప్లస్ క్రోమ్ డీఎస్‌జీ వేరియంట్‌పై రూ. 75,000 తగ్గింపు ఉంది. దీని కారణంగా ఈ కారు ధర ఇప్పుడు రూ. 18.69 లక్షలకు తగ్గింది.
టైగన్ 1.5 లీటర్ జీటీ ప్లస్ క్రోమ్ డీఎస్‌జీ (అదనపు ఫీచర్లతో) వేరియంట్‌పై ఏకంగా రూ. 1.05 లక్షల తగ్గింపు లభిస్తోంది. దీని ధర రూ. 18.69 లక్షలకు చేరుకుంది.
టైగన్ 1.5 లీటర్ జీటీ ఎడ్జ్ ప్లస్ డీఎస్‌జీ (డీప్ బ్లాక్ పెర్ల్) వేరియంట్‌పై రూ. 74,000 తగ్గింపు ఉంది. దీని కారణంగా ఈ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 18.90 లక్షలకు తగ్గింది.
టైగన్ 1.5 లీటర్ జీటీ ఎడ్జ్ ప్లస్ డీఎస్‌జీ (కార్బన్ స్టీల్ గ్రే మ్యాట్) వేరియంట్‌పై రూ. 80,000 తగ్గింపు అందుబాటులో ఉంది. దీని ధర రూ. 18.90 లక్షలకు చేరుకుంది.
టైగన్ 1.5 లీటర్ జీటీ ప్లస్ డీఎస్‌జీ (కొత్త ఫీచర్లతో, డీప్ బ్లాక్ పెర్ల్) వేరియంట్ రూ. 1.04 లక్షల తగ్గింపును పొందుతోంది. దీని ధర ఇప్పుడు రూ. 18.90 లక్షలకు తగ్గింది.
టైగన్ 1.5 లీటర్ జీటీ ప్లస్ డీఎస్‌జీ (కొత్త ఫీచర్లతో, కార్బన్ స్టీల్ గ్రే మ్యాట్) వేరియంట్‌పై రూ. 1.10 లక్షల తగ్గింపు ఉంది. దీని ధర రూ. 18.90 లక్షలకు చేరుకుంది.
టాటా టైగన్ బేస్ లెవల్ కంఫర్ట్‌లైన్ 1.0 లీటర్ మాన్యువల్ మోడల్ ఇప్పుడు రూ. 10.99 లక్షల ధరకు అందుబాటులో ఉంది. దీని మునుపటి ధర రూ. 11.70 లక్షల కంటే రూ. 71,000 తక్కువ. అదే సమయంలో 1.5 లీటర్ జీటీ ప్లస్ క్రోమ్ డీఎస్‌జీ రెండు వేరియంట్‌లు ఇప్పుడు రూ. 18.69 లక్షల ధరకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మొదటి వేరియంట్‌పై రూ. 75,000, రెండో వేరియంట్‌పై రూ. 1.05 లక్షలు తగ్గింపు లభించింది. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు వంటి అదనపు ఫీచర్లు ఉన్న జీటీ ఎడ్జ్ ప్లస్ వేరియంట్ ధర కూడా తగ్గించారు. 1.5 లీటర్ జీటీ ప్లస్ డీఎస్‌జీ ఇప్పుడు డీప్ బ్లాక్ పెర్ల్, కార్బన్ స్టీల్ గ్రే మ్యాట్ వేరియంట్‌లలో రూ. 18.90 లక్షల ధరతో అందుబాటులో ఉంది.
టైగన్ రెండు ఇంజన్ ఆప్షన్లతో మార్కెట్లోకి వస్తుంది. ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. 1.0 లీటర్ యూనిట్ 113 బీహెచ్‌పీ, 178 ఎన్ఎం అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయింది. అయితే 1.5 లీటర్ ఇంజన్ 148 బీహెచ్‌పీ, 250 ఎన్ఎం అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ డీఎస్‌జీతో లభిస్తుంది. హ్యుందాయ్ క్రెటా, ఎంజీ ఆస్టర్, స్కోడా కుషాక్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్‌లకు ఇది పోటీని ఇవ్వనుంది.