2025 Land Rover Defender: ల్యాండ్ రోవర్ తన ఐకానిక్ SUV డిఫెండర్ 2025 మోడల్‌ను తీసుకొస్తోంది.  ఈ అప్‌డేటెడ్ మోడల్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా  ఆకట్టుకుంటోంది. డిజైన్, ఇంటీరియర్ , ఫీచర్లలో ప్రత్యేకమైన మార్పులు చేసింది. ఇది దీన్ని మరింత ప్రీమియం , టెక్నాలజీతో ఆకట్టుకునేలా చేస్తోంది..

2025 డిఫెండర్‌లో అతిపెద్ద మార్పుల్లో ఒకటి న్యూ 13.1-అంగుళాల ఫ్రీ-స్టాండింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ప్లే.  11.4-అంగుళాల యూనిట్ స్థానంలో కొత్తదాన్ని రీప్లేస్‌ చేశారు.  ఇందులో కంపెనీ తాజా Pivi Pro ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, ఇది వినియోగదారులకు స్పష్టమైన UIని అందిస్తుంది. ఈ స్క్రీన్ క్యాబిన్‌ను టెక్నో-ఫ్రెండ్లీగా మాత్రమే కాకుండా, ప్రీమియం లుక్‌ను కూడా ఇస్తుంది. అదనంగా, సవరించిన సెంటర్ కన్సోల్‌లో ఇప్పుడు స్లైడింగ్ సెక్షన్‌తో కొత్త కప్ హోల్డర్ ఉంది. స్టీరింగ్ కాలమ్‌లో కొత్త కెమెరా జోడించారు. ఇది డ్రైవర్ ఫోకస్‌ను పర్యవేక్షిస్తుంది.

బయట చేసిన మార్పులు 

2025 ల్యాండ్ రోవర్ డిఫెండర్ వాహనం బయట కూడా  చాలా  ప్రీమియం మార్పులు జరిగాయి, ఇవి దీన్ని ముందుకంటే మరింత స్టైలిష్, శక్తివంతంగా చేస్తాయి. ఇందులో కొత్త బంపర్ డిజైన్లు ఆకట్టుకోనున్నాయి. ఇవి కార్పాథియన్ గ్రే సాటిన్ లేదా సిలికాన్ సిల్వర్ ఫినిష్‌లో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా, SUV గ్లాస్ బ్లాక్ గ్రిల్, డార్క్ ఫినిష్‌తో కూడిన ఓవల్ ల్యాండ్ రోవర్ బ్యాడ్జ్‌తో డిజైన్ చేశారు.  వీల్ సెంటర్ క్యాప్‌పై 'డిఫెండర్' లెటరింగ్‌తో గ్లాస్ బ్లాక్ టచ్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. బోనెట్ ఇన్సర్ట్ , సైడ్ వెంట్స్ కూడా కొత్త టెక్స్చర్డ్ ఫినిష్‌లో తీర్చిదిద్దారు. హెడ్‌లైట్లను చిన్న మోడిఫికేషన్స్‌  చేశారు, ఇందులో ఇప్పుడు గోళాకార LED యూనిట్‌తో రెండు చిన్న LED క్యూబ్‌లు ఉన్నాయి. అదే సమయంలో, టైల్ లైట్లకు డార్క్ టింట్ ఇచ్చారు. ఇది SUVని మరింత స్పోర్టీగా చేస్తుంది.

ఇంజిన్, పవర్‌ట్రెయిన్ 

పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, 2025 డిఫెండర్‌లో ఎలాంటి పెద్ద మార్పులు చేయలేదు. ఇందులో ముందులాగే పవర్‌ఫుల్ ఇంజిన్ ఆప్షన్ అందుబాటులో ఉంటాయి, అవి 4.4L ట్విన్ టర్బో V8, 5.0L సూపర్‌చార్జ్డ్ V8, 3.0L 6-సిలిండర్ డీజిల్ ఇంజిన్, ఒక PHEV (ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్) వెర్షన్. ఈ అన్ని ఇంజిన్లు ఆఫ్-రోడింగ్‌తోపాటు హైవేలో కూడా అద్భుతమైన పనితీరును అందించడానికి ప్రసిద్ధి చెందాయి.

బాడీ స్టైల్, స్పేస్ రేంజ్

కొత్త డిఫెండర్ మూడు బాడీ స్టైల్స్‌లో అందుబాటులో ఉంటుంది. డిఫెండర్ 90, ఇది ఒక కాంపాక్ట్ SUV, డిఫెండర్ 110, ఇది ఒక ఫ్యామిలీ సైజ్ మోడల్, డిఫెండర్ 130, ఇది ఎక్స్‌టెండెడ్ వీల్‌బేస్‌తో ఎక్కువ స్పేస్ , ప్రీమియం అనుభవాన్ని అందిస్తుంది. ఈ అన్ని వేరియంట్లలో ల్యాండ్ రోవర్ బలమైన బిల్డ్ క్వాలిటీ,  ఆఫ్-రోడ్ సామర్థ్యం కొనసాగుతుంది.

లాంచ్ ఎప్పుడు, ధర ఎంత?

భారత్‌లో ఎప్పుడు లాంచ్ అవుతుంది అంటే... దీనిపై కంపెనీ ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. అయితే, 2025 చివరి నాటికి లేదా 2026 ప్రారంభంలో దీన్ని భారత్ మార్కెట్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. దీని అంచనా ధర ప్రస్తుతం ఉన్న మోడల్ కంటే కొంత ఎక్కువగా ఉండవచ్చు, బేస్ వేరియంట్ ధర 95 లక్షల నుంచి 1 కోటి (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చు.