Upcoming Royal Enfield Bikes: భారతీయ కస్టమర్లలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు బాగా ప్రాచుర్యం పొందాయి. వీటిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ నుంచి బుల్లెట్ వరకు చాలా బైక్‌లు ఉన్నాయి. మీరు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్లయితే మీరు కొంచెం వేచి ఉండాల్సిందే. ఎందుకంటే త్వరలో మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు భారత మార్కెట్లోకి ప్రవేశించనున్నాయి. త్వరలో ఏ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లను విడుదల చేయబోతున్నారో తెలుసుకుందాం.
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 (Royal Enfield Classic 650)
అత్యధికంగా అమ్ముడైన మోటార్‌సైకిల్ క్లాసిక్ 350 గ్రాండ్ సక్సెస్ సాధించిన తర్వాత కంపెనీ ఇప్పుడు క్లాసిక్ 650ని భారతీయ మార్కెట్లో విడుదల చేయాలని ఆలోచిస్తోంది. నివేదికల ప్రకారం రాబోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650లో 648 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ అందించనున్నారు. ఇది గరిష్టంగా 47.4 బీహెచ్‌పీ పవర్‌ని, 52.4 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650... 2025 మొదటి త్రైమాసికంలో విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి.
Also Read: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 (Royal Enfield Bullet 650)
రాయల్ ఎన్‌ఫీల్డ్ త్వరలో బుల్లెట్ 650ని విడుదల చేయనుంది. కంపెనీ అందిస్తున్న ఈ మోటార్‌సైకిల్‌లో మీరు చాలా మంచి ఫీచర్లను పొందుతారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 ఇండియన్ రోడ్లపై టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది. ప్రముఖ 648 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650లో అందించే అవకాశం ఉంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 650 (Royal Enfield Himalayan 650)
మీరు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్లయితే హిమాలయన్ 650 కూడా మీకు మంచి ఆప్షన్. వచ్చే ఏడాది పండుగల సీజన్‌లో ఈ బైక్‌ను ప్రవేశపెట్టవచ్చు. హిమాలయన్ 650... ఇంటర్‌సెప్టర్ ట్రేల్లిస్ ఫ్రేమ్‌పై ఆధారపడి ఉండబోతోంది. మీరు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొనాలనుకుంటే రాబోయే కాలంలో ఈ మూడు బైక్‌లలో దేనినైనా కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయవచ్చు.
వీటితో పాటు మరిన్ని బైక్స్‌ను కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంచ్ చేయనుంది. ఇటీవలే రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ కూడా మార్కెట్లోకి వచ్చింది.
Also Read: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!