Upcoming SUVs 2025 Under Rs 10 Lakh: ఈ నెల మూడో వారం నుంచి, అంటే 22 సెప్టెంబర్ 2025 నుంచి భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ మరింత వేగం పుంజుకోనుంది. 22 సెప్టెంబర్ 2025 నుంచి GST తగ్గింపు ప్రయోజనం అమల్లోకి వస్తుంది, చాలా పాపులర్ కార్లు చౌకగా మారతాయి. ఈ తరుణంలో, కార్ మేకింగ్ కంపెనీలు కొత్త SUVలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. మీరు ఒక మోడ్రన్ SUVని రూ.10 లక్షల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే, కాస్త వెయిట్ చేయండి.
Maruti Victorisమారుతి సుజుకి, 03 సెప్టెంబర్ 2025న, కొత్త హైబ్రిడ్ SUV "విక్టోరిస్"ని లాంచ్ చేసింది, ఇంకా డెలివెరీలు ప్రారంభించలేదు. దీనిని ARENA డీలర్‌షిప్‌ల నుంచి అమ్ముతారు. Hyundai Creta & Kia Seltos తో ఈ కారు పోటీ పడనుంది. విక్టోరిస్ డిజైన్ చాలా ఆధునికంగా ఉంటుంది. LED హెడ్‌లైట్లు, కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్‌లు & 17-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఇచ్చారు. ఇంటీరియర్ కూడా ప్రీమియంగా ఉంది, 10.25-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో + టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే & 64-రంగు యాంబియంట్ లైటింగ్ ఉన్నాయి.
కొత్త Hybrid SUV విక్టోరిస్ మూడు పవర్‌ట్రెయిన్ ఎంపికల్లో లభిస్తుంది. ఇది 1.5 లీటర్ K15C పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్, 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ & CNG వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. విక్టోరిస్ CNG వేరియంట్ ఈ విభాగంలో మొట్టమొదటి అండర్ బాడీ ట్యాంక్ డిజైన్‌ను కలిగి ఉంది. కంపెనీ చెప్పిన ప్రకారం, CNG వేరియంట్ మైలేజ్ లీటరుకు 28.65 కిలోమీటర్లు. భద్రత కోసం లెవల్-2 ADAS, ఆరు ఎయిర్‌బ్యాగులు & 360-డిగ్రీల కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. విక్టోరిస్ భారత్ NCAP నుండి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా పొందింది. కంపెనీ, ఈ కారు ప్రారంభ ధరను రూ. 10 లక్షల కంటే తక్కువగా నిర్ణయించింది. మీరు కేవలం రూ. 11,000 కే విక్టోరిస్‌ను బుక్ చేసుకోవచ్చు.
Hyundai Venue 2025ఈ పండుగ సీజన్‌లో హ్యుందాయ్ వెన్యూ కొత్త వెర్షన్ కూడా మార్కెట్లోకి రానుంది. కాంపాక్ట్ SUV విభాగంలో వెన్యూ ఇప్పటికే బాగా పాపులర్ అయింది. కొత్త వెన్యూకు అప్‌డేటెడ్ ఫ్రంట్ గ్రిల్, LED హెడ్‌లైట్లు & కొత్త అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఇంటీరియర్‌లో పెద్ద టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జింగ్ & ప్రీమియం సీటింగ్ చూడవచ్చు. ఇంజిన్స్ మారవు - 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ & 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లే ఉంటాయి. ఇంకా, ADAS & సేఫ్టీ ఫీచర్లు అప్‌గ్రేడ్ అవుతాయి. వెన్యూ 2025 మోడల్ ప్రారంభ ధర కూడా రూ. 10 లక్షల కంటే తక్కువగా ఉంటుందని అంచనా. ఇది యూత్‌కు స్టైలిష్ & బడ్జెట్-ఫ్రెండ్లీ SUV.
Tata Punch Facelift 2025టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ 2025 వెర్షన్ ఈ పండుగ సీజన్‌లో లాంచ్ అవుతుంది. బోల్డ్ డిజైన్ & స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో ఈ మైక్రో SUV పాపులర్ అయింది. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో కొత్త గ్రిల్, LED హెడ్‌లైట్లు & కొత్తగా డిజైన్ చేసిన బంపర్ ఉంటాయి. ఇంటీరియర్‌లో పెద్ద టచ్‌స్క్రీన్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ & ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి. టాటా పంచ్ 1.2 లీటర్ పెట్రోల్ & CNG ఇంజిన్ ఎంపికలతో వస్తుంది, మెరుగైన పనితీరు & మైలేజీ ఇస్తుంది. టాటా బలమైన సేఫ్టీ రేటింగ్ & రూ. 10 లక్షల కంటే తక్కువ ప్రారంభ ధర దీనిని బడ్జెట్ విభాగంలో అత్యంత విశ్వసనీయ SUVగా మార్చవచ్చు.