భారత్‌లో తన కొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ MPV లిమో గ్రీన్ (Limo Green)ను లాంచ్ చేయడానికి విన్‌ఫాస్ట్ (Vinfast) సిద్ధంగా ఉంది. విన్‌ఫాస్ట్ ఆటో లిమిటెడ్ అనేది వియత్నాంలోని ప్రముఖ ఆటో మేకర్ కంపెనీలలో ఒకటని తెలిసిందే. భారత మార్కెట్లో తమ ప్రొడక్ట్ లైన్‌ను విస్తరించుకోనున్నామని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు మరో కొత్త వాహనం తీసుకురావడం ఆ దిశగా కీలక అడుగు. ఇప్పటివరకు విన్‌ఫాస్ట్ వద్ద కేవలం SUV సెగ్మెంట్‌లో మాత్రమే ఆప్షన్లు ఉండగా, లిమో గ్రీన్ రాకతో కంపెనీ MPV సెగ్మెంట్‌లో కూడా తమ స్థానాన్నిమెరుగు చేసుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా పెద్ద ఫ్యామిలీ కార్ కావాలనుకునే, అదే సమయంలో ఎలక్ట్రిక్ ఆప్షన్ కోరుకునే వారి కోసం ఈ వాహనాన్ని మార్కెట్లోకి తేనున్నారు. 

Continues below advertisement

ఈ లిమో గ్రీన్ MPV కియా కారెన్స్ క్లావిస్ EV (Kia Carens Clavis EV) వంటి వాహనాలతో పోటీ పడనుంది. డిజైన్ విషయానికి వస్తే, లిమో గ్రీన్ లుక్ చాలా మోడ్రన్‌గా, స్లీక్‌గా ఉంటుంది. ఇందులో విన్‌ఫాస్ట్ ప్రత్యేకమైన డిజైన్ శైలి కనిపిస్తుంది. కానీ ఇది వారి పాత మోడళ్ల కంటే కొంచెం భిన్నంగా, కొత్తగా ఉంటుంది. దీని పొడవు 4740 mm, వీల్‌బేస్ 2840 mm. దాంతో ఇందులో ఎక్కువ స్పేస్ లభించే అవకాశం ఉంది.

పవర్‌ఫుల్ బ్యాటరీ, రేంజ్, పెర్ఫార్మెన్స్విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ లో సుమారు 60kWh బ్యాటరీ ప్యాక్ ఇచ్చే అవకాశం ఉంది, ఇది ఎక్కువ దూరం ప్రయాణించడానికి సహాయపడుతుంది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ దాదాపు 450 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని విన్‌ఫాస్ట్ కంపెనీ పేర్కొంది. ఇది రోజువారీ జర్నీకి, లాంగ్ జర్నీలకు సరిగ్గా సరిపోతుంది. ఇందులో సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ ఇస్తారు. ఇది సుమారు 200bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7-సీటర్ వాహనం చాలా పవర్‌ఫుల్ అని దీనివల్ల డ్రైవింగ్ చేసే వారికి చికాకు లేని స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఫీల్ అవ్వొచ్చు. 

Continues below advertisement

ఛార్జింగ్ విషయానికి వస్తే, ఇందులో 11kW AC ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. అంతేకాకుండా, ఇది 80kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఈ వాహనం కేవలం 30 నిమిషాల్లో 10 శాతం నుండి 70 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. సుదూర ప్రయాణాలు చేసే వారికి ఈ ఫీచర్  ఉపయోగకరంగా ఉంటుంది.

విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ అడ్వాన్స్‌డ్ ఫీచర్లు

ఫీచర్ల విషయానిక వస్తే ఈ MPV చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉండనుంది. ఇందులో 10.1 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ సిస్టమ్ ఉంటుంది. లిమో గ్రీన్‌లో కంట్రోల్ మొత్తం డిజిటల్‌గా ఉంటుంది. ఫిజికల్ బటన్లు తక్కువగా ఉంటాయి. ఇవి కాకుండా ఇందులో అనేక స్మార్ట్, కనెక్టెడ్ ఫీచర్లు కూడా లభిస్తాయి. దీనివల్ల డ్రైవింగ్ మరింత సులభంగా, స్మూత్‌గా మారుతుంది.

లిమో గ్రీన్ అంచనా ధరవిన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ ప్రారంభ ధర సుమారు 16 నుండి 17 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది ఆయా రాష్ట్రాలను బట్టి మారుతుంది. ఒకవేళ కంపెనీ ఈ ధరకే లాంచ్ చేస్తే, భారత మార్కెట్లో ఇది ఒక మంచి ప్రత్యామ్నాయంగా మారుతుంది.