Upcoming Cars In India 2025: 2025లో, ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణ రాష్ట్రాల్లోకి రాబోయే కార్ల జాబితా కొత్త కస్టమర్లలో గట్టి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇండియాలో పండుగ సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో, ఇక నుంచి ప్రతి నెలా కొత్త మోడల్స్, ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లు, ఎలక్ట్రిక్‌ కార్లు, హైబ్రిడ్‌ మోడల్స్‌ వరుసగా మార్కెట్‌లోకి అడుగు పెట్టబోతున్నాయి. SUVలు, MPVలు, సెడాన్‌లు - అన్ని విభాగాల్లో కొత్త లాంచ్‌లు రానున్నాయి, ఆటోమొబైల్ మార్కెట్ మరింత కదలికలు చురుగ్గా మారనున్నాయి.

రాబోయే బ్రాండ్లు2025లో భారత్‌లోకి, ముఖ్యంగా తెలురు రాష్ట్రాల్లో లాంచ్‌ కానున్న కార్ల జాబితాలో Maruti Suzuki, Hyundai, Tata, Toyota, Volkswagen, Skoda, MG Motor, Renault, Nissan వంటి పాపులర్‌ బ్రాండ్లు ఉన్నాయి. కొత్త SUVలు, హ్యాచ్‌బ్యాక్‌లు, MPVలు వరుసగా లాంచ్ అవుతాయి.

ఎలక్ట్రిక్ కార్ల హవాఎలక్ట్రిక్‌ సెగ్మెంట్‌లో పోటీ మరింత పెరిగింది. టాటా మోటార్స్‌, ఇప్పటికే Harrier EVని లాంచ్ చేసింది. త్వరలో Tata Sierra EV కూడా రాబోతోంది. మారుతి సుజుకీ eVitara, టయోటా Urban Cruiser EV లాంటి మోడల్స్‌ను సిద్ధం చేస్తుంటే, కొత్తగా మార్కెట్లోకి అడుగుపెడుతున్న Vinfast కంపెనీ VF6 (Creta EV రైవల్) & VF7 (Mahindra XEV 9e రైవల్) మోడల్స్‌తో బరిలోకి దిగుతోంది.

హైబ్రిడ్ కార్లలో కొత్త శకంఇటీవలి కాలంలో హైబ్రిడ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం మార్కెట్లో Honda City Hybrid, Toyota Innova Hycross, Maruti Invicto, Toyota Vellfire వంటి మోడల్స్ ఉన్నాయి. త్వరలో Maruti కొత్త SUV & దాని టయోటా వెర్షన్ కూడా హైబ్రిడ్ ఇంజిన్‌తో రానున్నాయి. అదేవిధంగా, Hyundai కూడా తన కార్లను పెట్రోల్-హైబ్రిడ్ వేరియంట్లలో మార్కెట్లోకి తెచ్చే యోచనలో ఉంది. 2026 ప్రారంభంలో లాంచ్ కాబోయే Kia Seltos కూడా హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో వచ్చే అవకాశం ఉంది.

7 సీటర్ కార్ల జాబితాపెద్ద కుటుంబాల కోసం 7 సీటర్ కార్లకు ప్రస్తుతం మంచి డిమాండ్ కొనసాగుతోంది. 2025లో రాబోయే Mahindra XEV 7e EV, MG Majestor SUV, Nissan B MPV (Gravite), Renault Bigster SUV & Nissan 7-seater SUV మోడల్స్ ఈ విభాగాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి.

దమ్ము చూపనున్న SUVలుSUV మార్కెట్‌ ఎప్పుడూ బూమ్‌లోనే ఉంటుంది. 2025లో Hyundai Venue కొత్త వెర్షన్, Tata Sierra, కొత్త Renault Duster, Nissan SUV, Maruti eVitara, Toyota Urban Cruiser EV, Kia Seltos Next-Gen, Maruti Victoris (Escudo SUV) వంటివి వరుసగా లాంచ్ కానున్నాయి.

ఓవరాల్‌గా చూస్తే... 2025లో, ముఖ్యంగా ఈ ఫెస్టివ్‌ సీజన్‌లో, తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్, హైబ్రిడ్, SUV, 7 సీటర్ మోడల్స్ అన్నీ కలిపి భారీ పోటీని తీసుకురాన్నాయి. పండుగ సీజన్‌ కాబట్టి వివిధ ఆఫర్లు కూడా ఉండే అవకాశం ఉంది, ఇప్పటికే కొన్ని కంపెనీలు ఫెస్టివ్‌ ఆఫర్లను ప్రకటించాయి. కొత్త మోడల్ కోసం ఎదురు చూస్తున్న కస్టమర్లకు ఇది బంగారం లాంటి అవకాశం కానుంది.